ఇదేనా బాబూ.. నీవిచ్చే భరోసా?

రాష్ట్ర స్థూల ఉత్ప‌త్తి త‌గ్గితే అది అభివృద్ధా?

త‌ల‌స‌రి ఆదాయం స‌గం కంటే త‌క్కువ పెరుగుద‌ల‌

అప్పుల ఊబిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

పేపర్ల‌లోనే అభివృద్ధి..రాష్ట్ర‌మంతా అవినీతే

అమ‌రావ‌తి:  గత నాలుగు సంవత్సరాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పరిశ్రమ రంగం వాటా 25.21% నుంచి 22.1% దిగజారిందనేది మీ శ్వేతపత్రమే చెబుతుంది. అదేవిధంగా సేవారంగ వాటా కూడా 44.6% నుండి 43.5% దిగజారింది. మరి దీనినీ అభివృద్ధి అని ఎలా అంటారో ఏ ఆర్థిక నిపుణునికి అర్ధం కాదు. దీనినిబట్టి చూస్తే నీపైన భరోసా ఏవిధంగా కలుగుతుంది. 

  •  తలసరి ఆదాయం 2003-04 , 2013- 2014 మధ్యకాలంలో రూ. 25,959 నుంచి రూ. 85,795 గా నమోదైంది. అంటే దాదాపు 335% పెరిగింది. ప్రతి 5 సంవ‌త్స‌రాల‌ తలసరి ఆదాయం తీసుకుంటే 165% అవుతుంది. నీ పరిపాలనలో గత 4 సంవ‌త్స‌రాల‌లో కేవలం 71% మాత్రమే పెరిగిందని శ్వేతపత్రంలో చెప్పారు కదా. అది వరకుతో పోలిస్తే ఇది సగం కంటే తక్కువ పెరుగుదల రేటు కదా! మరి దీనిని చూస్తే నీపై భరోసా ఎలా కలగుతుందో మీరే చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో 2004-05 మధ్యలో పన్నుల ఆదాయం రూ. 16,250 కోట్ల నుండి రూ.44,124 కోట్లు పెరిగింది కదా అంటే 390 శాతం. ఐదు సంవ‌త్స‌రాల‌ సగటు తీసుకుంటే 195% మరి నీ పరిపాలనలో పెరుగుదల రేటు కేవలం 30% కూడా నమోదు కాలేదు. ఇదేనా నీవిచ్చే భరోసా.  
  • కేవలం 5 సంవ‌త్స‌రాల‌లో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచెత్తింది నీవు కాదా. అందుకే నీ జమానాలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పును 
  • 29.5% పట్టుకొచ్చావు. దీన్ని 20.28% తగ్గించటానికి 10 సంవ‌త్స‌రాల‌ కాలం పట్టింది. నీవు చేసిన అప్పు వల్ల 2004- 05లో 16.5% బడ్జెట్ కేటాయింపు కేవలం అప్పులకే పోయింది. మరల కేవలం 5 సంవ‌త్స‌రాల‌లో అప్పును రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 29 శాతం పెంచుటమే కాకుండా లక్ష కోట్లు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వ ఏజన్సీల ద్వారా అదనంగా లక్ష కోట్లు అప్పు చేసి మొత్తం రూ.3 లక్షల 50వేల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా అప్పుల ఊబిలో పడేశావు.  తెలుగు ప్రజల మీద నీకు ఎంత కక్ష వుంటే మాత్రం ఇంత దారుణమా.? ఈ లక్ష కోట్లతో కలిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 35% దాటించావు కదా! నీమీద ఇంకా భరోసా ఉంచితే మా ఒంటిమీద బట్టలు కూడా ఉండనీయవు కదా! 
  •  ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులకు నీవు చేసిందేమిటి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఎకానమీ అనే సంస్థ దేశవ్యాప్తంగా సర్వే చేసి గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ నిరుద్యోగ యువత జాతీయస్థాయిలో 12% వుంటే ఆంధ్రప్రదేశ్లో 25.32% అని పబ్లిష్ చేయటం జరిగింది కదా! ఇదేనా ఇంటికో ఉద్యోగం అంటే. రాష్ట్ర విభజన నాటికి కేంద్రం వేసిన కమలనాధన్ కమిటీ ప్రకారం 1,50,000 ఖాళీలు ఎ.పి.లో ఉన్నాయి. ఈ 5 సంవ‌త్స‌రాల‌లో పదవీ విరమణ చేసిన వాళ్ళు మరో 50,000 వెరసి మొత్తం 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. మరి ఇవన్నీ నింపలేదనే నీపై భరోసా ఉంచాలా.. 
