రేపు తిరుపతికి వైఎస్ జగన్

తిరుపతి: ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రేపు (మంగళవారం) తిరుపతికి వెళుతున్నారు. అక్కడ ప్రత్యేక హోదా మీద విద్యార్థులు, యువకులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తున్నారు. 

రాష్ట్రాన్ని విభజించే సమయంలో ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్షనేత అరుణ్ జైట్లీ పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా తెచ్చి పెడతామంటూ తెలుగుదేశం పార్టీ ఊరూరా ప్రచారం చేసుకొంది. కానీ అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టింది. ప్రత్యేక హోదాతో పెద్దగా ప్రయోజనాలు లేవంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది.

ప్రత్యేక హోదా తోనే ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందన్న ఉద్దేశ్యంతో నిరంతర పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తిరుపతికి వెళుతున్నారు. అక్కడ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. 
Back to Top