మిత్ర పక్షం బీజేపీ చెప్పినా చెవికి ఎక్కదా..!

తెలివిగా పక్కదారి పట్టిస్తున్న వైనం
బండారం బద్దలవుతున్నా పట్టదా
పోలవరం పనులపై సర్వత్రా విమర్శలు

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు వరదాయిని అయిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తన స్వార్థం కోసం పక్క దారి పట్టిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మిత్రపక్షం బీజేపీ చెబుతోంది.పోలవరం పనులు నత్త నడకన నడుస్తున్నాయని మంత్రిమండలిలో సభ్యుడైన బీజేపీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కుండ బద్దలు కొట్టారు.

తెలివిగా పక్కదారి
పట్టిసీమ పేరుతో వందల కోట్ల రూపాయిలు నొక్కేసేందుకు చంద్రబాబు అండ్ కో పక్కా స్కె చ్ వేసుకొన్నారు. తెలివిగా పోలవరం పనుల్ని నత్త నడకన నడిపించాలని నిర్ణయించారు. ఇందుకు కేంద్రం నుంచి నిదులు, సహకారం అందడం లేదని డ్రామా సాగించారు. పట్టిసీమ కోసం పోలవరాన్ని అటక ఎక్కించి చేతులు దులుపుకొన్నారు.

బండారం బద్దలువుతోంది
ఈ విషయాన్ని బీజేపీ పార్టీ పెద్దలు పసిగట్టారు. స్వయంగా బీేజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హరిబాబు, తర్వాత మంత్రి మాణిక్యాలరావు బహిరంగంగా వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేంద్రం వైపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదని తేల్చి చెప్పారు. అంతా చంద్రబాబు సర్కారులోనే ఉందని చెప్పకనే చెప్పారు. కేంద్ర వైపు నుంచి ఇబ్బందే లేదని, అసలు సమస్య అంతా ఇక్కడే ఉందని మంత్రి మాణిక్యాల రావు కుండ బద్దలు కొట్టి చెప్పారు.

సర్వత్రా విమర్శలు
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ క్రెడిట్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి దక్కుతుంది. అది ఇష్టం లేని చంద్రబాబు మొదట నుంచి దొంగాట ఆడుతున్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు బయట పెట్టారు కాబట్టి ఇప్పుడు పచ్చ పార్టీ స్పందన ఏమిటో చూడాలి. 
Back to Top