ఆరు నెలల్లోనే మంచి సీఎంగా వైయస్‌ జగన్‌

సంక్షేమానికి పెద్దపీట

చెప్పినవీ.. చెప్పనివీ చేస్తున్న సీఎం

అవినీతిరహిత పాలన

పాలనలో తండ్రిని మరపించిన  తనయుడు వైయస్‌ జగన్‌

రాజధాని విషయంలో ముందుచూపు

అమరావతి: ఎన్నికలకు ముందు ఎన్ని హామీలైనా ఇవ్వొచ్చు. అధికారంలోకి వచ్చి అమలు చేసినప్పుడు కదా తెలిసేది.. అని అన్న వారు కోకొల్లలు. ఆవేశం, అనుభవం లేని కుర్రాడు ఏం చేస్తాడులే అని నిట్టూర్చారు. ఆలోచనలో ప్రజల బాగోగుల తలంపు ఉంటే.. చేయాలనే చిత్తశుద్ధి ఉంటే..చేసి తీరాలనే సంకల్పమే ఉంటే పరిస్థితులు కూడా అనుకూలిస్తాయని నిరూపిస్తోంది జగన్‌ పాలన. మున్ముందు పాలన ఎలా ఉంటుందో శాంపిల్‌ మాత్రమే.. ఈ ఆరునెలల పాలన. ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటా అని ప్రమాణస్వీకారం సందర్భంగా చెప్పిన మాటలను తూచాతప్పకుండా పాటిస్తున్నారు. ఆఖరికి ప్రతిపక్ష నాయకుల చేత కూడా బెస్ట్‌ సీఎం అనిపించుకున్న ఏకైక సీఎం జగన్‌ అంటే అతిశయోక్తి కాదు.

జగన్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఆరునెలలకు పైగా అయింది. ఎన్నికల్లో ఘనవిజయం సాధించి పగ్గాలు స్వీకరించిన తరువాత అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనతి కాలంలోనే పరిపాలనపై పట్టు సాధించారు. సామాన్యులకు మేలు జరిగే ఎలాంటి నిర్ణయమైనా క్షణాల్లో తీసుకుంటూ.. పేదల పక్షపాతిగా ముద్ర వేయించుకుంటున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలే కాకుండా.. ఇవ్వని పథకాలను కూడా అమలు చేస్తూ రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తం్రyì కి తగ్గ తనయుడిగా చరిత్రలో నిలిచిపోతాడని అణగారిన వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

అవినీతి లేని పాలన:
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి ఆరోపణ చేయడానికి ప్రతిపక్షానికి ఒక్క  అవకాశం కూడా ఇవ్వకుండా పాలన చేస్తున్నారు. ఏ విషయంలో జగన్‌పై విమర్శలు చేయాలో తెలీక చంద్రబాబు అండ్‌కో చేష్టలుడిగి చూస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేస్తుంటే ఇక్కడ మాత్రం కులం, మతం గురించి మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నారు. దీంతో ప్రతిపక్షం ప్రజల్లో మరింత చులకన అయింది. సరైన విధానమే లేకుండా ఎదురుదాడి చేస్తుండటంతో వారి విమర్శలు విశ్వసనీయత కోల్పోయాయని విజ్ఞులు అంటున్నారు. 

సంక్షేమ నేస్తం..
జగన్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ఊపందుకున్నాయి. ఎన్నికల సమయంలో చెప్పిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చే విధంగా ముందుకు దూసుకుపోతున్నారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. పింఛను వయస్సు తగ్గించడం, రైతు భరోసా సహాయం పెంపు,  చేనేతలకు ఆర్థికసహాయం, మత్సకారులకు ఆర్థిక సహాయం పెంపు వంటి మరెన్నో కార్యక్రమాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో  53,19,339 మందికి పెన్షన్‌ ప్రతి నెలా ఒకటో తారీఖునే అందిస్తున్నారు. రూ.3 వేలకు పెన్షన్‌ పెంచుకుంటూ పోతాననే హామీని నిలుపుకున్నారు. మొదటి సంవత్సరం రూ.250 పెంచి.. రూ.2250  ఇస్తున్నారు. తలసేమియా, కిడ్నీ తదితర రోగుకు ప్రతి నెలా రూ.10వేల పెన్షన్‌ ఇస్తున్నారు. కంటి వెలుగు పథకం కింద మొదటి విడతలో రూ.500 కోట్లకు పైగా ఖర్చు చేశారు. రైతు భరోసా పథకం ద్వారా 56,89.582 మంది రైతులు సహాయం పొందారు. ఆటో డ్రై వర్లకు రూ.10 వేల ఆర్థిక స హాయం, మత్స్యకారులకు పని లేని సమయంలో ఇచ్చే ఆర్థిక చేయూతను రూ.10 వేలకు పెంచారు. 

