ఢిల్లీలో వైఎస్ఆర్ సీపీ సంద‌డి .. వినిపిస్తున్న ప్ర‌త్యేక హ‌క్కు నినాదం



న్యూఢిల్లీ) జాతీయ స్థాయిలో తెలుగోడి ఆవేద‌న‌ను వినిపించేందుకు సంక‌ల్పించిన మ‌హా ధ‌ర్నా కు వైఎస్ఆర్ సీపీ పార్టీ శ్రేణులు త‌ర‌లి వెళ్లాయి. ఇప్పుడు పార్ల‌మెంటు చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. ఏడో తేదీ రాత్రి రాయ‌ల‌సీమ వాసులు తిరుప‌తి నుంచి బ‌య‌లు దేరిన రైలులో, కోస్తా, ఉత్త‌రాంద్ర వాసులు అన‌కాప‌ల్లి నుంచి బ‌య‌లు దేరిన రైలులో ప్రయాణించారు. ఆదివారం సాయంత్రానికే ఈ రైళ్లు ఢిల్లీ చేరుకొన్నారు.

ఆదివారం మ‌ధ్యాహ్నం కొంత స‌మ‌యం వ‌ర్షం ఆటంకం క‌ల్పించిన‌ప్ప‌టికీ సాయంత్రం తెరిపి ఇవ్వ‌టంతో పార్టీ శ్రేణులు ఏర్పాట్ల‌లో మునిగిపోయాయి. నిర్దిష్ట ప్ర‌ణాళిక‌తో ఏర్పాట్ల‌ను ముగించారు. పెద్ద సంఖ్య‌లో వ‌చ్చిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు స‌రిపోయేలా ధ‌ర్నా ప్రాంగ‌ణాన్ని తీర్చి దిద్దారు. అనంత‌రం పార్టీ శ్రేణులు మార్చ్ చేసేలా ప్ర‌ణాళిక ర‌చించారు.

 అధ్యక్షుడు వైఎస్‌జగ‌న్ ఆదివారం సాయంత్ర‌మే హైద‌రాబాద్ నుంచి ఢిల్లీ చేరుకొన్నారు. ముఖ్య‌మైన నాయ‌కులంతా విమానాల్లో ఢిల్లీకి చేరుకొన్నారు. ఇత‌ర రైలు మార్గాలు, ప్ర‌త్యేక వాహనాల‌లో మ‌రికొంద‌రు నాయ‌కులు ఢిల్లీ త‌ర‌లి వెళ్లారు.. అక్క‌డ మ‌హా ధ‌ర్నాలో పాల్గొని ఢిల్లీ పెద్ద‌ల‌కు తెలుగు ప్ర‌జ‌ల ఆవేద‌న‌ను, గట్టి డిమాండ్ ను తెలియ‌ప‌రుస్తున్నారు. 
Back to Top