వైయ‌స్ జగన్ ని ఎదుర్కోలేక చంద్రబాబు డీలా

నేడు అగౌరవపరిచే మాటలు, అన్‌ పార్లమెంటరీ పదాలు మచ్చుకు కూడా కనిపించడం లేదు

విపక్ష సభ్యులపై విమర్శలను కూడా కళాత్మకంగా, చమత్కారంగా స‌మాధానం

ఉనికి చాటుకోవ‌డానికి చంద్ర‌బాబు పాట్లు

శాస‌న మండలిలో నారా లోకేష్ తీరు ఇందుకు విరుద్ధం 

అమ‌రావ‌తి:  అసెంబ్లీ సెషన్స్ ఎప్పుడూ లేనంత డైనమిక్ గా సాగుతున్నాయి. సామాన్యులు సైతం అసెంబ్లీ సమావేశాలను ఆసక్తిగా చూస్తూ చర్చించుకుంటున్నారు. ఐదేళ్లు సభను నియంతృత్వంతో నడిపిన ప్రభుత్వానికి, సభా సంప్రదాయాలను గౌరవిస్తూ హుందాగా నడిపే ప్రభుత్వానికీ ఉన్న తేడాను గమనిస్తున్నారు. అగౌరవపరిచే మాటలు, అన్‌ పార్లమెంటరీ పదాలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. విపక్ష సభ్యులపై విమర్శలను కూడా కళాత్మకంగా, చమత్కారంగా చేస్తూ సభా మర్యాదను కాపాడుతున్నారు అధికారపార్టీ సభ్యులు. 
అయితే ఇదంతా ప్రతిపక్ష నాయకుడికి కంటగింపుగా ఉంది. అధికారం దూరమైందన్న బాధ ఓ వైపు, తప్పులు ఎత్తి చూపుతున్నారన్న ఉక్రోషం ఇంకోవైపు చంద్రబాబులో అడుగడుగునా కనిపిస్తోంది. తన ఉనికిని చాటుకోవడం కోసం నలభైఏళ్ల అనుభవం, మూడుసార్లు అధికారం, మూడుసార్లు ప్రతిపక్షం అంటూ పదే పదే తన గొప్పలు చెప్పుకుంటున్నారు చంద్రబాబు. ప్రతి చిన్న విషయాన్నీ రాద్ధాంతం చేస్తూ, సభలో చర్చను కొనసాగనివ్వకుండా అడ్డుపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, సభా నియమాలను కూడా కాదని తనకు నచ్చినట్టే జరగాలని మంకు పట్టు పడుతున్నారు. మంత్రుల సమాధానాలకు పదే పదే అడ్డు తగులుతున్నారు. టీడీపీ హయాంలోని అవినీతిపై మాట్లాడనీయకుండా సభలో అల్లరి చేస్తున్నారు. గతంలో తాము చేసిన అక్రమాలను చెప్పనీకుండా అడ్డుపడుతున్నారు. ఇది శాసనసభలో నారా చంద్రబాబు నాయుడి తీరు అయితే అటు శాశన మండలిలో నారా లోకేష్ తీరు కూడా ఇందుకు విరుద్ధంగా ఏమీ లేదు. ముఖ్యమంత్రిపై అనుచిత వాఖ్యలు చేయడం ద్వారా అధికార పార్టీ సభ్యులను రెచ్చగొట్టడమే లక్ష్యంగా లోకేష్ వాఖ్యలు ఉంటున్నాయి. సమస్యలపై చర్చ జరగకుండా సభను తప్పుదారి పట్టించడమే ఈ తండ్రి కొడుకుల ఏకైక లక్ష్యం. తమ అవినీతి పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్నీ, రాష్ట్రానికి జరిగిన నష్టాన్నీ, ఖజానాకు పడిన భారాన్ని అధికారపార్టీ సభ్యులు ఎత్తిచూపుతున్నారు. వారి ప్రభుత్వం చేసిన దుబారా, కాంట్రాక్టుల్లో లొసుగులు, పోలవరం పేర జరిగిన దోపిడీపై మాట్లాడుతున్నారు. ఇదంతా ప్రజలకు చేరకుండా ఉండాలంటే టీడీపీ నాయకులు ఎంచుకున్న మార్గమే అధికారపార్టీ నేతలను, ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను టార్గెట్ చేయడం. సీఎంపై విమర్శలు చేయడం ద్వారా సభ్యులను రెచ్చగొట్టడం, సభలో గందరగోళం సృష్టించడమే నారా చంద్రబాబు, లోకేష్ ల ప్లాన్. 
తమపై, తమ ప్రభుత్వంపై ఏ ఫిర్యాదు వచ్చినా, ఆరోపణ వచ్చిన మరో విషయాన్ని పెద్దగా చేసి చూపి అసలు విషయాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చడం చంద్రబాబుకు అలవాటు. చట్టసభల్లోనూ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అదే విధానం అనుసరిస్తూ తమ అక్రమాలను ప్రజల దృష్టిలో పడనీకుండా ముసుగు వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు బాబు నిజస్వరూపం పూర్తిగా తెలుసు. అందుకే అధికారానికి దరిదాపుల్లో లేకుండా తరిమి కొట్టారు. కొనుగోళ్ల రాజకీయాలు కూడా చేసే అవకాశం లేని స్థాయిలో బాబును కూర్చోబెట్టారు. జగన్ మోహన్ రెడ్డి మీద తప్పుడు ఆరోపణలు చేసి ఎన్నికల్లో గెలవలేకపోయిన చంద్రబాబు, ఇప్పటికీ అదే తరహా ఆరోపణలతో రాజకీయం చేయాలని చూస్తున్నాడు. నలభై ఏళ్ల అనుభవం నలభైఏళ్ల వయసున్న నాయకుడిని ఎదుర్కోలేక దొడ్డిదారులు వెతుక్కోవడం మించిన ఓటమి ఏదైనా ఉంటుందా? 

Back to Top