అసెంబ్లీలో వైఎస్ జగన్ పవర్ ఫుల్ కామెంట్స్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. ప్రత్యేకహోదాపై వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ మేరకు బాబు సర్కార్ ప్రకటన చేసింది. ఐతే, బాబు చేసిన ప్రసంగంపై వైఎస్ జగన్ మాట్లాడుతూ..ప్రత్యేహోదాపై చంద్రబాబుకు అవగాహన లేదన్న విషయం ఇవాళ వెల్లడైందన్నారు. ప్రత్యేక హోదావల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాల గురించి జగన్ సభలో వివరించారు.  ఓటుకు నోటు కేసు సహా అనేక అంశాలపై   బాబు అవినీతిని సభలో నిలదీశారు. దీంతో, అధికారపార్టీసభ్యులు ఒంటికాలిపై లేచారు. జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగారు. సభా నియమాలను మంటగల్పారు. ప్రభుత్వం అరాచకాలను సభాముఖంగా వైఎస్ జగన్ బయటపెట్టారు...ఆయనేం మాట్లారంటే..
 • చంద్రబాబు అవుట్ డేటెడ్ మనిషి. ఈ త‌రానికి చెందిన వారు కాదు
 • మేం ఈ త‌రానికి చెందిన‌వాళ్లం. హోమ్ వ‌ర్క్ తోటే అసెంబ్లీకి వ‌స్తాం..!
 • ప్రజాసమస్యలపై కాకుండా బాబు ఓటుకు నోటుపైనే ఎక్కువగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు
 • చంద్రబాబు సగంసగం చెప్పడం..మనం వినాల్సిరావడం మన కర్మ 
 • సరిగ్గా ఇదే రోజు మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి.. విలువల గురించి  మాకు చెప్పడం సిగ్గుచేటు
 • పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగానే ఉంటుందన్న చందంగా టీడీపీ తీరు ఉంది
 • పట్టిసీమ నుంచి ఇసుకమాఫియా దాకా..మట్టి నుంచి బొగ్గు దాకా పర్సంటేజీలు, కమీషన్లే
 • కేసీఆర్ కు లెట‌ర్ ఇస్తే మీకు ఆ లెట‌ర్ కేసీఆర్ తెచ్చిచ్చారా అచ్చెన్నాయుడు
 • కేంద్రానికి నెలరోజుల టైమివ్వండి..హోదా ఇవ్వకపోతే   మంత్రులను ఉపసంహరించుకోండి  ఈ స‌వాల్ కు మీరు సిద్ధ‌మా..!
 • ఓటుకి కోట్లు విష‌యంలో అస‌త్యాలు చెబుతున్నారు. మీ మాట‌లు రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తా..! లేదంటే చంద్ర‌బాబు రాజీనామా చేస్తారా..!
 • నేను ఎవ‌రినైనా ఎమ్మెల్సీ చేయాలంటే ఇంత‌మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కోరిన‌వారిని పంపిస్తాను.
 • ఇంకా న‌యం. రేవంత్ రెడ్డిని కూడా నేనే పంపాను, నేనే డ‌బ్బులిచ్చాన‌ని చెప్ప‌లేదు. అంత వ‌ర‌కు సంతోషం
Back to Top