పెట్టుబడి నుంచి పంట అమ్మకం దాకా... రైతుకు భరోసా ''వైయస్ జగన్''

రేపు రెండో ఏడాది ‘రైతు భరోసా’ సాయం

 49 లక్షలకుపైగా కుటుంబాలకు లబ్ధి

సాగుదారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

 

వ్యవసాయం అంటే జూదం అనుకునే రోజుల నుంచి పంటలంటే పండుగ అనే రోజులు వచ్చాయి. దేశానికి వెన్నెముక లాంటి రైతు వెన్నువిరిచే పాలకుడు మట్టికొట్టుకుపోగా, అన్నదాతను ఆత్మీయంగా ఆదరించే మట్టి ప్రేమికుడు నాయకుడయ్యాడు. వైయస్ జగన్ ..... రైతన్నకు తోడయ్యాడు. 

 

అనాదిగా వ్యవసాయమే ఆధారంగా బ్రతికే భారతావనిలో, అన్నపూర్ణ అని పేరుగాంచిన ఆంధ్రావనిలో కొన్నేళ్ల క్రిందటివరకూ రైతులెందుకు అకాలమరణం పాలయ్యారు? పంట వేసేందుకు పెట్టుబడిలేక, అధికవడ్డీలకు తెచ్చిన అప్పులు భారం మోయలేక, పండిన పంటకు ధర రాక, పంటదాచుకోను చోటు లేక అడుగడుగునా నష్టాలపాలయ్యిన రైతే దుస్థితి నేడు మారింది. రైతుల సమస్యలను దగ్గర నుంచి చూసిన వైయస్ జగన్ వాటి పరిష్కారం దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతుభరోసా మొదలు జలయజ్ఞం వరకూ వ్యవసాయానికి సాయం అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

 

రైతు పంటను చూసుకున్నంత ప్రేమగా రైతును పట్టించుకునే ప్రభుత్వం వచ్చింది. దుక్కిదున్ని పంట వేసే వేళకు పెట్టుబడి సాయం అందుతోంది. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చే బాధ తప్పుతోంది. కోతల సమయానికి మరికాస్త ఆసరా దక్కడంతో పంట చేతికొస్తోంది. పండుగ వేళ కర్షకుడి ఆనందహేలను రెట్టింపు చేసేలా మరోసారి రైతు భరోసా దక్కుతోంది. పంటకాలంలో ఏడాది పొడవునా దశలవారీ పెట్టుబడిసాయం అందిస్తూ రైతుకు అండగా నిలబడుతోంది రైతు భరోసా. 

 

ఈ నెలలోనే ప్రారంభం కానున్న రైతు భరోసా కేంద్రాలు రైతన్నల నేస్తాలు కానున్నాయి. ఏ పంటకు మార్కెట్ ఉంది, నేలకు సత్తువ ఎంతుంది, వాతావరణం ఎలా ఉండబోతోంది అనేది ఇక్కడ తెలిసి పోతుంది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇక్కడే దొరుకుతాయి. ఈ పంటలో నమోదు చేసుకున్న రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరకు తమ పంటలు ఇక్కడే అమ్ముకోవచ్చు. అధిక ధరలు వస్తే మార్కెట్ లో అమ్ముకోవచ్చు . త్వరలో పంటను ధర వచ్చేదాకా నిల్వ చేసుకోవడానికి మండలాలవారీగా శీతల గిడ్డంగుల నిర్మించాలని ఆదేశించారు వైయస్ జగన్. దళారీల బారిన పడి నష్టపోకుండా రైతుల నుంచే నేరుగా పంట కొనుగోళ్లను ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. ఇందుకోసమే రైతు కేంద్రాల వద్ద జనతాబజార్లను ఏర్పాటు చేయబోతోంది. పండ్లు, కూరగాయలు మొదలు అన్ని పంట ఉత్పత్తులూ ఇక్కడ కొనుగోలు చేయచ్చు. మధ్యవర్తులు, దళారుల వ్యవస్థ లేకుండాపోతుంది కనుక రైతు లాభపడతాడు, వినియోగదారుడు నష్టపోకుండా ఉంటాడు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచి లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది ఏపీ ప్రభుత్వం. మునుముందు అన్ని పంట ఉత్పత్తులనూ కొనేందుకు రైతుభరోసా కేంద్రాలు కేంద్రబిందువు కానున్నాయి. 

అడుగడుగునా పంటను రైతు కాపాడుకుంటే...రైతును వెన్నంటి కాచి కాపాడుకుంటానంటున్నారు వైయస్ జగన్.

జలయజ్ఞంలో భాగంగా పోలవరం సహా ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తున్నారు. కాల్వల సామర్థ్యం పెంచుతున్నారు. రానున్న వర్షాకాలంలో ప్రాజెక్టులన్నీ పూర్తిస్థామర్థ్యంతో నిండేలా చర్యలు చేపట్టారు. ప్రకృతి విపత్తుల్లో పంట నష్టం జరిగితే వెంటనే పరిహారం అందించేందుకు విపత్తు సహాయ నిధి ఏర్పాటు చేసారు. రైతు మరణిస్తే కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారం అందించేలా, ఆ సొమ్ము బ్యాంకుల రుణాలకు జప్తుకాకుండా ఉండేలా చట్టం చేసారు.

రైతే రాజన్న రాజన్న మాటను జగనన్న మరోసారి రుజువు చేస్తున్నారు. వ్యవసాయం దండగకాదు పండగ అనేలా రైతుకు లాభసాటిగా మారేలా తోడ్పాటు అందిస్తున్నారు.

Back to Top