ప్ర‌త్యేక హోదా  వాస్త‌వాలు

 

పలు రాష్ట్రాల్లో యున్న ఆర్థిక భౌగోళిక పరిస్థితుల్లో తేడాలను దృష్టిలో యుంచుకొని, మన విధాన నిర్ణేత‌లు ప్రత్యేక హోదాని రూపొందించాడు. మొట్ట మొదటిగా 1969 సం.లో అయిదవ ఆర్థిక సంఘం పై తేడాలు క‌లిగిన‌ రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధుల‌ను ఇవ్వటం జరిగింది. అప్పటి నుండి మన దేశంలో 11 రాష్ట్రాలు ఇప్పటికి కూడా ప్రత్యేక హోదాను కల్గి ఉన్నాయి. జ‌మ్ము కాశ్మీర్, అస్సాం, నాగాలాండ్, హిమాచలప్రదేశ్ మణిపూర్ మేఘాలయ, త్రిపుర, సిక్కిం, అరుణాచలప్రదేశ్, మిజోరామ్. ఉత్తరాఖండ్ మొద‌ల‌గు రాష్ట్రాలు ఈ హోదాను కల్పించేందుకు ప్రభుత్వం ఐదు అంశాలను కొలమానంగా తీసుకుంది. 1. కొండ ప్రాంతాలతో కూడిన దుర్గమ పరిస్థితులు, 2. జ‌నసాంద్రత తక్కువగా ఉండటం/గణనీయమైన గిరిజ‌న జ‌నాభా, 3. ఇతర దేశాలలో ప్యూహాత్మ‌క‌ సరిహద్దు ప్రాంతంగా ఉండటం, 4 ఆర్థిక, మాలిక రంగాల్లో వెనుకబాటుతనం, 5. ఆర్థిక వనరుల కొరత, మ‌రియు అభివృద్ధి అవసరాల నిమిత్తం అవసరమైన నిధులను సేకరించుకోగల శక్తి లేకపోవటం.

ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలు

 •  రాష్ట్రాలకు కేంద్రం చేసే ఆర్థిక సహాయంలో సాధారణంగా 60/70 శాతం అప్పుగాను 30/40 శాతం స‌హ‌యంగాను ఉంటుంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర స‌హాయంలో ఇచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంటు గాను, 10 శాతం మాత్రమే అప్పుగా ఇవ్వటం ఇరుగుతోంది. ఇక ఇచ్చే నిధుల కేటాయింపులో 30 శాతం నిధులను ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు ఇచ్చి మిగిలిన 70 శాతం నిధులను మిగతా అన్ని రాష్ట్రాలకు పంపబడుతుంది అంటే ప్రత్యేక హోదా  రాష్ట్రాలకు కేటాయింపులు భారీగా/హెచ్చుగా ఉండి రాష్ట్రాభివృద్ధికి దోహదపడటం మనంద‌రికి విధిత‌మే. 
 •  
 •  హెచ్చు కేటాయింపులతో పాటు.. ప్రత్యేక హోదా ఈ కింద చూప‌బ‌డిన ఇతర రాయితీలు ఇచ్చే అవ‌కాశాలు  ఉంటాయి.
 •  పారిశ్రాక వృద్ధిలో భాగంగా పెట్టుబడుల్లో 30 శాతం సబ్సిడీ.
 •  కేంద్రం ఉంచే ఎక్సైజ్ సుంకంలో 10 శాతం రాయితీ. 
 • * ఆదాయం పన్నులో 100 శాతం రాయితీ లేదా ద‌శ‌ల వారిగా భారీ త‌గ్గింపులు.
 • విభజన జ‌రిగిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి, ఆర్థిక వనరుల కొర‌త‌, పెట్టుబడి సమీకరణల్లో స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో వుంచుకొని నాటి ప్రధాని పార్లమెంట్ సాక్షిగా నూతనంగా ఏర్ప‌డిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను 5 సంవత్సరాల పాటు ఉండే విధంగా ప్రకటించటం జరిగింది. ఈ హోదాను పొందుటకు అవసరమైన అన్ని అర్హతలు, బ‌లవంతంగా ఏర్పాటు చేసిన మన రాష్ట్రానికి ఉన్నాయి. రాష్ట్ర ప్రజల జీవనోపాధి అభివృద్ధికి, ఉద్యోగావకాశాల కల్పనకు మౌలిక వసతుల అభివృద్ధికి పారిశ్రామిక వృద్దితో అన్ని రంగాల్లో ప్రగతిని సాధించేందుకు ఇతోధికంగా దోహదపడేందుకే,
 • హెచ్చు స్థాయిలో నిధులు రాయితీలలో, ఈ ప్రత్యేక హోదా ప్రతిపత్తి హామీని దేశ ప్రధానే పార్లమెంటు సాక్షిగా ప్రకటించటం జరిగింది.
