చంద్రబాబు చేసిన వంచనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

విజ‌య‌న‌గ‌రం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) పిలుపు

గజపతినగరంలో “బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ”  స‌న్నాహ‌క స‌మావేశం

విజ‌య‌న‌గ‌రం:  చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేసిన మోసాలు, వంచ‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని విజ‌య‌న‌గ‌రం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) పిలుపునిచ్చారు. సోమ‌వారం గజపతినగరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం “బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ” కార్యక్రమంపై స‌న్నాహ‌క స‌మావేశం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా  మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) మాట్లాడుతూ..`అధికారం చేపట్టి ఏడాది గడిచినా హామీలను అమలు చేయకుండా చంద్ర‌బాబు డైవర్షన్ పాలిటిక్స్ కు తెర లేపారు. హామీలపై నిలదీసిన వారిని అక్రమ కేసులతో వేధిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు.మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ మేము సిద్ధంగా లేము. ప్రతిపక్షంగా ప్రజల తరఫున ,ప్రజల గొంతుకను వినిపిస్తూనే ఉంటాం..“బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ” కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు పాలనలో చోటుచేసుకుంటున్న అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రతి ఒక కార్యకర్త కృషి చేయాలని అన్నారు. త్వరలో ప్రతి మండలలో "బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ” కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజల ఎదుట చంద్రబాబు పాలనలో జరిగిన మోసాలను తెలియజేసే విధంగా ప్రణాళిక రూపొందించ బడుతుందనన్నారు. ప్రతి కార్యకర్త ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలి, మోసం చేసిన కూటమి పాలకులు నిలదీయాలని పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్,  శాసన మండల సభ్యులు పీవీస్ సురేష్ బాబు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Back to Top