పచ్చ బకాసురుల భూ భోజనం

ఏ జిల్లా చూసినా ఏమున్నది గర్వకారణం. ఆంధ్రావని భూములు మొత్తం తెలుగుతమ్ముళ్ల హస్తగతం. ఇదీ నేటి సూత్రం. జిల్లాల వారీగా టీడీపీ నేతల భూ కబ్జాల పర్వాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తూ ’అవినీతి చక్రవర్తి’ పుస్తకంగా రూపొందించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇంత జరుగుతున్నా రెవెన్యూ శాఖ కనీసం చర్యలకు కూడా పూనుకోకపోవడం చూస్తే అధికారులూ ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కయ్యే ఈ భూదందాలకు సాయం చేసారని అర్థం అవుతోంది. 
రాజధాని జిల్లాల్లో భూములకు మంగళం
రాజధాని నగరం ఉన్న కృష్ణా గుంటూరు జిల్లాల్లో ప్రభుత్వ భూములు, స్మసానాలను కూడా వదల్లేదు టిడిపి నేతలు. స్మసానాలు, రోడ్డు పక్కన భూములు, డ్రైయినేజీ భూములు,గ్రామాల్లోని చెరువులు, కుంటలు, చివరకు చిన్న పాటి కొండలు గుట్టలను కూడా ఆక్రమించి సాగు చేయడమో, ఫ్లాట్లు  చేసి అమ్మేయడమో చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు. గుంటూరులో అయితే ఏకంగా నగరపాలక సంస్థకు చెందిన స్థలాలు కూడా కబ్జా అయిపోయినాయి. చివరకు రెవెన్యూ అధికారులు అటవీ భూములను సైతం తెలుగు తమ్ముళ్లకు రాసిచ్చేసారు. 
ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో కబ్జాల పర్వం
ప్రభుత్వ భూములనే కాదు పేద రైతుల భూములను కూడా వదలడం లేదు అధికార పార్టీ నేతలు. అధికారుల అండతో అడంగల్ లో తమ పేరిట భూములను రాయించేసుకుంటుండటంతో అసలు యజమానులు లబోదిబో మంటున్నారు. ఆన్ లైన్ లో నమోదు చేసుకోవడం ద్వారా భూములు సొంతం చేసుకునే ప్లాన్ కు నాయకులకు రెవెన్యూ యంత్రాంగం సహకరిస్తోంది. రైతులు కొని ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను కొందరు పెద్దలు రెవెన్యూ మంత్రి సాయంతో కాజేయగా వారు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న కథలు ప్రకాశంలో కోకొల్లు. నెల్లూరులో అధికార పార్టీ ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులు అసైన్డ్ భూములు ఆక్రమించి ఆక్వా సాగు చేసుకుంటున్నారు. ఖాళీ స్థలాలకు పట్టాలు సృష్టించి సొంతం చేసుకోవడం, దళితులకు కేటాయించిన సీజేఎఫ్ భూములను సొంతం చేసుకోవడం నెల్లూరులో జరుగుతున్న భూ కబ్జాల పర్వం. 
రాయలసీమ జిల్లాల్లో ఆలయభూములు స్వాహా
రాయలసీమ జిల్లాల్లో పురాతన ఆలయాలకు, మఠాలకు వందల వేల ఎకరాల భూములు ఇనాంగా ఉన్నాయి. వాటిని దేవాదాయ శాఖ కౌలుకు ఇవ్వడమో, లీజుకు ఇవ్వడమో చేస్తుంది. వాటిని సైతం కబ్జాలు చేస్తున్నారు అధికారపార్టీ నేతలు, వారి అనుచరులు. దేవాలయ భూములను కబ్జాలు చేసి ఇళ్లు కూడా కట్టుకున్నా దేవాదాయ శాఖ మాత్రం వేడుక చూస్తోంది. ఇక ప్రభుత్వ స్థలాలు, ఎండోమెంట్ లో కేసులు నడుస్తున్న స్థలాలను సైతం అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించేస్తున్నారు. 
