పొక్కుతున్న ప‌చ్చ నిజాలు

ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ భారీగా ప్ర‌చారం చేసుకున్న ప‌సుపు కుంకుమ‌, అన్న‌దాతా సుఖీభ‌వ‌కు సంబంధించిన నిజాలు ఒక్కొక్క‌టిగా వెలుగు చూస్తున్నాయి. ప‌సుపు కుంకుమ సొమ్ములు కొన్ని చోట్ల మ‌హిళ‌ల‌కు అంద‌క‌పోవ‌డంతో వారు బ్యాంకుల వ‌ద్ద ఆందోళ‌న‌లు చేశారు. కొన్ని చోట్ల ఆ చెక్కుల‌ను అప్పుకు జ‌మ చేసుకుంటామ‌ని బ్యాంకులు డ‌బ్బులు ఎగ్గొట్టిన క‌థ‌లూ జ‌రిగాయి. ఇక అన్న‌దాతా సుఖీభ‌వ పేరుతో చంద్ర‌బాబు ఇచ్చిన ద‌ఫాల‌వారీ సొమ్ము భూమి లేని వారికి కూడా అంద‌డం ఆశ్చ‌ర్యం గొలిపింది. తెలంగాణా ప్ర‌భుత్వం ప్రారంభించిన రైతు బంధునే పేరుమార్చి ఎన్నిక‌ల ముందు వాడుకున్న చంద్ర‌బాబు అందులో కేంద్రం వాటా కూడా ఉంద‌న్న విష‌యాన్ని దాచాల‌ని ప్ర‌య‌త్నించి న‌వ్వుల పాల‌య్యాడు. తీరా ఎన్నిక‌ల త‌ర్వాత ఈ రెండు ప‌థ‌కాల‌కు వినియోగించిన సొమ్మంతా వివిధ శాఖ‌ల‌కు సంబంధించిన డ‌బ్బ‌ని తేలుతోంది. ట్రెజ‌రీల‌కు సంబంధించిన నిధులు, న్యాయ శాఖ‌లో జడ్జీల అండ‌ర్ లో ఉండే నిధులు, ప్ర‌భుత్వోద్యోగుల‌కు సంబంధించిన పీఎఫ్ నిధుల‌ను ప‌సుపు కుంకుమ‌, అన్న‌దాతా ప‌థ‌కాల‌కు మ‌ళ్లించేసారు. ఇప్పుడు ఆయా శాఖ‌ల‌కు సంబంధించి నిధుల కొర‌త‌తో ఎన్నో కొత్త స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డుతున్నాయి. 

రాష్ట్రంలో 191 మార్కెటింగ్ క‌మిటీల్లో 2000 మందికి చెక్కులు పంపిణీ చేసారు. కానీ నిధులు ఇంత‌వ‌ర‌కూ బ్యాంకుకు జ‌మ కాలేదు. దీంతో అటు గోదాముల్లో స‌రుకు అమ్ముకోలేక, ప‌థ‌కం వ‌ల్ల రుణానికి నోచుకోక రైతులు న‌ష్ట‌పోతున్నారు. 5000 కోట్ల‌తో ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి అని చెప్పిన  చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మాట‌లు వ‌ట్టి గాలి మాట‌లే. జ‌న‌వ‌రిలో రైతుబంధు రుణాల కోసం 30 కోట్లు విడుద‌ల చేసినా అందులో ఒక్క రూపాయి కూడా రైతుల‌కు చేర‌లేదు. ఇంతేకాదు మార్కెటింగ్ క‌మిటీల నిధులూ ప‌క్క‌దారి ప‌ట్టాయి. ఇవ‌న్నీ ప‌సుపు కుంకుమ కోసం వాడేసార‌ని అంటున్నారు. ప్ర‌భుత్వం చెప్పిన 4, 5 విడ‌త‌ల రుణ‌మాఫీ కూడా రైతుల‌కు ఇంత‌వ‌ర‌కూ అంద‌లేదు. ప్ర‌భుత్వ ఖ‌జానా పూర్తిగా ఖాళీ అయ్యింద‌ని ఇప్ప‌టికే ఆర్థీక శాఖ బైట పెట్టింది. పెరిగిపోయిన రుణాలు రాష్ట్రం నెత్తిన గుదిబండ‌ల్లా ఉన్నాయి. రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అధోగ‌తిపాలు చేసిన చంద్ర‌బాబు ఓట్ల కోసం చేసిన స్టంట్ల‌తో నేడు రాష్ట్ర ప‌రిస్థితి త‌ల‌కిందులుగా ఉంద‌ని అంటున్నారు ఆర్థీక‌వేత్త‌లు.

Back to Top