నిప్పు..కేసుల తుప్పు  

18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు

సీఎంగా ఉంటూ ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన దొంగ

అమరావతి: గురివిందకు తన వెనుక ఉన్న నలుపు తెలియదట. చంద్రబాబుకు కూడా తనపై ఉన్న కేసులను కప్పి పెట్టి ఇతరులపై బురద జల్లడం పరిపాటిగా మారింది.  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాను నిప్పు అని చెబుతూనే తప్పుల మీద తప్పులు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. తాను అధికారంలోకి వచ్చేందే అడ్డదారిలో..ఈ విషయం ఎవరిని కదిలించినా నిజమే కదా అంటారు. పిల్లనిచ్చిన మామ ఎన్‌టీఆర్‌నే వెన్నుపోటు పొడిన చంద్రబాబుకు ఓట్లు వేసిన ప్రజలు ఓ లెక్కా? తనపై నమోదు అయిన కేసుల్లో ఏ ఒక్కటి విచారణకు రాకుండా స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు ఉత్తముడు కాదు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన దొంగ ఆయన.  2003లో ఓ కేసుతో పాటు  ఓటుకు నోటు కేసులో స్టే తెచ్చుకున్నారు. సీబీఐ విచారణతో పాటు ఏ ఒక్క కేసులో కూడా పూర్తిగా విచారణ జరగక్కుండా చంద్రబాబు అడ్డుకున్నారు. ఇప్పటి వరకు 18 కేసుల్లో స్టే తెచ్చుకున్నారు. ఈ స్టేలపై సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా? 

చంద్రబాబు స్టేలు తెచ్చుకున్న కేసులు ఇదిగో..

 •  2005 సెప్టెంబర్‌ 8న  ల‌క్ష్మీ పార్వతి చంద్రబాబు అక్రమ ఆస్తుల పైన విచార‌ణ జ‌ర‌పాల‌ని ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ కేసులో బాబు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. 
 • 17.03.2005న చంద్రబాబుపై ఇంకొక కేసు వేశారు. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది.
 •  చంద్రబాబు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కనీసం కేబినెట్‌ ఆమోదం లేకుండా 850 ఎకరాలు ఐఎంజీకి కేటాయించారు. దీనిపై స్టే తెచ్చుకున్నారు. 
 • ఏలేరు కాల్వ విషయంలో పొలం ఒకరిదైతే..అమ్మింది మరొకరు..డబ్బులు ఇచ్చింది వేరే వారికి. ఈ కేసు విచారణ జరుగకుండా జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు నుంచి స్టేలు తెచ్చుకున్నారు.
 • మద్యం ముడుపుల కేసు
 • పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై వేసిన కేసు
 • హెరిటేజ్‌ ఫుడ్స్‌ కేసు..చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన సొంత కంపెనీకి సేల్‌ట్యాక్స్‌ రాయితీలు రూ.14 కోట్లు ఇచ్చారు. సబ్సిడీలు రూ.75.72 లక్షలు పొందారు.
 • హెరిటేజ్‌ ఫుడ్స్‌ విషయంలో సినీ నటుడు మోహన్‌బాబు వేసిన కేసుపై కూడా స్టే తెచ్చుకున్నారు.
 • చంద్రబాబు స్వయంగా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులపై విచారణ జరుపకుండా స్టేలు తెచ్చుకున్నారు. 
   

Read Also: ముఖ్యమంత్రిపై టీడీపీ నేతల ఆరోపణలు అవివేకం 

Back to Top