 • హోదా వల్ల కల్గే లాభాలు:
 •  రాజ్యసభలో కె.పి. త్యాగి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాటి ఆర్థిక శాఖా మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ హోదా వల్ల ప్రయోజనాలను వివ‌రించ‌డం జరిగింది.
 •  హోదా ఇచ్చాక 13 సం.రాల్లో హిమాచల్ లో (68 ల. జనాభా) దాదాపు 10864 పరిశ్రమలు వచ్చాయని, 15324 కోట్ల పెట్టుబడులలో 1,29,443 మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలియజేశారు.
 • కోటి జనాభా గల ఉత్తరాఖండ్ లో 30224 పరిశ్రమలూ, 35,343 కోట్ల పెట్టుబడులలో 2,45,573 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చాయని కూడా తెలిపారు.
 •  హోదా నిరాకరణకు సూత్రధారిగా యున్న నాటి కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు స్వయంగా, ఈ రాయితీలను చూపించి, ఉత్తరాఖండ్ లో యూనివర్సల్ ఇండ‌స్ట్రీస్ ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయటం హోదా వల్ల కలిగే ప్రయోజనాల‌కు ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం.
 •  
 • * ప్రణాళికేతర సహాయంగా రెవెన్యూ లోటు భర్తీ కోసం 8 ప్రత్యేక హోదా రాష్ట్రాలకు 13వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు వివ‌రాలు:
 • రాష్ట్ర కోట్లలో (రూ)   మొత్తమ్ రెవెన్యూ వసూళ్ళలో శాతమ్
 •  
 • హిమాఛల్ ప్రదేశ్ 1883 11.5
 • మణిపూర్ 1379 17.8
 • మిజోరమ్ 819 18.9
 • మేఘాలయ‌ 1030 14.4
 • త్రిపుర‌ 1030 14.4
 • అరుణాఛల్ ప్రదేశ్ 623 9.6
 • నాగాలాడ్ 1719 26.4
 • జమ్ము కాశ్మీర్ 3355 11.2
 •  ఇంత స్పష్టంగా గణాంకాలు తెల్పుతుంటే హోదా వల్ల వచ్చేది పెద్దగా లేదని సి.యం. చెప్పడం ఎంత దారుణం?
 •  పారిశ్రాకవేత్త అయిన ఎంపీ గల్లా జయదేవ్ ఉత్తరాఖండ్ లో అమర రాజా కోసం స్థలం కొనటం జరిగింది.
 •  అదే చోట అవశక్తి బయో యూనిట్ ప్లాంటు పెట్టడం జరిగింది.
 •  ఎంపి సియం రమేష్ రాయితీలున్నాయనే ఈశాన్య రాష్ట్రాల్లో విద్యుత్ ప్లాంట్ నెలకొల్పారు. 
 •  కొండ ప్రాంతాలైన హిమాచల్ లో రెడ్డీ ల్యాబోరేటరీ, హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మా, ర్యానబాక్సీ, సిప్లా, టొరెంటో, పనాసియా, క్యాడిలా వంటి ఫార్మా దిగ్గజాలు నెలకొని యున్నాయి. వీటితో పాటు నెస్లే, దాబర్, వర్థమాన్, బిర్లా, టీవీయస్ మోటార్సు, ఎసిసి, అంబుజా మైక్రోటెక్ లాంటివన్ని యున్నాయి.
 •  పన్ను రాయితీల వల్లే ఉత్తరాఖండ్ రాకపోకలు సరిగా లేని కొండ ప్రాంతమైన కూడా పిల్ట్రాన్, హెచ్ సియల్, విప్రో, బ్రిటానియా, డాబర్ హిందుస్తాన్ యూనీలవర్ మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ తదితర ప్రముఖ సంస్థల యూనిట్లు నెలకొల్పటం జరిగింది.
