కబ్జాల పార్టీ - టిడిపి

తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతిని అంతం చేయడానికి నేనే కంకణం కట్టుకున్నానని చెబుతుంటారు. అపర నీతి మంతుడు నేనే అంటూ తనకు తనే కితాబిచ్చుకుంటారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తెలంగాణాలోనూ వేలాది ఎకరాల భూములు కబ్జాలు చేసిన చరిత్ర, ఆయనది, ఆయన పార్టీ నేతలదీ అని ఎన్నో రికార్డులు తెలియజేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అయితే టిడిపి నేతలు కబ్జాలు చేయని జిల్లా కాని, మండలం కాని లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులే కాదు ఎమ్మెల్సీలు, ఛోటామోటా నాయకులు సైతం ఇదే బాటలో కబ్జాల కింగులుగా పేరు తెచ్చుకుంటున్నారు. 

జెసి.దివాకర్ రెడ్డి అల్లుడు, ఇంకా ఈ మధ్యే ఎమ్మెల్సీ పదవి చేపట్టిన అనంతపురం నేత దీపక్ రెడ్డి భూకబ్జాల వివాదంలో జైలుకి కూడా వెళ్లారు. ఒక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడిని మరో రాష్ట్రంలో అరెస్టు చేయం అప్పుడో పెద్ద సంచలనమే అయ్యింది. కాని దీపక్ రెడ్డి వ్యవహారం కూడా అంత తేలికైందేం కాదు. హైదరాబాద్ లో ఇనాం భూములను గుటకాయస్వాహా చేయాలని చాలా ఏళ్లుగా ఆయన, మరొక న్యాయవాది కలిసి వేసిన ప్లాను బట్టబయలైంది. నకిలీపత్రాలు సృష్టించిన కేసులో జైలుకెళ్లిన ఈ బడా నేత ఇప్పుడు బెయిల్ పై బయటే ఉన్నారు. దీపక్ రెడ్డి తాజాగా మరో కేసు విషయంలో తెరమీదికొచ్చారు. క్షక్షకట్టి ఒక మహిళ సంతకాలను ఫోర్జురీచేసి, ఆమె పరిశ్రమను, స్థలాన్ని కాజేయాలనుకున్న దీపక్ రెడ్డి బాగోతం వెలుగులోకి వచ్చింది.  క్రషర్ ప్లాంట్లు నిర్వహించే ఒక మహిళకు సంబంధించిన ప్లాంటును ఆమె తమకు విక్రయించి, అడ్వాన్సు తీసుకుందంటూ దొంగ పత్రాలు సృష్టించారు. ఆ మహిళ సంతకాన్ని సైతం ఫోర్జురీ చేసారు. మునుపు దీపక్ రెడ్డి ఆమె కంపెనీకి సంబంధిచి వ్యాపార లావాదేవీలు నిర్వహించారు. ఆర్థిక పరమైన అంశాల విషయంలో వివాదం చోటుచేసుకోవడంతో దీపక రెడ్డి ఆమె ప్లాంటును కాజేయాలని ఈ పని చేసినట్టు తెలుస్తోంది. కోర్టు నోటీసులు అందుకున్న సదరు మహిళా పారిశ్రామికవేత్త 2014లో ఈ అగ్రిమెంట్ తాను చేయలేదని, తన సంతకం ఫోర్జురీ అయ్యిందని కేసు నమోదు చేసింది. ఫోరెన్సిక్ వారు సంతకం ఫోర్జురీ అయ్యిందని ధృవీకరించారు. దీంతో దీపక్ రెడ్డికి నోటీసులు అందాయి. మళ్లీ అరెస్టు తప్పదని భావించిన ఈ టిడిపి నేత ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. 
ఇది తెలుగుదేశానికి చెందిన ఒక ఎమ్మెల్సీ భూ కబ్జాలు, దొంగ పత్రాలు, ఫోర్జరీలకు చెందిన విషయం. ఇలాంటి వందలాది కేసులు టిడిపి నేతలపై ఉన్నాయి. వారంతా చంద్రబాబు కేబినెట్ లో, మంత్రి వర్గంలో నిక్షేపంలా పదవుల్లో ఉన్నారు. చంద్రబాబు అండతోనూ, అధికార దురహంకారంతోనూ రాష్ట్రాన్ని ఎడాపెడా దోచేస్తున్నారనడానికి దీపక్ రెడ్డి ఉదంతం మరో ఉదాహరణగా నిలిచింది. అవునులెండి తెలుగుదేశం పార్టీనే ఎన్టీఆర్ నుంచి కబ్జా చేసిన చరిత్ర బాబుది. అలాంటి నాయకత్వంలో తమ్ముళ్లు మాత్రం ఇలా కాక ఇంకెలా ఉంటారు అనుకుంటున్నారు ప్రజలు. దొంగలు, దోపిడీదార్లు, కబ్జాకోర్లతో నిండిన తెలుగుదేశం పార్టీ పాలనలో తెలుగు రాష్ట్రం అభివృద్ధిలో కాదు అధః పాతాళంలోకి దూసుకుపోతోందని కూడా అనుకుంటున్నారు.  

Back to Top