రౌడీ నాయకుల చేతుల్లో గోదావరి భూములు
గోదావరి జిల్లాల్లో ఉన్న తెలుగుదేశం నేతలు రౌడీలకు తీసిపోనట్టే వ్యవహరిస్తుంటారు. చంద్రబాబు అండతో, అధికార పార్టీ సహకారంతో సొసైటీ సంస్థలనే కాదు ప్రభుత్వం నిర్మించిన రోడ్డును సైతం ధ్వంసం చేసి కబ్జాలు చేస్తున్న ఉదంతాలు చోటుచేసుకున్నాయి. చివరకు పోలవరం కాలువ నుంచి తవ్వితీసిన మట్టితో చెరువులను పూడ్చేసి మరీ ఆక్రమణలు చేసేసారు. పోరంబోకు భూమి కనిపిస్తే పాగేవేసేయడం, రెవెన్యూ రికార్డులు తారుమారు చేయడం సొంతం చేసుకోవడం ఈ జిల్లాల్లో మామూలైపోయింది. టీడీపీ ముఖ్య నేతలు ఎమ్మెల్యే అనుచరులే ఈ కబ్జా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఉత్తరాంధ్రలో ఆక్రమణల అరాచకం
విశాఖపట్నం కబ్జాకోరులకు అడ్డాగా మారిపోయింది. ఇటు విశాఖ సిటీని, అటు జిల్లాను కూడా కొల్లగొట్టిన మహాత్ముల్లో స్వంయగా అధికారపార్టీ మంత్రివర్యులే ఉన్నారు. ఇక టిడిపి ఎమ్మెల్యే భూముల రికార్డుల టాంపరింగ్ కేసు తూతూమంత్రంగా సాగి అసలు దొంగలను వదిలి అధికారులకు మాత్రమే శిక్ష వేయించింది. గిరిజన భూములు, కొండలు కూడా ఆక్రమించుకుంటూ యద్ధేచ్చగా సాగు చేసుకునే పచ్చనేతల ఆగడాలు విజయనగరమంతా వినబడుతున్నాయి. ఇదే జిల్లాలో ఇటీవలే రాజీనామా చేసిన టీడీపీకి చెందిన కేంద్రమంత్రి కూడా ట్రస్టు బోర్డులు పెట్టి ఎకరాలకొద్దీ స్థలాలను కబ్జాచేసుకుని కాలికింద పెట్టుకున్నాడు. శ్రీకాకుళంలోనూ పచ్చనేతల వికృత చేష్టలు సాగుతూనే ఉన్నాయి. అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు అవుతున్న చోట టీడీపీ నేతలే బినామీ పేర్లతో పత్రాలు సృష్టించి కోట్ల రూపాయిల పరిహారం కాజేసారు. గ్రానైట్ కొండల్లో కొంత భాగం లీజుకు తీసుకుని మొత్తం అంతా తవ్వేయడం అధికారపార్టీ మంత్రుల కనుసన్నల్లోనే జరుగుతోంది. 
అధికారులేం చేస్తున్నారు?
పట్టాదారు, టైటిల్ డీడీ, రెవెన్యూ అడంగల్, నాన్ అసైన్ మెంట్ ల్యాండ్ ధృవీకరణ ఇవన్నీ ఉంటేనే భూములు రిజిస్టర్ చేయాల్సిన రిజిస్ట్రేషన్ చేయాల్సిన అధికారులు అవేమీ లేకుండానే నాయకుల నుంచి ముడుపులు పుచ్చుకుని కోరిన వారిపేర భూముల రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ఆక్రమించుకున్న భూముల్లో దర్జాగా పచ్చజెండాలు పాతి, వాటిపై పేర్లు రాయడం అధికారపార్టీ నేతల దౌర్జన్యాలకు పరాకాష్ట. అందినకాడికి దోచుకుంటాం, ఎవరేం  చేయలేరు అన్న అహంకారాన్ని ప్రదర్శించేలా, పార్టీ గుర్తులు ఉండే జెండాలను పాతి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు తెలుగుదేశం నేతలు. ఈ పచ్చ బకాసురుల బారిన పడి 13 జిల్లాల్లో భూములు స్వాహా అయిపోతున్నాయి. 

 

Back to Top