తాడేపల్లి: అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. అసెంబ్లీ నియోజకవర్గాలకు,పార్లమెంట్ స్థానాలకు సమన్వయకర్తల మార్పులు చేర్పులు చేస్తున్న వైయస్ఆర్‌సీపీ..తాజాగా ఐదో జాబితాను విడుదల చేసింది. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత.. మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్రకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్‌చార్జ్‌ల మార్పును ప్రకటించారు. నాలుగు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిల మార్పును ప్రకటించారు. నెల్లూరు టౌన్ ఎమ్మెల్యేగా ఉన్న పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్‌కు ప్రమోషన్ దక్కింది. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును పార్టీ ప్రకటించింది. అరకు (ఎస్టీ)- రేగం మత్స్యలింగం కాకినాడ(ఎంపీ) -చలమశెట్టి సునీల్ మచిలీపట్నం(ఎంపీ) - సింహాద్రి రమేశ్ బాబు అవనిగడ్డ- డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు నరసరావుపేట(ఎంపీ)-పాలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ సత్యవేడు(ఎస్సీ)- నూకతోటి రాజేష్ తిరుపతి( ఎస్సీ)( ఎంపీ)- మద్దిల గురుమూర్తి ఇదిలా ఉంటే.. తొలి జాబితాలో 11 నియోజకవర్గాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు, మూడో జాబితాలో 21 స్థానాలకు, నాలుగో జాబితాలో 8 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మారుస్తూ వైయస్ఆర్‌సీపీ జాబితాలు విడుదల చేసింది మంత్రి బొత్స సత్యనారాయణ,పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ మేం సిద్ధం అంటూ ఫ్లెక్సీలు కడుతున్న జనసేన దేనికి సిద్దమో ప్రజలకు చెప్పాలి వైయస్ఆర్‌సీపీ సిద్దం అంటే మా పార్టీని సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం చేసుకుంటూ పార్టీ క్యాడర్ సిద్దంగా ఉన్నామని మేం సిద్ధం అని అర్దం. వైయస్ఆర్‌సీపీ సిద్దం అని ఫ్లెక్స్ లు...దానికి ప్రతిగా జనసేన మేము సిద్దం అని ఫ్లెక్సీలు కడుతున్నారంటూ మీడియా అడిగిన ప్రశ్నలపై సజ్జల,మంత్రి బొత్స లు పై విధంగా స్పందించారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ....దేనికి వాళ్ళు సిద్దం..భీమిలి లో ముఖ్యమంత్రి జగన్ గారు సభ ద్వారా లక్షలాది మంది కార్యకర్తలను ఎన్నికలకు సిద్దం చేశారు. ఫిబ్రవరి 3 న ఏలూరులో కూడా సభ ద్వారా పార్టీ క్యాడర్ ను సిద్దం చేస్తున్నారు.మరి జనసేన వాళ్ళు దేనికి సిద్దం అవుతున్నారో నాకైతే తెలియదు అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మా వైపు అయితే మేం కూడా సిధ్దం అని చెప్పడానికి అర్దం ఉంది.ఒక పార్టీగా సింగిల్ గా పోటీకి 175 స్థానాలకు వెళ్తున్నాం. ఒకరుగా వస్తున్నాం అని అనడంలో సవాల్ ఉంది.మొత్తం 175 స్థానాలకు పోటీ చేయలేని వాళ్ళు మందలుగా తప్ప పోటీ చేయలేని వాళ్ళు మేం సంసిధ్దం అని ఎలా అంటారు ఎక్కడయితే ప్లెక్సి కట్టారో అక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తుందా చెప్పండి.. జనసేన నేతలు ఎన్నిస్ధానాలకు సిధ్దం అవుతున్నారు... తెలుగుదేశం వాళ్లు ఎన్ని స్థానాలకు పోటీ చేస్తున్నారు.చెప్పగలరా... వైయస్ జగన్ మొత్తం స్ధానాలకు శంఖారావం పూరించారు.175 అసెంబ్లీ,25 పార్లమెంట్ నియోజకవర్గాలలో పోటీ పెడుతున్నారు.లిస్ట్ లు కూడా అనౌన్స్ చేస్తున్నాం. ముందు వారు కూటమిగా సిధ్దం అంటారా ....లేక పదిపార్టీలు కలిసి సిధ్దం అంటారా చెప్పమనండి. మేం ప్రతి బూత్ లో సిద్దం....ప్రతి గ్రామంలో సిద్దం...ప్రతి నియోజక వర్గంలో సిద్దం అంటాను. జనసేన పోటీలో లేని చోట సిద్దం అని ఎలా అంటుంది చెప్పమనండి.