సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చిన వాగ్ధానాలు చట్టబద్ధం

సమ సమాజ స్థాపనకు చేసిన చట్టాలను ప్రజలు స్వాగతిస్తున్నారు

వైయస్‌ జగన్‌ చట్టాలు అంబేద్కర్, పూలే ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయి

మంత్రి మోపిదేవి వెంకటరమణ

అమరావతి:  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రలో, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను చట్టబద్ధం చేశామని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. రాష్ట్రంలో సమ సమాజ స్థాపనకు చే సిన చట్టాలను ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. సీఎం వైయస్‌ జగన్‌ చట్టాలు అంబేద్కర్, ఫూలే ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  గత ప్రభుత్వం వాగ్ధానాలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం నామినేటెడ్‌ పదవులు, పనులు ఇవ్వడం చారిత్రక నిర్ణయమన్నారు.

మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం కూడా చారిత్రక నిర్ణయంగా అభివర్ణించారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని తెచ్చిన చట్టాన్ని యువత స్వాగతిస్తోందన్నారు. రైతులు నష్టపోకుండా ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేశామన్నారు. రైతుల కోసం ప్రకృతి వైపరీత్యాల నిధికి రూ.2 వేల కోట్లు కేటాయించామన్నారు. ఇప్పటికే సుబాబుల్‌ రైతులను ఆదుకోవాలని నిర్ణయించామని చెప్పారు. కౌలు రైతులకు చట్టబద్ధత కల్పించిన ఏకైక ప్రభుత్వం మాదే అన్నారు. రైతు భరోసా పథకం కౌలు రైతులకు వర్తింపజేసి అండగా నిలబడ్డామన్నారు. కౌలు రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ రాయితీలు ఇస్తున్నామని చెప్పారు.

మార్కెట్‌ కమిటీలకు ఎమ్మెల్యేలను గౌరవాధ్యక్షులుగా నియమించడంతో రైతు సమస్యలు నేరుగా ప్రభుత్వ దృష్టికి వచ్చే అవకాశం ఉందన్నారు. మార్కెట్‌ కమిటీల్లో పాలక మండలి నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థల దోపిడీని అరికట్టే చర్యలను ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. చట్టాల ద్వారా పేదలకు భరోసా కల్పించామని మోపిదేవి వివరించారు. మద్యపాన నిషేధంపై చట్ట తేవడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధొంగా సభలో బిల్లులపై చర్చించామని చెప్పారు. 
 

తాజా ఫోటోలు

Back to Top