నెల్లూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజారంజక ప పాలనకు ఆకర్శితులై ఆయా పార్టీల నుంచి అధికార వైయస్ఆర్‌సీపీ గూటికి చేరుతున్నారు. నెల్లూరు రూరల్ పార్టీ సమన్వయకర్త, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో షేక్ ఖాదర్ బాషా, విజయ్, ప్రసాద్ ల ఆధ్వర్యంలో డివిజన్ ఇన్‌చార్జ్‌లు సునీల్, సురేంద్రరెడ్డి, మురళీల సహకారంతో పలువురు వైయస్ఆర్ సీపీ చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆదాల ప్రభాకర్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైయస్ఆర్ సీపీలోకి ఇతర పార్టీల నుండే కాక వివిధ వర్గాల ప్రజలు భారీగా చేరుతున్నారు. రోజురోజుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో వైయస్ఆర్ సీపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. గత వారం రోజులుగా వరుస చేరికలతో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్యాలయం సందడి వాతావరణంతో కలకలాడుతుంది. సోమవారం రూరల్ నియోజకవర్గంలోని 24వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఆ డివిజన్ ఇన్చార్జిలో నీళ్ల సునీల్ యాదవ్, ఇసనాక సురేందర్ రెడ్డి, ఉడత మురళీయాదవ్ ల సహకారంతో షేక్ ఖాదర్ బాషా, పిన్ని ప్రసాద్, నగిరిపాటి విజయ్ ల 200 మంది మిత్ర బృందం వైఎస్ఆర్ సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైయస్ఆర్ సీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధికి ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరేందుకు వచ్చిన వారికి గౌరవప్రదమైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఏ సమస్య వచ్చినా కూడా తామందరం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎంతమంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా వైయస్ఆర్ సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న తనకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. పార్టీల చేరిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఎంపీ ఆదాల చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వైయస్ఆర్ సీపీ చేరిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని విజయ డైరీ చైర్మన్ కొండ రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో 24వ డివిజన్ వైయస్ఆర్ సీపీ నాయకులు చిట్టమూరు విష్ణువర్ధన్ రెడ్డి, కాటూరు శ్రీధర్ రెడ్డి, భారతమ్మ, మైథిలమ్మ, గంపాసునీల్, అరవ గోపి, పీలం అశోక్, గంపా వినోద్, సిహెచ్ సాయి తదితరులతోపాటు నెల్లూరు ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వరరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పాశం శ్రీనివాస్, జిల్లా యూత్ అధ్యక్షులు మంగలపూడి శ్రీకాంత్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.