రేపు కృష్ణా, గుంటూరు జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ ప్రచారం

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఈ నెల 24వ తేదీ ఎన్నిక‌ల ప్ర‌చారం షెడ్యూల్ విడుద‌లైంది. ఆదివారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైయ‌స్ జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తారు.  ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లా రేప‌ల్లెలో పర్యటిస్తారు. అనంతరం 11.30 గంటలకు అదే జిల్లాలోని చిలకలూరిపేటలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణా జిల్లా తిరువూరు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

Back to Top