ఎన్నాళ్లో వేచిన ఉదయం

ప్రగతి చక్రాలపై ప్రజా రవాణా

‘ఆర్టీసీ కార్మికులంతా  ప్రభుత్వ ఉద్యోగులే’

అమరావతి : జనవరి 1నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నోటిషికేషన్‌ జారీ చేసింది. జనవరి 1వ తేదిని ఆర్టీసీ ఉద్యోగుల నియామక డేగా పరిగణించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కార్మికులను ప్రభుత్వంలో విలీనం) చట్టం 2019 ప్రకారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా రవాణా విభాగం ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను పరిగణిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల  తరహాలోనే ఖజానా నుంచి నేరుగా ఆర్టీసీ కార్మికులు జీతాలు అందుకోనున్నారు.

51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి
జనవరి 1 నుంచి ఆర్టీసీ సిబ్బంది ప్రజా రవాణా ఉద్యోగులుగా మారనున్నారు. ఇ‍ప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ మినహాయించి ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఆ సంస్థలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న 51,488 మందికి లబ్ధి చేకూరనుంది. ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రజా రవాణాశాఖలో విలీనమైన వెంటనే చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. డిపోల్లో సీఎం వైయస్‌ జగన్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు.

తాజా వీడియోలు

Back to Top