విజయవాడ: రాష్ర్టంలో ఎన్నికల తరుణంలో వివేకం చిత్రం హింసను ప్రేరేపించేదిగాను,ప్రజలను రెచ్చగొట్టేదిగాను ఉందంటూ మార్చి 20 వ తేదీన రాష్ర్ట ఛీఫ్ ఎలక్ర్టోరల్ అధికారికి ఫిర్యాదు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసులో సిబిఐ దర్యాప్తు ఇంకా జరుగుతున్న తరుణంలో యూట్యూబ్ లో ప్రదర్శించడం, లైవ్ స్ర్టీమింగ్ సరికాదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులో పేర్కొంది. చిత్రాన్ని బ్యాన్ చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ నేపధ్యంలో తగిన చర్యలకు డైరక్షన్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన రాష్ర్ట ఛీఫ్ ఎలక్ర్టోరల్ అధికారి కార్యాలయం, అడిషనల్ ఛీఫ్ ఎలక్ర్టోరల్ ఆఫీసర్ హరేందిర ప్రసాద్ . వివేకం చిత్రం లైవ్ స్ర్టీమింగ్ ఆపాలని, యూట్యూబ్ లో సన్నివేశాలు ప్రదర్శించడం ఆపడంతోపాటు, చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించేందుకు తమకు తగిన డైరక్షన్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ర్ట ఛీఫ్ ఎలక్ర్టోరల్ అధికారి కార్యాలయం, అడిషనల్ ఛీఫ్ ఎలక్ర్టోరల్ ఆఫీసర్ హరేందిర ప్రసాద్ లేఖ రాశారు. రాష్ర్టంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో హింసను ప్రేరేపించేదిగాను, రెచ్చగొట్టేవిధంగా ఉన్న వివేకం చిత్రాన్ని లైవ్ స్ర్టీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ఛీఫ్ ఎలక్ర్టోరల్ అధికారికి మార్చి 20 వతేదీన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్ ఎస్ ఎంటరటైన్ మెంట్ వివేకం చిత్రం మాజి ఎంపి వివేకానందరెడ్డి హత్యకేసు కధనం నేపధ్యంలో నిర్మించినట్లుగా ఉంది.అందులో పలు సన్నివేశాలను చూసినట్లయితే రాజకీయపార్టీకి సంబంధించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలను పోలి ఉండేలా చిత్రీకరించారు. అందులో పలు పాత్రలకు సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి పేరు ఇతర పాత్రలను కూడా అదే పేర్లు ఉచ్చరించడం కూడా ఉంది. అటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైయస్ జగన్ గారిని ఢీ ఫేమ్ చేసేలా ఉంది.ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఇది యూట్యూబ్ లలో లైవ్ స్ర్టీమింగ్ కావడం,పలు సన్నివేశాలు సోషల్ మీడియాలో కూడా ప్రదర్శించడం జరుగుతోంది. నిజానికి వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సిబిఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దమైంది. కాబట్టి దీనిని బ్యాన్ చేయాలని ఎన్నికల కమీషన్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 2019 ఎన్నికల సమయంలో ఇదే రీతిలో బయోపిక్ ఆఫ్ పిఎం మోది చిత్రం రూపొందిస్తే అప్పట్లో దానిని బ్యాన్ చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా వివేకం చిత్రాన్ని బ్యాన్ చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.