ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పరిపాలన లోకి వచ్చాక చెప్పుకోడానికి ఒక్క మంచి పని లేదు కానీ, ప్రజల ఉసురు పోసుకోడానికి ఎన్నెన్నో పాపాలు చేశారు. మచ్చుకి ఒక 15 చూద్దాం..<br/>1. రైతులకు రుణ మాపీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశారు. అప్పుల ఊబిలో కూరుకొనిపోయిన రైతులు దిక్కుతోచకుండా ఉన్నారు. వందల మంది ఆత్మహత్య చేసుకొంటే ఆ పాపం చంద్రబాబుది కాదా..!2. శేషాచలం అడవుల్లో 20 మంది కూలీలను కిరాతకంగా చంపించి, స్మగ్లర్లను కాపాడుకొన్న ఘనత పచ్చ బాబుదే..!3. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసగించినందుకు, ఒకప్పుడు ఆర్థిక స్వావలంబనతో కళకళలాడిన అక్క చెల్లెమ్మలు ఇప్పుడు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారే..!4. చంద్రబాబు షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కోసం గంటల తరబడి ఆపేసినందుకు..పుష్కరాల వేళ తొక్కిసలాట జరిగి 28 మంది ప్రాణాలు పోగొట్టుకొన్నారే.!5. సింగపూర్ కంపెనీల కోసం వేలాది ఎకరాలు రైతుల నుంచి లాక్కొని, విదేశీ సంస్థలకు రాజధాని ప్రాంతాన్ని టోకుగా అమ్మేసిన ఘనత ఎవరిది..!6. మహిళలకు రక్షణ అంటూ గద్దెనెక్కి డ్యూటీ సక్రమంగా చేసిన మహిళా తహశీల్దార్ ను జుట్టు పట్టించి కొట్టించిన ఘనత పచ్చ చొక్కాలదే కదా..!7. కమీషన్ల కోసం పట్టిసీమ పథకాన్ని తెచ్చి గోదావరి జిల్లాల రైతుల్ని సముద్రంలో కలిపేస్తున్న ఘనత మీది కాదా..!8. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి చేసిన కోట్ల రూపాయిలతో తెలంగాణలో ఎమ్మెల్సీలను కొనబోయి నిస్సిగ్గుగా దొరికిపోయింది చాలక.. కేసు నుంచి బయట పడేందుకు రెండు రాష్ట్రాల మద్య విద్వేషాలు రగిల్చింది ఎవరు..!9. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఉద్యోగాలు ఇవ్వక పోగా, ఉన్న ఉద్యోగాలు ఊడపీకి ఇంటికి పంపిస్తున్నది ఎవరు...!10. మంత్రి నారాయణ విద్యాసంస్థల్లో పిల్లలు చనిపోతున్నా చర్యలు తీసుకోకుండా వెనుకేసుకొని వస్తుండటానికి కారణం ఎవరు..!11. చదువుల బంగారు తల్లి రిషితేశ్వరి బలవంతంగా చనిపోతే, దీనికి కారకులు అయిన వారిని వెనకేసుకొని వస్తున్న ఘనత తమరిదే కదా..!12. బలహీన వర్గాలకు ఇళ్లు కట్టిస్తామని ప్రచారాన్ని మోత ఎక్కించి, ఈ ఏడాది పై చిలుకు కాలంలో ఒక్కటంటే ఒక్క కొత్త ఇల్లు కట్టించని చరిత్ర మీది కాదా...!13. బోగాపురం ఎయిర్ పోర్టు పేరుతో ఐదు వేల ఎకరాల్ని లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకొంటున్న కుట్ర చంద్రబాబు అండ్ కో దే కదా.!14. దేశంలో ఎక్కడా లేని విధంగా భూ సమీకరణ చేయాలని పంతంతో రైతుల పొట్ట కొడుతున్న ఘనత తమరిదే కదా...!15. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, మీరు మాత్ర ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరుగుతూ గొప్ప ప్రభుత్వం గా ప్రచారం చేసుకొని, చివరకు ప్రత్యేక హోదా రానీయకుండా చేసింది మీరే కదా. టీడీపీ ఎంపీలను పంపించి ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీలే ముద్దు అని చెప్పించింది తమరు కాదా..!<br/>ఇలా చెప్పుకొంటూ పోతే చాలా నేరాలు ఘోరాలు సీరియల్ తయారు అవుతుంది. అందుకే 15 పాపాలు..ప్రజలకు శాపాలుగా మాట్లాడుకోవాల్సి వస్తోంది.