 •  వాస్తవాలు ఇలా ఉంటే వీటికి భిన్నంగా హోదా వల్ల ఏం రాదనటం ఊసరవెల్లి రాజకీయాలకు పరాకాష్ట
 • రాష్ట్ర విభజనలోను / ప్రత్యేక హోదా విష‌యంలోను భారతీయ జనతాపార్టీ పాత్ర:
 • ఉమ్మడి రాష్ట్రాన్ని రెండుగా విభజించటంలో ప్రముఖ పాత్ర పోషించింది భారతీయ జనతా పార్టీ కూడా, తెలుగుదేశం వ్రాసిన లేఖ వల్లనే తెలంగాణా వీలైంద‌ని వారు చెబితే, పెద్దమ్మ సోనియాతో పాటు, చిన్నమ్మగా తననూ గుర్తు పెట్టుకోవాలని బిజెపి నాటి ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్ చెప్పటం అందరికీ గుర్తుండే యుంటుంది. అటువంటి బిజెపీలో అటు తెలంగాణాలోను, ఎ.పి. లోను పొత్తు పెట్టుకోవటం తెలుగుదేశం పార్టీకే చెల్లింది. అదే రకంగా తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని బిజెపి ప్రధాని అభ్యర్థి తెలంగాణాకు సంబంధించి వ్యాఖ్యానించటం జరిగింది.
 •  ఎ.పి. బిజెపి ఎన్నికల ప్రణాళికలో 10 సం.రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేశారు.
 •  ప్రత్యేక హోదా అనేది సెంటిమెంట్ కాదు, కమిట్‌మెంట్ అని చెప్పిన మాటకు విశ్వ‌స‌తీయ‌త లేద‌ని తేల్చారు.
 •  హోదా ముగిసిన అధ్యాయం అని బిజెపి నేటికి అదే మాటను వల్లె వేస్తుంది.
 •  ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం వద్దన్నదని ఒక అబద్దాన్ని చెప్పటం జరిగింది. ఈ ఆర్థిక సంఘ అధ్యక్షుల వారే వారికిచ్చిన ప్రస్తావనలో (2013 సం.లో) ఈ అంశమే లేదని తేల్చి చెప్పటం గమనించుకోవాలి.
 •  కాంగ్రెస్ ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చలేదని మరో పస లేని వాదన ప్రస్తుతం బిజెపి చేస్తుంది. నిజానికి నాడు పార్లమెంట్లో 5 సం.రాలే కాదు, 10 సం.లు కూడా అవసరమని బిజెపి వారే వక్కాణించారు. 
 •  నీతి అయోగ్ ద్వారా హోదాపై నిర్ణయం తీసుకొంటారని అటు వెంకయ్యనాయుడు గారు ఇటు సి.ఎం గారు నమ్మబలికారు. గాని, ప్రధాని అధ్యక్షులుగా యున్న నీతి అయోగ్ లోని ఉపాధ్యక్షుల వారు మాకు ఆ అంశంలో సంబందమే లేదన్నారు.
 • - భజన చట్టంలో హోదా అంశాన్ని చేర్చలేదనేది పసలేని వాదన. 2013 సం.లో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశాలు ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలని 'మినిట్స్' కూడా రాశారు. ఆ నిర్ణయం ప్రకారం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అమలు చేయవలసిన అవసరం యుంది. కాని చేయలేదు కారణం ఇష్టం లేకనే.
 • ప్యాకేజ్ పాచికః
 •  ప్రత్యేక హోదా విష‌య‌మై దాటవేత సాధ్యం కాదని గ్రహించి తారక మంత్రం లాంటి ఫార్ములా ప్ర‌త్యేక ప్యాకేజీ రూపంలో కనిపెట్టినట్లు వెంకయ్యనాయుడు, సీఎం, సుజనా చౌదరి గార్లు ప్ర‌చారం చేశారు.
 •  ఆర్థిక మంత్రి జైట్లీ గారు సెప్టెంబరు 8 రాత్రి క్లుప్తంగా ప్యాకేజీ విష‌యంపై ప్రకటించారు.
