అమరావతి: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లగా వారికి ప్రజలు ఎదురేగి స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు అండగా నిలుస్తున్నాయని, ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నాయని చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో తామంతా చాలా సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారు. సీఎం వైయస్ జగన్‌కు తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆనందంగా తెలియజేశారు. - పత్తికొండ నియోజకవర్గం క్రిష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో గడప - గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ పాల్గొని జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీలకతీతంగా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం గ్రామ సచివాలయం లో సిసి రోడ్ల సమస్య ఎక్కువగా ఉన్నదని వీలైనంత త్వరగా రోడ్లు వేయాలని అధికారులను ఆదేశించారు. - బండమీదపల్లి,బొమ్మజ్జిపల్లి,తమ్మయ్య దొడ్డి గ్రామాలలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ఉషాశ్రీచరణ్ పాల్గొన్నారు. ప్రతి గడప గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ వాటిని తక్షణమే పరిష్కరిస్తూ మన సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ పధకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. -ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉరవకొండ మండలం మూలగిరిపల్లి గ్రామంలో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమం జరిగింది. ఇందులో ఎంపిపి చందా చంద్రమ్మ, వైస్ ఎంపిపి నరసింహులు, జెడ్పిటిసి పార్వతమ్మ, సర్పంచ్ శ్రీరాములు, ఎంపీటీసీ ఓబయ్య, ఆమిద్యాల పిఏసీఎస్ చైర్మన్ తేజోనాత్,ఉప సర్పంచ్ వెంకట రెడ్డి ఉరవకొండ పిఏసీఎస్ చైర్మన్ షేక్షావలి, పెన్నహోబిలం చైర్మన్ అశోక్ కుమార్, నాయకులు ఓబన్న,తహశీల్దార్ మునివేలు, ఎంపీడీఓ అమృత రాజు, ఈఓఆర్డీ దామోదర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రభుత్వం నుంచి ప్రజలకు అందిన పథకాలను లబ్ధిదారులకు విశ్వేశ్వరరెడ్డి వివరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే వీటిని పరిష్కారం చేయాలని వెంట వచ్చిన అధికారులకు ఆయన ఆదేశించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో తమకు జరిగిన మంచికి కృతజ్ఞతగా గడప గడపలో మాజీ ఎమ్మెల్యే తో కలిసి సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి క్షిరాభిషేకం" చేశారు. - గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు కి గిజబ కాలనీ ప్రజానీకం అపూర్వ స్వాగతం పలికారు. ఎమ్మెల్యేకు గడప గడపనా మహిళలు ఆశీర్వ హారతులు పట్టారు. కోతవసల 6వ వార్డు గిజబ, నాయుడు, గ్రీన్ ఫీల్డ్ కాలనీలలో ప్రజలను కలుసుకుంటూ, ఆశీర్వాదములు తీసుకుంటూ ఘనంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ సహాయాన్ని తెలియ చేస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ ప్రజలందరి దీవెనలు అందుకుంటూ నాయుడు కాలనీ, గ్రీన్ ఫీల్డ్ కాలనీలలో కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. - శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వారితో ముచ్చటిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. కుల,మతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.