ఈనాడు కా.మ సంగతేంది బాబు

స్పీకర్లు, న్యాయనిపుణులు తప్పుబట్టారు
ఈనాడును ఎందుకు పిలవలేదు బాబు
మహిళలు చనిపోతుంటే నవ్వుతారా
మీరు మనుషులేనా, మనసు లేదా బాబు

కాల్ మనీ సెక్స్ రాకెట్ కీచకులను శిక్షించకుండా చంద్రబాబు వాళ్లను రక్షించేందుకు సభను పక్కదారి పట్టించారని రోజా నిప్పులు చెరిగారు. కా.మ. సీఎం అన్నందుకే తనను ఏడాది పాటు సస్పెండ్ చేయడం తగదని...గత స్పీకర్లు, న్యాయ నిపుణులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని తప్పుబట్టారని రోజా పేర్కొన్నారు.  ఈనాడు కూడా కా.మ అని రాసింది. మరి వాళ్లకు ఎందుకు ప్రివిలేజ్ నోటీసు ఇవ్వలేదు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని రోజా ప్రభుత్వాన్ని నిలదీశారు. 58 మంది  కా.మ సీఎం అని నినాదాలు చేస్తే రోజాను ఒక్కరినే సస్పెండ్  చేయడం సరికాదని తమ అధ్యక్షులు వైఎస్ జగన్ చెప్పినా వినలేదన్నారు. రోజా బయటకు వెళ్లేవరకు మైకివ్వమని సభాపతి మాట్లాడడం దుర్మార్గమని రోజా ఫైరయ్యారు.

మహిళలకు న్యాయం చేయాలి, వారిని ఆకూపంలోంచి బయటకు తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో తాను బయటకు వెళ్లాలనన్నారు. ఆతర్వాత కాల్ మనీ సెక్స్ రాకెట్ పై వైఎస్ జగన్ చర్చకు పట్టుబట్టినప్పుడు అధికారపార్టీనేతలు ఏవిధంగా తిట్టారో అందరం చూశామన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ ఏ సాక్షివాళ్లో, వైఎస్సార్సీపీ వాళ్లో వెలికితీయలేదని,  విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ తనకొచ్చిన ఫిర్యాదు ప్రకారం రైడ్ చేస్తే.. కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం మొత్తం బయటపడిందన్నారు. 


ఇంట్లో భర్త ఉండగానే భార్యను, కూతురిని ఎత్తుకెళ్లిపోయారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ బాధితులు ఆత్మహత్యాయత్నాలు చేశారు. ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తాం, మీ భర్తకు చూపిస్తామని బెదిరిస్తే...కృపారాణి అనే అమ్మాయి భయపడి సెల్ఫీ వీడియో తీసి చనిపోయింది. బాధిత మహిళలు చనిపోతుంటే కూడా బాబుకు, మంత్రులకు, మహిళా ఎమ్మెల్యేలకు భాద లేదంటే మీరు మనుషులేనా, మనసు లేదా  అంటూ రోజా విరుచుకుపడ్డారు.  కా.సెక్స్ రాకెట్ నుంచి మహిళలను రక్షించాలని,  ప్రభుత్వం మెడలు వంచి నిందితులను పట్టించాలని తాము చర్చకు పట్టుబట్టామన్నారు. ఐతే, ప్రతిపక్షం నోరు నొక్కేవిధంగా టాపిక్ ను డైవర్ట్ చేసి..చంద్రబాబు కాల్ మనీ కీచకులకు అండగా నిలబడడం దుర్మార్గమన్నారు. 


To read more details in English:     http://goo.gl/b7pRbg 


Back to Top