 • “హోదా వల్ల వచ్చే దానికి ఇపుడు ఇచ్చే దానికి మధ్య తేడాను చెల్లింపు చేస్తాం. ఎలానంటే విదేశాల దగ్గర అప్పుతెచ్చుకొని పూర్తి చేసుకొంటే ఎక్సటర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టు పథకాల ఖర్చు భరిస్తామన్నారు". అది ఎలా జరగాలనే దానిపై ఏకాభిప్రాయం లేక ఏ ప్రయోజనం లేకపోయిందని ఇపుడు అందరూ ఒప్పుకొంటున్నారు.
 •  
 •  రెవెన్యూ లోటు లెక్క కట్టి ఇస్తాం అన్నారు గాని అసలు అలాంటి తేల్చే పద్దతి అంటూ లేదని జైట్లీయే ఇప్పుడు చెప్పారు.
 •  ఈ బూటక ప్యాకేజీ వివ‌రాలను వెబ్ సైట్లో చూసుకోమన్నారు. కాని దీనిపై వివరణాత్మకతతో కూడిన వివరాలు ఏమాత్రం లేవు.
 • - ప్రత్యేక హోదా ఇవ్వక పోవడంపై తగు ఆధారాలు విడుదల చేస్తామన్నారు. కాని వైబ్ సైట్ లో పొందుపర్చిన 2-29, 2-30 పేరాల్లో ఎక్కడా హోదాను తొలగించాలని గాని, వద్దని గాని లేదు. నిధుల కేటాయింపు, లోటు లెక్కవేసే విధానం మాత్రమే యుంది. హోదా వివ‌ర‌ణ‌పై ప్రభుత్వ డొల్లతనం బయటపడింది.  
 • ఇంతటి అర్థరహిత, నిరుపయోగమైన ప్యాకేజీకే మురిసిపోయిన సి.ఎం. అర్థరాత్రి మీడియాను పిల్చి హోదాపై రాజీ లేదని, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత క‌ల్పించినందుకు గాను కేంద్రానికి కృత‌జ్ఞ‌త‌లు తెల్పుతూ శాస‌నస‌భ‌లో సీఎం సుదీర్ఘ ప్ర‌సంగం చేసి హోదాకు స‌మాన‌మైన సాయం అందినట్టేనని నమ్మబలికారు. సంఖ్యాపరమైన స్పష్టత ఇవ్వకపోయినా మురిసిపోయారు. 
 •  ఈ ప్యాకేజీపై పరవశిస్తూ వెంకయ్యనాయుడు గారు ఊరూరా సన్మానాలు చేయించుకొంటూ ఆంధ్రప్రదేశ్ వెలుగుల ఆంధ్రప్రదేశ్ గా మారిందన్నారు. అదే సభలో సి.ఎం గారు పులకించిపోతూ ఇదొక చారిత్రక విజ‌యమని చెప్పారు. 
 •  అప్పటినుండి రెట్టించిన ఉత్సాహంలో ప్యాకేజీ విజ‌యాలపై ప్రచారం ఎలా నడిచిందో చదవండి.
 •  ప్రత్యేక హోదాలో ఏం వస్తుంది? ప్యాకేజీ వద్దంటే పరిశ్రమలే రావని సి.ఎం గారన్నారు. (11-9-2016)
 •  పారిశ్రాక రాయితీలకు హోదాకు సంబంధం లేదు, హోదాలో పరిశ్రమలు రావన్నారు (16-9-2016)
 •  ప్రత్యేక హోదాతో ప్రయోజనం సున్నా? అందువల్ల పారిశ్రామిక రాయితీలు రావు. వస్తాయని నిరూపిస్తే దేనికైనా సిద్దం. (18-9-2016)
 •  హోదా కన్నా మెరుగైన ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది, దీనిపై బాగా ప్రచారం చేయాలని తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు ఆదేశాలివ్వటంతో పాటు, స్వయంగా సి.ఎం గారే కొన్ని కాలేజీల్లో ప్రసంగించారు. (23-9-2016)
 •  మా ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి వరాల వర్షం కురిపిస్తుంటే కొందరు దుష్పచారం చేస్తున్నారని వెంకయ్యనాయుడు గారు జ్యోతి పత్రికల్లో వ్యాసం రాశారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రానికి ఇంత సహాయం చేయలేదని వ్యాఖ్య. ఎంత అపద్ధం (10-10-2016)
 •  1981 కోట్ల నాబార్డు రుణం, మహారాష్ట్ర, గుజరాత్ లకు ఎక్కువగాను ఎ.పి. పోలవరం కు అంతకంటే తక్కువ మొత్తం ఉండే చెక్కు ఇచ్చినా పెద్ద ఫోటోలో ఆర్భాటంగా ప్రచారం. తన జీతంలో మరచిపోలేని రోజన్న సి.ఎం చంద్రబాబు గారు (26-12-2016)
 •  పోలవరం కాంక్రీటు పనులు ప్రారంభిస్తూ మరోసారి కేంద్రానికి పొగడ్తలు, విమ‌ర్శకులపై దాడి (30-12-2016)
 •  హోదాను మించిన ఆదా ఆంటూ ప్యాకేజీపై వెంకయ్య ప్రాస (31-1-2018) 
 •  హోదా దండగ ప్రత్యేక హోదా యున్న రాష్ట్రాల్లో పారిశ్రాక రాయితీలు లేవన్న సి.ఎం (4-2-2017) ఎంత వక్రీకరణ.
