ప్రజా సంకల్పం@ 3000 కిలోమీటర్లు

 


కాలం రాసే శిలాక్షరాల్లో మరో అరుదైన ఘట్టం. మరో అద్భుత సంఘటన. ఎపి ప్రతిపక్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్
జగన్ ప్రజాసంకల్పయాత్ర3000 కిలోమీటర్లును
చేరుకుంది. జన ప్రభంజనమై
సాగుతున్న యాత్రలో ఇది మరో మైలురాయి. ప్రపంచంలో ఏ నాయకుడూ చేయని యాత్ర. ఏ దేశంలోనూ ప్రజలు చూడని మహోజ్వల యాత్ర. ప్రజామోదంతో ముందుకు సాగుతున్న మహోన్నతమై యాత్ర. ప్రజా సంకల్పాన్ని ఆ ప్రజలే నెరవేరుస్తున్న మరపురాని సందర్భం. సంవత్సరన్నర కాలంగా ఓ నాయకుడు ప్రజల కోసం, ప్రజలతో, ప్రజలే తానై సాగుతున్న యాత్ర ప్రజాసంకల్ప పాదయాత్ర.

సంచలనాలకు మారుపేరు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆ పేరే ఓ సంచలనమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన నాటి నుంచి అధికార
పార్టీల అక్రమాలపై దీక్షలతో, దక్షతతో పోరాటం చేస్తున్న నేటి వరకూ అతడి ప్రతి ఆలోచన, ప్రతి అడుగూ ఓ సంచలనమే అవుతోంది. అతి పిన్న వయసు పార్టీ, అతి చిన్న వయసు పార్టీ అధ్యక్షుడి నాయకత్వంలో చరిత్ర కలిగిన
టిడిపి పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. కేవలం2 శాతం ఓట్ల
తేడాతో అధికారానికి దూరమైనా, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది. ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో
అధికార పక్షన్ని నిలదీశే తీరు కూడా ప్రశంసనీయమే అయ్యింది. ప్రజా సమస్యలపై ఆయన చేసిన దీక్షలకు ప్రజల నుంచి భారీ మద్దతు
లభించింది. సమైక్యరాష్ట్రం
కోసం చేసిన ఉద్యమమైనా, విభజన తర్వాత రైతులు, విద్యార్థుల కోసం చేసిన దీక్షలైనా, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో పెట్టిన అవిశ్వాసమైనా అన్నీ
సంచలనాలే. తన నాయకత్వ
లక్షణాలతో జాతీయ స్థాయిలో వైఎస్ జగన్ పేరు, తీరు చర్చనీయాంశమే అయ్యింది. కుట్రలతో జైలు పాలు చేసినా, ఆ ప్రజల సమక్షంలోనే తీర్పును కోరుతూ ముందుకు సాగుతున్న తీరు
అందరినీ ఆకర్షిస్తోంది.

వజ్ర సంకల్పం

చట్టసభల్లో న్యాయం అపహాస్యం అవుతోంది. ప్రభుత్వం ఏకపక్షంగా మారింది. సభలో ప్రతిపక్ష సభ్యులకు అవమానాలు, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యాలు, వ్యవస్థీకృతం అవుతున్న అవినీతి...వీటన్నిపై పోరాడేందుకు వైఎస్ జగన్ సంకల్పించారు. ప్రజా నిర్ణయాన్నే అవినీతి సొమ్ముతో అవహేళన చేస్తూ, ప్రజాప్రతినిధులను సంతలో పసువుల్లా కొంటున్న సంస్కృతిని వ్యతిరేకిస్తూ, శాసన సభా సమావేశాలను బహిష్కరించారు వైఎస్ జగన్. ప్రధాన ప్రతిపక్షం అధికారపార్టీ చర్యలను నిరసిస్తూ చట్టసభలను
సంపూర్ణంగా బహిష్కరించడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. అవినీతి, బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతం, అమానుష పాలన ప్రజల జీవితాలను కన్నీళ్ల పాలు చేయడాన్ని చూసి చలించిపోయారు
వైఎస్ జగన్. వారికి అండగా
నిలిచేందుకు, వారి కన్నీళ్లను
తుడిచేందుకు, ప్రభుత్వ
అవినీతిపై పోరాటానికి ప్రజలను చైతన్యపరిచి, ఒక్కతాటిపై నడిపించేందుకు పాదయాత్రనే ఓ ఉద్యమంగా మలిచారు వైఎస్
జగన్. రాష్ట్ర
మంతా పాదయాత్ర సాగాలని సంకల్పించారు. ఒకప్పుడు మహానేత వైఎస్సార్ చేసిన పాదయాత్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. మండుటెండను, విషమించిన ఆరోగ్య పరిస్థితిని కూడా లెక్కచేయక నాడు వైఎస్సార్
ప్రజాసంకల్ప పాదయాత్ర చేసారు. అదే స్ఫూర్తితో వైఎస్ జగన్ సాహసోపేతమైన ప్రజాసంకల్పయాత్రకు శ్రీకారం
చుట్టారు. నాడు వైఎస్
పాదయాత్రకు పురికొల్పిన కారణాలు ఎలాంటివో, అంతకు మించిన దారుణమైన పరిస్థితులు నేడు రాష్ట్రంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలకు వెన్నంటి ఉండేందుకు, రాబోయే ఎన్నికల సమరానికి శంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు వైఎస్
జగన్. 13 జిల్లాల్లో6నెలలపాటు3000 కిలోమీటర్ల
పాదయాత్ర చేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇడుపుల పాయలో ప్రారంభమైన పాదయాత్ర మహానేత ఆశీస్సులతో, అశేష తెలుగు ప్రజల అభిమానంతో అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. 6 నెలలు అనుకున్న యాత్ర ఏడాదిన్నర సమయం తీసుకుంది. అడుగడుగునా ప్రజల నీరాజనాలు.... అన్నా అంటూ ఆత్మీయమైన పలకరింపులు. ....మా కష్టం వినమంటూ వినతులు...   ప్రజావేదికలు
ఏర్పాటు చేస్తూ, ప్రజల కష్టాలను
ఓపిగ్గా వింటూ, వారి సమస్యలకు
నవరత్నాలను పరిష్కారంగా అందిస్తూ, మెరుగైన పాలనకోసం ప్రజా మేనిఫెస్టోను రూపొందిస్తూ ప్రజా సంకల్ప
యాత్ర సాగుతోంది. రాయలసీమ, కోస్తా జిల్లాలను పూర్తి చేసుకుని ఉత్తరాంధ్ర ముఖ ద్వారమైన విశాఖజిల్లాను
దాటి విజయనగరంలోకి ప్రవేశించింది ప్రజాసంకల్ప పాదయాత్ర.

తండ్రి ఆశయసాధన, ప్రజా సంక్షేమ పాలన, ప్రజల చిరునవ్వుల దీవెన లక్ష్యాలుగా సాగుతున్న ప్రజాసంకల్పయాత్ర
సాగిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారికి ఇవే శుభాకాంక్షలు.

 

 

 

 

 

 

Back to Top