నిస్సిగ్గుగా కుట్రలు చేస్తున్న సర్కారు

గుంటూరు: ప్రత్యేకహోదా సాధన కోసం వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష లో చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. మంత్రి కామినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావులు  సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డారు.  వైఎస్ జగన్ హెల్త్ రిపోర్ట్ వివరాలు తారుమారు చేసి ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వ వైద్యాధికారులను కలిసి నిలదీయటంతో గుట్టు రట్టయింది. 

మూడు బృందాలుగా వైద్యులు వచ్చి గత ఐదు రోజులుగా జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నా.. మెడికల్ బులిటిన్ విడుదల చేయటం లేదు. స్పష్టమైన వివరాలు  బయట పెట్టలేదు. ఈలోగా వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సుగర్ లెవల్స్ పెరుగుతున్నాయంటూ ప్రజల్ని తప్పు దారి పట్టించే ప్రయత్నం చేశారు. దీంతో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మండి పడ్డారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడి ఆర్ ఎమ్ వో ను ప్రశ్నించారు. వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో, మెడికల్ రిపోర్టుల్లో తేడాలు వస్తున్నాయని అంగీకరించారు. ఇందుకు అంబులెన్స్ ప్రయాణిస్తున్న కాలం ఎక్కువగా ఉంటోందని, చేతి వేళ్ల చివర తీసుకొన్న శాంపిల్స్ ఒక మాదిరిగా, మోచేతి దగ్గర తీసిన శాంపిల్స్ ఒకలా రిపోర్ట్ వస్తుందని మరో వాదన వినిపించారు. మొత్తానికి బ్లడ్ సుగర్ లెవల్స్ మాత్రం తగ్గుతున్నాయని అంగీకరించారు.

అయినా ఇప్పటివరకు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్) వైద్యులు ఎందుకు హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. తమకు కూడా అందని వైద్య పరీక్షల సమాచారం మంత్రులకు ఎవరు ఇచ్చారని వారు ప్రశ్నించారు.వైఎస్ జగన్ ఆరోగ్యంపై మంత్రులు హేళన చేసేలా మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. తక్షణమే దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము నిత్యం వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు జరుపుతున్నామని, అయినా మంత్రులు ఎందుకు ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది చంద్రబాబు కుట్ర అని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రి అధికారుల్ని కలిసిన వారిలో సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డి, పార్థ సారధి తదితరులు ఉన్నారు. 
Back to Top