 •  హోదా గురించి వారెవరికీ తెలీదు. నేనే పట్టుబట్టి సాధించానన్న వెంకయ్య (5-2-2017) ఎంత అతిశయోక్తి.
 •  గుంటూరు జిల్లాలో మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభ సభలో, హోదా పేరులో కొందరు అనవసరంగా రభస చేస్తున్నారని ముఖ్యమంత్రి చిటపటలు (6-2-2017
 • * నాటి ప్రధాని శ్రీ మన్ మోహన్ సింగ్ ప్రకటనలో ఇచ్చిన హామీలు:
 • 1. కేంద్ర సహాయంలో భాగంగా 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కు 5 సం.రాల పాటు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించడం జరుగుతుంది. ఇందువల్ల రాష్ట్ర ఆర్థిక వనరులు బలపడతాయి.
 • 2 కేంద్ర ప్రభుత్వం తగిన ఆర్థిక చర్యలు తీసుకుంటుందని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో పారిశ్రామీకీకరణ వృద్ధికి ప్రోత్సాహకాలు కల్పిస్తామన్నారు.
 • 3. ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన ప్రాంతాలకు (రాయలసీమ, ఉత్తరకోస్తా జిల్లాలు) ప్రత్యేక ప్రణాళిక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో బుందేల్ ఖండ్ తరహాలో యుంటుంది.
 • 4. పోలవరం ప్రాజెక్టును అమలు చేస్తుందని, సందేహం అవసరం లేదు.
 • 5. నోటిఫైడ్ తేదీకి అనుగుణంగా రాష్ట్ర నియామక తేదీలు ప్రకటిస్తారు 
 • 6. నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి ఏర్పడే వనరుల లోటును కేంద్ర బడ్జెట్ ద్వారా నిధులను కేటాయిస్తారు.
 •  రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదాపై ఊసరవెల్లి మాదిరి తరచుగా అభిప్రాయాలను పలుమార్లు ఎందుకు మార్చుకొనటం జరిగింది.
 • - ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే నినాదంలో మార్మోగుతుంటే చాలా కాలం పిల్లి మొగ్గలు వేసిన తెలుగుదేశం ప్రభుత్వం కూడా మాట మార్చింది.
 • - హోదా సంజీవని కాదన్నవారే ఇప్పుడు అదే సర్వస్వం అంటున్నారు. పైపెచ్చు తామే అందుకోసం పోరాడే వీరోచిత పాత్ర పోషిస్తున్నట్లు నటిస్తూంది. అన్ని అవకాశాలు దాటిన తర్వాత అఖిలపక్షం వేసి అపహాస్యానికి గురైంది.
 •  నాలుగేళ్ళుగా కేంద్ర ప్రభుత్వంలో భాగ‌స్వామిగా యుంటూ కేంద్ర నేతలను సన్మానించటం, అభినందనలలో తీర్మానాలు చేయటం, కేంద్రం నుండి ఎంతో లబ్దిపొందుతున్నట్లు అందరిని మాయ చేస్తూ, ఉన్నట్టుండి మాట మారిస్తే, నమ్మేంత ప్రజలు అమాయకులు కారు.