భవిష్యత్‌ కోసం ముందు చూపు:
కేవలం రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం, కులాన్ని దష్టిలో పెట్టుకొని మాత్రమే అమరావతిని రాజధానిగా చేశారని ఎప్పటి నుంచో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూన్, జులై నెలల్లో కురిసిన వర్షాలకు దాదాపు రాజధాని మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో డొల్లతనం బయటపడింది. రాజధాని ఇక్కడే ఉంటే భవిష్యత్‌ తరాలు ఏమాత్రం క్షమించవని జగన్‌ భావించారు. దీంతో రాజధాని మార్పు కోసం డీఎన్‌ రావు కమిటీని నియమించారు. దీంతోపాటు వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. వారి సూచనలకు అనుగుణంగా రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. విశాఖ ఇప్పటికే అభివద్ధి చెందిన నగరం. దాన్ని అభివద్ధి చేయాల్సిన అవసరం లేదు. ఉన్న వనరులు.. కొద్దిపాటి ఖర్చుతో మంచి పరిపాలన కేంద్రం ఏర్పాటు చేయవచ్చు. దీంతోనే అక్కడ కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు రాయలసీమ, ఆంధ్ర ప్రాంత అభివద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. దీని కోసం ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. 

తండ్రిని మించిన తనయుడు..
పాలనలో తండ్రిని మించిన తనయుడు అని అధికారులు, ప్రజలు జగన్‌ను కొనియాడుతున్నారు. తనను నమ్ముకొని కష్టాల్లో, నాష్టాల్లో తోడు ఉండిన వారందరికీ పదవులు ఇచ్చారు. మాట ఇస్తే ఎంత కష్టమైనా చేయాల్సిందే  అనేది వైఎస్సార్‌ పాలసీ. అచ్చుగుద్దినట్లుగా జగన్‌ కూడా అదే దారిలో పయనిస్తున్నారు. బడుగు, బలహాన వర్గాలకు మంత్రి వర్గంలో పెద్దపీట వేశారు. చంద్రబాబు హయాంలో నిర్లక్ష్యానికి గురైన మైనార్టీలకు మంత్రి వర్గంలో చోటు కల్పించారు. సమయం చెప్పి పథకాలను అమలు చేస్తున్నారని.. నాయకుడి మంచి లక్షణం అని విజ్ఞులు అంటున్నారు. సీఎం సహాయనిధి నుంచి ఈ ఆరునెలల్లో లక్షలాది మందికి సహాయం చేశారు. టీడీపీ కార్యకర్తలు సైతం సహాయం అందుకున్నారు. 

లోకల్‌కు పెద్దపీట..
నవరత్నాల్లో భాగంగా మద్యపాన నిషేదం దిశగా వైయస్‌ జగన్‌ వడివడిగా అడుగులు వేస్తున్నారు. బెల్ట్‌షాపులను పూర్తిగా నిర్మూలించారు. దాదాపు ఈ ప్రభుత్వం 880 మద్యం దుకాణాలను తగ్గించింది. గ్రామవాలంటీర్‌లను నియమించింది. కొత్త సచివాలయ నియామకాలను చేపట్టి.. 1.30 లక్షల ఉద్యోగాలిచ్చింది. దీంతో యువతలో ప్రభుత్వం పట్ల సానుకూలత ఏర్పడింది. వైయస్‌ జగన్‌ పాలనను ప్రతిపక్ష నాయకులు సైతం కొనియాడుతున్నారు. 

 

ఇదీ సంక్షేమం లెక్క:
రైతు భరోసా: 

మొత్తం రైతులు: 67,55,282
భరోసా సహాయం పొందిన రైతులు: 56,89.582
పెండింగ్‌లో ఉన్నవి: 6,439
పెన్షన్‌ కానుక: 
మొత్తం పెన్షనర్లు: 53,19,339
అభయహస్తం : 23,20, 193,
వితంతువులు: 20,03,170
ప్రత్యేక ప్రతిభావంతులు: 6,25,760
ఒంటరి స్త్రీలు: 1,07,487
చేనేతలు: 1,03,576
మత్స్యకారులు: 44,262
ఇతరులు: 1.14,891
నేతన్న నేస్తం:
చేనేతలు: 81,783
ఆర్థిక సహాయం: రూ.24 వేలు( ప్రతి సంవత్సరం)
ప్రభుత్వం చేస్తున్న ఖర్చు: రూ.196.27 కోట్లు
వైఎస్సార్‌ కంటి వెలుగు: ఫెస్-2
లక్ష్యం: 4,35,155
వైద్యపరీక్షలు నిర్వహించినది: 3,83,456 (88.12)
కంటి చూపు సరిగ్గా ఉన్న విద్యార్థులు: 2,01,111
కంటి అద్దాలు పంపిణీ : 1,38,779 
అద్దాలు పంపిణీ చేసి నాణ్యమైన వైద్యసేవల కోసం రెఫర్‌: 4,722
నాణ్యమైన వైద్యసేవల కోసం రెఫరెన్స్‌: 38,805

Back to Top