100 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

మంత్రి కాకాణి స‌మ‌క్షంలో పార్టీలో చేరిన టీడీపీ నేత‌లు

శ్రీ‌పొట్టిశ్రీ‌రాములు నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయింది. ఆ పార్టీ నేత‌లు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆక‌ర్షితులై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, చింతోపు - ఆంజనేయపురం గ్రామంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరాయి.  సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి నాయకత్వంలో రోజు రోజుకి  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరుగుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తిస్థాయిలో తెలుగుదేశం దిగజారిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సోమిరెడ్డికి కనీసం డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేదు.

Back to Top