 •  రాజకీయ పరంగా సొంత పార్టీ లబ్ది కొరకు ఎన్డీయే లోంచి బయటకు వచ్చి, అధికార, ప్రతిపక్షపార్టీలందరిని దుయ్యబట్టడం, తామేదో అపర సత్యసందులైనట్లు, బాకా ఊదుకోవటం ప్రజలందరు నిశితంగా గమనిస్తున్నారు. 
 •  ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను నమ్మించేందుకు ఎంతగా ప్రయత్నించిన ప్రజలు వారి అసత్య వాదనలతో ఏకీభవించక, తగిన గుణపాఠం చెప్పేందుకు అవకాశాల కోసం కసితో వేచియున్నారు.
 •  ఇచ్చిన హామీలను వమ్ముచేసిన కేంద్రం రాజకీయ రాజ్యాంగ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి రకరకాల అసత్యాలు ప్రచారంలో పెడుతున్నది. ప్రజల్లో వెల్లువెత్తిన నిరసన జ్వాలలలో తెలుగుదేశం ఊసరవెల్లిలా మాట మార్చిందే గాని, మొదటి నుండి బిజెపిలో అంటకాగి, రాష్ట్రానికి రావలసిన నిధులను రాబట్టుకోవటంలో విఫ‌లమై, స్వలాభాలను అనూహ్యంగా పెంచుకొనుటలో సఫలీకృతమైంది.
 •  కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నంతవరకు, రాష్ట్రానికి అధికారికంగా రావలసిన నిధులను రాబట్టేందుకు ముమ్మర కృషి చేయకుండానే, ప్రత్యేక హోదా రాదని తెలిసి కూడా ప్రజలను మభ్య పెట్టి, అంతకన్నా మెరుగైన ప్యాకేజీ వస్తున్నట్లు ప్రజలను భ్రమింప‌జేసి, ప్రతిపక్షాలను అభివృద్ధి నిరోధకులుగా చిత్రించి రాజకీయలబ్ది పొందేందుకు ప్రయత్నించి అపహాస్యానికి గురైంది.
 •  రాష్ట్ర భజనకు అంగీకారం తెల్పి, మరోవైపు సమన్యాయం కావాలని నిరాహారదీక్ష‌లు బూటకంగా జరిపి, భజనలో ప్రముఖ పాత్ర పోషించిన బిజెపీ, కాంగ్రెస్ లలోనే పొత్తు పెట్టుకొని రాజకీయ లబ్ది కొరకు రాష్ట్ర శ్రేయస్సును తాకట్టు పెట్టడం జరిగింది.
 • ఆర్థిక శాఖాధికారులు అప్పులు పెరుగుతున్నాయ‌ని వ‌న‌రుల క్షీణ‌త‌ను ప‌లుసార్లు ప్ర‌భుత్వ దృష్టికి తెచ్చినా సీఎం మ‌రియు వెంక‌య్య గార్లు పోటాపోటీగా ప‌ర‌స్ప‌ర పొగ‌డ్త‌ల‌తోనే కాల‌యాప‌న చేశారు.
 •  ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం, నాయకులు మంత్రివర్యులు శాసన/పార్లమెంటు సభ్యులు ముక్త కంఠంలో చిత్తశుద్ధితో ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఒప్పించి ఒత్తిడిని పెంచి సాధించుకోలేకపోయింది. కారణం పటిష్టమైన, దీక్షా దక్షలతో కూడిన విశ్వ‌స‌నీయత గల్గిన నాయకత్వం లేకనూ, పార్టీ పరంగాను ప్రభుత్వం పరంగాను ఉన్న లోపాల వల్ల కేంద్రాన్ని గట్టిగా నిలదీసే ధైర్యం చేయలేక, వారి స్వంత ప్రయోజనాల కొరకు, హోదాను సాధించుటలో విఫలం చెందారు.
 •  ప్రత్యేక హోదాపై ప్రజల నుండి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక మొక్కుబడి కేంద్రంపై ఒత్తిడిని పెంచినట్లు నటిస్తూ ప్యాకేజీ వైపు ప్రజల దృష్టి మరల్చి అక్కడ కూడా కేంద్రం నుంచి నిధులను రాబట్టలేకపోయారు.
 •  వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు, ఇతర ప్రతిపక్ష పార్టీలను నిరంతరం దోషులుగా చిత్రీకరిస్తూ కాలం వెల్లబుచ్చారు, ఇంతకాలం.
