థ్యాంక్యూ సీఎం స‌ర్‌

సీఎం వైయ‌స్ జగన్‌కు రుణపడి ఉంటాం

విజయవాడ : డీఎస్సీ–98 క్వాలిఫైడ్‌ అభ్యర్థులు సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతతెలిపారు. విజ‌య‌వాడ నగరంలోని పోలీస్‌ కంట్రోల్‌ రూం వద్ద ఉన్న దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహం వద్ద సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి  క్షీరాభిషేకం చేశారు. పలువురు మాట్లాడుతూ 24 ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తమ ఆకాంక్షను సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేర్చారని సంతోషం వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి డీఎస్సీ–98 అభ్యర్థుల ఫైల్‌పై సంతకం చేశారన్నారు. సీఎం జగన్‌కు తాము జీవిత కాలం రుణపడి ఉంటామని ఉద్వేగంతో చెప్పారు. కార్యక్రమంలో క్వాలిఫైడ్‌ అభ్యర్థులు అగిరిపల్లి శ్రీనివాస్, జె.సీతారామిరెడ్డి, రంగాచార్యులు, కోటేశ్వరరావు, అనురాధ, దాక్షాయనిరెడ్డి, సాయిరాం ప్రసాద్‌ పాల్గొన్నారు. 
 
పెట్రోల్‌ బంక్‌ నుంచి ఉద్యోగానికి..
గుడివాడ : తనకు ఉద్యోగం ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సదా రుణపడి ఉంటానని క్వాలిఫైడ్‌ ఉపాధ్యాయుడు బండి కుమార్‌బాబు చెప్పారు. కృష్ణాజిల్లా నందివాడ మండలం జనార్దనపురం పెట్రోల్‌ బంకులో పని చేసుకుంటూ బతుకుబండి లాగిన తాను.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా మారానని సంతోషం వ్యక్తంచేశారు. 

ఎన్నాళ్లకెన్నాళ్లకో వేచిన ఉదయం
 పాతపట్నం: నలిగిపోయి, మాసిపోయిన షర్ట్‌.. ప్యాంటో లేక షార్టో తెలి యని బాటమ్‌.. పాత సైకిల్‌పై ఓ సంచిలో బనియన్లు, డ్రాయర్లు, చొక్కాలు పెట్టుకుని.. పాతపట్నం, కొరసవాడ, కాగువాడ గ్రామాల్లో అమ్ముతూ  జీవిస్తున్నాడు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావు. బేరం లేని రోజు పస్తు పడుకోవడం తప్ప మరో దారి లేని ఇతను ఇలా రెండు దశాబ్దాలుగా జీవితం లాక్కొస్తున్నాడు. 

అరకొర ఆదాయం వల్ల పెళ్లి కూడా చేసుకోలేదు. తల్లిదండ్రులు అల్లక నీలకంఠు, అమ్మయమ్మలు మృతి చెందారు. ఎంఏ, బీఈడీ చదివి, ఇంగ్లిష్‌ అనర్గ ళంగా మాట్లాడే ఇతను 1998 బ్యాచ్‌ డీఎస్సీకి అర్హత సాధించారు. అయితే వివిధ కారణాల వల్ల అప్పట్లో ఉద్యోగం రాలేదు. తాజాగా జగన్‌ ప్రభుత్వం నిర్ణయంతో ఆ బ్యాచ్‌లో మిగిలి పోయిన అర్హులకు ఉద్యోగాలొచ్చాయి. ఈ విష యాన్ని గ్రామస్తులు కేదారేశ్వరరావు చెవిన వేయగా, ఆయన ఆశ్చర్యపోయాడు. చంద్ర బాబు ఇవ్వలేదు.. జగన్‌ ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇతని వయసు 57 ఏళ్లు. ఈ వయసులో ఇతని జీవితం ఇలా మేలి మలుపు తిరగడం పట్ల స్థానికులూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top