ఏపీలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభంజనం

25 లోక్‌సభ సీట్లకుగాను 22 స్థానాలు కైవసం

టైమ్స్‌ నౌ–వీఎంఆర్‌ సర్వే–2019లో వెల్లడి

న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని టైమ్స్‌ నౌ–వీఎంఆర్‌ సర్వే–2019లో తేలింది. ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గానూ  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  22 స్థానాల్లో విజయదుందుభి మోగించనుందని వెల్లడించింది. ఇక అధికార టీడీపీ పార్టీ కేవలం 3 స్థానాలకు పరిమితం కానుందని పేర్కొంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఈసారి ఒక్క సీటు కూడా దక్కబోదని స్పష్టం చేసింది. అలాగే గతంతో పోల్చుకుంటే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పెరగనున్నట్లు టైమ్స్‌నౌ– వీఎంఆర్‌ సర్వేలో వెల్లడయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కి 45.5 శాతం ఓట్లు రాగా, ఈసారి ఏకంగా 48.8 శాతం ఓట్లను దక్కించుకోనుందని తెలిపింది. అదే సమయంలో గత ఎన్నికల్లో 40.5 శాతంగా ఉన్న టీడీపీ ఓటింగ్‌ శాతం ఈసారి 38.4 శాతానికి పడిపోనుందని సర్వే స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్‌ 2.2 శాతం, బీజేపీ 5.8 శాతం, ఇతరులు 4.9 శాతం ఓట్లను దక్కించుకుంటారని అంచనా వేసింది.  
  

Back to Top