మా పిల్లలకు మేనమామగా అన్నీ చేస్తున్నారు.. మీకు రుణపడి ఉన్నాం అన్నయ్యా

రమణమ్మ, విద్యార్ధిని తల్లి, పేర్నమిట్ట, సంతనూతలపాడు మండలం, ప్రకాశం జిల్లా 

జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన విద్యార్థులు, త‌ల్లిదండ్రులు 

తాడేప‌ల్లి: మాది చాలా పేద కుటుంబం, నేను కూలికి వెళతాను, నా భర్త ఆటో డ్రైవర్, నా పిల్లలకు అన్నీ ఇస్తున్నారు, పెద్దమ్మాయిని ఇంటర్‌ తర్వాత చదువు ఆపేద్దామనుకునే సమయంలో మీ పథకాలు చూశాం, మా అమ్మాయి గురించి కాలేజీ ఫీజు కట్టలేమని చెబితే కాలేజీ వాళ్ళు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పెట్టారు మీరు చేరండి అని చెప్పారు, మేం కాలేజీకి వెళ్ళి అన్ని చూశాం, మాకు అన్నయ్యలాగా, మా పిల్లలకు మేనమామగా అన్నీ చేస్తున్నారు, మీకు రుణపడి ఉన్నాం అన్నయ్యా,  మీ పథకాల ద్వారా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, వాహనమిత్రలో మా వారు లబ్దిపొందారు, నేను డ్వాక్రా రుణమాఫీ పొందాను, ప్రతీ పేద మహిళా సంతోషంగా ఉందంటే మీరే కారణం, మీరు ఆరోగ్యశ్రీ విషయంలో తండ్రిని మించిన తనయుడిగా చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నా భర్తకు సర్జరీ చేశారు, ఆపరేషన్‌ అయింది, ఇప్పుడు బాగున్నారు, ఇంటి ఇంటికీ రేషన్‌ ఇస్తున్నారు, కరోనా టైంలో మీరు 15 రోజులకోసారి రేషన్‌ ఇచ్చారు, నా పిన్ని భర్త చనిపోతే ఆమెకు ఫించన్‌ ఇచ్చారు, మీరు ఇచ్చే ఫించన్‌ చూసి నా పెద్ద కొడుకు జగన్‌ ఉన్నారని ఆమె ఎంతో మందికి చెప్పింది. మీ పథకాల ద్వారా మా పిల్లలు ఇంకా ఇంకా చదువుకోవాలి, మీరే ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలి, మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేము సార్‌.

ఎల్ల‌కాలం  మీలాంటి ముఖ్యమంత్రి ఉంటే బావుంటుంది:
 గుత్తావుల తేజేశ్వరరావు, విద్యార్ధి, ఆగూరు గ్రామం, రాజాం మండలం శ్రీకాకుళం జిల్లా 

మాది పేద కుటుంబం, నాన్న పల్లెవెలుగు డిపార్ట్‌మెంట్‌లో వీవోఏగా పనిచేస్తున్నారు, నా తమ్ముడు, నేను చదువుతున్నామంటే విద్యా దీవెన, వసతి దీవెన కారణం, గత ప్రభుత్వంలో మెయిన్‌టెనెన్స్, స్కాలర్‌షిప్‌ల ద్వారా వచ్చే డబ్బు హాస్టల్‌ ఖర్చులకు కూడా సరిపోయేది కాదు. మీరు సీఎం అయిన తర్వాత ప్రతీ విద్యార్దికి విద్యాదీవెన, వసతి దీవెన అందుతుంది, మీరు అమలుచేస్తున్న పథకాల ద్వారా బడుగు, బలహీన వర్గాల పిల్లలు కాలేజీలలో చేరారు, మీరు చాలా చేస్తున్నారు, విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద, అమ్మ ఒడి, నాడు నేడు ఇలా చాలా చేశారు, పక్క రాష్ట్రాల విద్యార్ధులు మిమ్మల్ని చూసి ఈర్ష పడుతున్నారు, వారు కూడా మీలాంటి ముఖ్యమంత్రి ఉంటే బావుంటుందని అనుకుంటున్నారు, దేశంలోనే బెస్ట్‌ సీఎంగా మీరు ఉండడం చాలా సంతోషంగా ఉంది, మీకు విద్యార్దులందరి తరపునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్‌