 •  ఈ మధ్య కాలంలో, కేంద్ర అధికార పార్టీ రాజకీయ స్వలాభాలకు దోహదకారిగా లేదని, ఆ పార్టీకి దూరమై, కేంద్ర అధికారపార్టీని తీవ్రంగా విమ‌ర్శిస్తూ, ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ, ప్రజల సంక్షేమాలను అభివృద్ధి చేయలేక, అందుకు కారణం కేంద్రం మరియు ప్రతిపక్షాలే కారణమని గోబెల్స్ ప్రచారం చేస్తూ ప్రజల ఆదరణ కోల్పోయి నిరాశ, నిస్పృహలలో కాలం వెల్లబుచ్చుతున్నారు. 
 • ఈ పరిస్థితుల్లో ఎటువంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని మనం కోరుకుంటున్నాము:
 •  రాష్ట్ర భజన చట్టంలో భాగంగా కల్పించిన హామీలలో ప్రధానమైన ప్రత్యేక హోదా వల్ల ఆర్థికం గాను, పారిశ్రామికం గాను, ఉద్యోగావకాశాలతో పాటు సమగ్ర అభివృద్ధికి దోహదకారి అవుతుందని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా కల్గిన, రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో యుంచుకొని మొదటి నుండి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను హామీ మేరకు సాధించుటకు అహర్నిశలు కృషి చేసింది. 
 • ప్రత్యేక హోదా వల్ల కల్గే విస్తృత ప్రయోజనాలను దృష్టిలో యుంచుకొని రాష్ట్ర ప్రజానీకాన్ని జాగృతం చేసి, చైతన్యంలో హోదా సాధించేందుకు కార్మోఖుల‌ను చేయ‌టంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింది.
 •  ఇందులో భాగంగా పార్లమెంటులో ప్రత్యేక హోదా అమలు చేయుటకు తగిన విధంగా చర్చలను కొనసాగించి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో ఒత్తిడిని పెంపొందించింది.
 •  ఈ ప్రక్రియలో భాగంగానే తమ పార్లమెంట్ సభ్యులచే నిరసన తెలియజేసేందుకు రాజీనామాలను సమర్పించి వాటిని ఆమోదింపజేసుకొని, మొదటి నుండి విశ్వ‌స‌నీయ‌త‌తో నిబద్దతలో ప్రత్యేక హోదా ఇచ్చే ప్రభుత్వానికి మద్దతు అని నినాదించి ఆ దిశగా మున్మురంగా కృషి చేస్తుంది. 
 •  ప్రజలకు ఉపయుక్తమైన కార్యక్రమాలు చేపట్టటంలో వాటి ఆకాంక్షలను తీర్చుటకు ఇచ్చిన హామీల మాటను ఏమాత్రం మార్చకుండా నిబద్దతలో, విశ్వ‌స‌నీయతలో నిరంతరం కృషి చేస్తూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి యున్న నాయకత్వాన్ని మనందరం కోరుకోవాలని ఆశిస్తున్నాం.
 •  క్షణంకో మాట మార్చే వ్యక్తుల్ని, అబద్దాలను నిజాలుగా వల్లెవేస్తూ అసమర్థులను, అనీతి కూపంలో కూరుకుపోయిన స్వార్థపరులను, సంకుచిత రాజకీయాలను ప్రోత్సహించాలా, లేక..
 •  నీతి నిజాయితీలలో, నిబద్ధత కల్గి, ప్రజల ఆకాంక్షల మేరకు ఇచ్చి హామీలను అమలు పరచుటలో చిత్తశుద్ధితో పనిచేసే నాయకత్వం ప్రజలు నిర్ణయించుకోవలసిన సమయం ఆసన్నమైంది. 
 •  ఆ దిశగానే ప్రజలందరూ కూడా వైయస్సార్ నాయకత్వాన్ని బలపరుస్తూ, వారి పాదయాత్రలో ఇతోధికంగా పాల్గొని ప్రజలు తెలిపిన స్పందన శ్లాఘనీయం. ఇదే స్పూర్తితో ప్రజలందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి రాష్ట్ర ప్రజలమనోకాంక్షలను నెరవేర్చుటకు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తారని ప్రగాడంగా విశ్వ‌సిస్తున్నాము.
Back to Top