కర్నూలు జిల్లా: దేవనకొండ మండలం పి. కోటకొండ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు పాలనపై అసంతృప్తితో 100 కుటుంబాలు టీడీపీని వీడి వైయస్ఆర్‌సీపీలో చేరాయి. ఎమ్మెల్యే వీరుపాక్షి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరుపాక్షి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయని, పోలీసులను అడ్డుపెట్టుకుని వైయస్ఆర్‌సీపీ నాయకులపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయని విమర్శించారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయలేక బహిష్కరించిన చరిత్ర చంద్రబాబుదని వీరుపాక్షి విమర్శించారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని గుర్తుచేశారు. రైతులను మోసం చేసిన చంద్రబాబు చంద్రబాబు రైతులను మోసం చేశారని, మహిళలకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వంచించారని వీరుపాక్షి విమర్శించారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఆయనకు రాజకీయంగా కాలం దగ్గరపడిందని వీరుపాక్షి వ్యాఖ్యానించారు.