 

నాలాంటి ఎంతోమంది ఆడపిల్లలు మీ వల్ల ధైర్యంగా చదువుకుంటున్నారు:

హరిక, బీటెక్‌ విద్యార్ధిని, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా

మా నాన్నగారు లేరు, ఇప్పటివరకూ అమ్మ, అన్నయ్య కూలిపనులు చేసి చదివిస్తున్నారు, ఫీజులు కట్టలేక చదువు ఆపేద్దామనుకున్నా, కానీ అమ్మ అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తూ ఇంతవరకూ చదివించింది. నాకు జేఎన్‌టీయూ అనంతపురంలో సీట్‌ వచ్చింది, కానీ హాస్టల్‌ ఫీజు, బుక్స్‌కు డబ్బు సరిపోక అప్పు చేయాల్సి వచ్చేది, చదువు మీద కూడా దృష్టిపెట్టలేకపోయాను. మీరు నాకు రూ. 20 వేలు ఇచ్చారు, ఇకనుంచి అప్పు చేయాల్సిన అవసరం లేదు. మీరు విద్యార్ధుల కోసం ఆన్‌లైన్‌ కోర్సులు కూడా పెట్టారు. మీరు వచ్చిన తర్వాత నాకు అన్ని అందాయి, మీరు ల్యాప్‌టాప్‌ కూడా ఇస్తున్నారు, నా చదువుకు సంబంధించి అన్నీ ఇస్తున్నారు, వచ్చే ఏడాదికల్లా నా చేతికి ల్యాప్‌టాప్‌ అందుతుంది, నాకు నాన్న లేకపోయినా మీరు మేనమామగా అన్నీ చేస్తున్నారు, నాలాంటి ఎంతోమంది ఆడపిల్లలు మీ వల్ల ధైర్యంగా చదువుకుంటున్నారు. మీరు చేస్తున్న సహాయం వల్ల నేను కాలేజీ నుంచి బయటికి వచ్చేసరికి మంచి జాబ్‌ సాధిస్తాననే నమ్మకం నాకు వచ్చింది, థాంక్యూ సీఎం సార్‌...

నాలాంటివారికి ఉన్నత చదువులు చదవాలన్న ఆలోచన వచ్చేది కాదు:
ఇష్రత్‌ ఫర్హీన్, ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్, రంగరాయ మెడికల్‌కాలేజి, కాకినాడ 

నేను ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ద్వారా చదువుకుంటున్నాను, నేను బీసీ మైనార్టీ విద్యార్ధిని, మీ నాన్నగారు ప్రవేశపెట్టిన ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ పథకం వల్ల నాలాంటి పేదవాళ్ళు ఉన్నత చదువులు చదువుతున్నారు. లేదంటే నాలాంటివారికి ఉన్నత చదువులు చదవాలన్న ఆలోచన వచ్చేది కాదు. నేను ఎంబీబీఎస్‌ జాయిన్‌ అయినప్పుడు మొదటి రెండేళ్ళు రూ. 10 వేలు వచ్చాయి కానీ ఇప్పుడు జగనన్న వసతి దీవెన ద్వారా నాకు రూ. 20 వేలు వచ్చాయి, మీ నాన్నగారు ఒక అడుగు ముందుకేస్తే మీరు పది అడుగులు ముందుకేసి విద్యావ్యవస్ధను చాలా బాగా అభివృద్ది చేస్తున్నారు. గ్రౌండ్‌లెవల్‌ నుంచి మీరు చేస్తున్నారు, చాలా స్కీమ్స్‌ ఇస్తున్నారు, ఉన్నత విద్య ఉన్నత వర్గాలకే కాకుండా నాలాంటి పేదవారికి కూడా అందేలా చేశారు, మీరు మా కుటుంబ సభ్యుడిగా, నా సోదరుడిగా సాయం చేశారు. మేము కూడా ధైర్యంగా చదువుకోగలుగుతున్నాం. థాంక్యూ సార్‌

తాజా వీడియోలు

Back to Top