  • ఐదేళ్ల‌లో మొదటి సంవ‌త్స‌రం 37%, 2వ సంవ‌త్స‌రంలో 15%, 3వ సంవ‌త్సంలో 29.9%, 4వ సంవ‌త్స‌రంలో 14.4% మరి ఈ యేడాది 31.8% వర్షపాతం నమోదయినది కదా. అంతకు ముందు మీ 9 సంవత్సరాల పరిపాలనలో కూడా మా గతి ఈ విధంగానే వుండేది కదా! మరి నీ పరిపాలన అంటేనే వరుణుడు భయపడతాడని నీమీద భరోసా ఉంచాలా?
  •  గత నాలుగు సంవత్సరాల నుంచి పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలకి కానీ కనీస గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేకపోయావు 
  • కదా! మీరి దేన్నిబట్టి నీపై భరోసా ఉంచాలి.
  •  ఐదు నక్షత్రాల హోటళ్లు, విద్య, వ్యాపార సంస్థలకు, సింగపూర్ విమానయానాలు చేసేవాళ్ళకి పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి రైతులకు రావల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేకపోయిన నీ సమర్థత చూసి మాకు భరోసా కలుగుతుందా. 
  •  రైతులకు రుణ‌మాఫీ అని చెప్పి ఇంకా రూ. 8,832  కోట్ల రూపాయలు విడుదల చేయకుండా మేము బ్యాంకులకు కట్టవలసిన వడ్డీ ఇంకా నీవు ఇవ్వవల్సిన దానికంటే ఎక్కువ మాచే కట్టించినందుకు నీపై భరోసా ఉంచాలా.. 
  •  డ్వాక్రా పొదుపు సంఘాలకు ఇవ్వవలసిన వడ్డీ రాయితీ వేలకోట్లు ఇవ్వకుండా పసుపుకుంకుమ పేరుతో కొద్దిసొమ్ము మాపై కొట్టినందుకు నీపై భరోసా ఉంచాలా.. 
  • మా ఆధార్ కార్డు, సెల్ నెంబర్లు, బ్యాంకు ఖాతా నెంబర్లు, ప్రైవేటు సంస్థలకు చేరవేసిన నీపై భరోసా ఉంచాలా. 
  • రూ. 17,000 కోట్ల కేటాయింపులతో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ పూర్తి అవుతాయి అని చెప్పి, 4 సంవ‌త్స‌రాల‌లో రూ. 50,000 కోట్లు పైచిలుకు ఖర్చుపెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయని నీపై భరోసా ఉంచడం న్యాయమేనా. 
  •  రాజ‌ధాని ప్రాంతంలో 11,000 చ‌ద‌రపు అడుగులలో తాత్కాలిక నిర్మాణాలు చేసిన నీ సమర్ధతపై భరోసా ఉంచడం ఎవరికైనా తగునా. 
  •  ఉచిత ఇసుక పేరుతో రూ. 10,000 కోట్లకు పైగా నీ పార్టీ నాయకులు, శాసన సభ్యులకు దోచిపెట్టిన నీ తెలివితేటలపై మాకు భరోసా కలుగునా. 
  •  ప్రభుత్వ సంస్థల్ని కాదని ప్రైవేటు సంస్థలకు ఎయిర్ పోర్ట్, సెజ్ భూములు సమర్ధించుకున్న మీపై భరోసా ఉంచడం సమంజసమా. 
  •  ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో అన్ని రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ఇళ్ళను, పక్క రాష్ట్రంకంటే చద‌ర‌పు అడుగుల‌కు రూ. 1000 అదనంగా ఖర్చు చేసి ఆ అధనం ఖర్చు మీరు మిగుల్చుకొని అప్పు భారాన్ని మాపై నెడుతున్నందుకు మా భవిష్యత్తు గొప్పగా ఉంటుందని నీపై భరోసా ఉంచాలా బాబుగారు?
  •  జన్మభూమి కమిటీల పేరుతో పంచాయ‌తీ రాజ్ వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రభుత్వానికి పార్టీకి మధ్య అంతరాన్ని చెడిపేసినందుకా నీపై భరోసా. 
  •  పైబర్ గ్రిడ్ పేరుతో 1,200/ ఖరీదు చేసే సెట్ ఆఫ్ బాక్సును రూ. 4,000  మాకు ఇస్తున్నందుకు మీపై భరోసా  ఉంచాలా? 
  • పరిశుభ్రత లేదు ఎలుకల బెడద ఉన్నదని ఒక ఎలుకకు రూ. 20,000 చొప్పున కాంట్రాక్టర్లుకు దోచి పెట్టినందుకా నీపై భరోసా.  

తాజా వీడియోలు

Back to Top