60 రోజుల్లోనే హామీలన్ని అమలు

మంత్రి బొత్స సత్యనారాయణ
 

అమరావతి : అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు నాయుడు 600 హామీలను ఇచ్చి 6 హామీలను కూడా నెరవేర్చలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నింటిని అమలు చేస్తున్నామని చెప్పారు.

ఇచ్చిన మాట ప్రకారం యువతకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు.ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. 4లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఒక్కో సచివాలయానికి 10 మందిని నియమిస్తామని చెప్పారు. సుమారు 37.86వేల మంది కార్యదర్శులను నియమిస్తామన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి వారి ద్వారా ప్రభుత్వ పథకాలను డోర్‌ డెలివరీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. 

  చారిత్రాత్మక బిల్లు తీసుకువ‌చ్చాం
అధికారంలోకి వచ్చిన 60రోజుల్లోనే ఎన్నో చారిత్రాత్మక బిల్లును తీసుకొచ్చామని మంత్రి బొత్స సత్యనారయణ అన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం​ రిజర్వేషన్‌ కల్పించామన్నారు. నామినేటేడ్‌ పదవు, నామినేషన్‌ పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ ఇవ్వడం సాహసోపేతమైన నిర్ణయం అన్నారు. చంద్రబాబు నాయుడు ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ద్వేషి అని విమర్శించారు. మంచి పనులకు మద్దతు ఇవ్వకుండా చంద్రబాబు సభ నుంచి పారిపోయారని ఆరోపించారు.  గత ప్రభుత్వం భూముల పేరుతో రాజధానిలో పెద్ద కుంభకోణం చేశారన్నారు. రాజధాని పేరుతో గ్రాఫిక్స్‌ చూపించి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

విజయవాడలో వైయ‌స్ఆర్‌ విగ్రహం ఏర్పాటు
సెప్టెంబర్‌ 2న విజయవాడలో దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌ విగ్రహాన్ని పెట్టే ప్రాంతాన్ని పార్క్‌గా అభివృద్ధి చేస్తామన్నారు.

తాజా వీడియోలు

Back to Top