బాబులకే బాబు చంద్రబాబు..!

ముఖ్యమంత్రి చంద్రబాబు
నాయుడుకి మొదట నుంచి ఒక అలవాటు ఉంది. అనుకూల మైన వాళ్లతో భజన బ్రందాన్ని ఏర్పాటు
చేసుకోవటం, వాళ్ల చేతుల మీదుగా పరిపాలన సాగించటం అలవాటు. అవినీతి, అక్రమాలకు మారు
మాట్లాడకుండా జై కొట్టే వాళ్లు అంటే ఆయనకు ఇష్టం. ఇప్పుడు కూడా పరిపాలన అదే బాటలో
నడుస్తోంది.

రాజధాని పేరుతో చంద్రబాబు
చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు అన్నీ ఇన్నీ కావు. సింగపూర్ కంపెనీలతో చీకటి
లావాదేవీలన్నీ మునిసిపల్ మంత్రి నారాయణ చక్కబెట్టుకొని వస్తున్నారు. ఈ రాజధాని
ఎపిసోడ్ ను మునిసిపల్ వ్యవహారాల శాఖ ద్వారా 
నడిపిస్తున్నారు. వాస్తవానికి ఇదంతా రెవిన్యూ శాఖ అంశం అయినప్పటికీ తెలివిగా
మునిసిపల్ మంత్రిత్వ శాఖ పరిధి కిందకు తెచ్చేశారు. మొదటగా ఈ మంత్రిత్వశాఖను
పర్యవేక్షించిన సాంబశివరాలు రాజధాని వ్యవహారాల్ని పర్యవేక్షించారు. కానీ, సింగపూర్
కంపెనీలకు మొత్తం ధారాదత్తం చేయటానికి అంగీకరించక పోవటంతో ఆయన్ని అప్రాధాన్య శాఖ
కు మార్చేశారన్న మాట వినిపిస్తోంది. తర్వాత కాలంలో ఈ బాధ్యతలు చేపట్టిన సీనియర్
అధికారి గిరిధర్ కూడా కొంత కాలం తర్వాత అరాచకాలకు నో చెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో ఆయన్ని మరీ దారుణంగా పబ్లిక్ సర్వీసు కమిషన్ కు పంపించేశారు.

చంద్రబాబు నాయుడు
సన్నిహితుడు, బాలక్రిష్న కు స్వయానా వియ్యంకుడు అయిన ఎంవీఎస్ఎన్ మూర్తికి చెందిన
గీతమ్ వైద్య కళాశాలకు అటానమస్ ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవని వైద్య ఆరోగ్య శాఖ
ముఖ్య కార్యదర్శి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. దీంతో అప్పటికప్పుడు ఆయన్ని బదిలీ
చేసి పెద్దగా ప్రాధాన్యం లేని యువజన సర్వీసుల శాఖ కు పంపించేశారు. బినామీ సంస్థలు,
సన్నిహిత కాంట్రాక్టర్లకు పరిశ్రమల స్థాపన పేరుతో భూములు దారపోయాలని చంద్రబాబు
తహతహ లాడుతున్నారు. ఇందుకోసం వేల ఎకరాల అటవీ భూముల్ని డీ నోటిఫై చేయాలని అటవీ శాఖ
ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ జోసెఫ్ మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఇందుకు
నిబంధనలు అంగీకరించవని చెప్పినందుకు ఆయన్ని అప్పటికప్పుడు బదిలీ చేశారు.

నిబంధనల్ని తుంగలో తొక్కి
సొంత పనులు చేయాలని, లేదంటే బదలీ వేటు తప్పదని చంద్రబాబు పరోక్షంగా సంకేతాలు
పంపిస్తున్నారు. దీంతో ఐ ఎ ఎస్ వర్గాలు చైతన్యం కోల్పోయి పరిపాలన ను చంద్రబాబు
సొంత వ్యవహారాల కింద మార్చేసే ప్రమాదం ఉందన్నమాట వినిపిస్తోంది. ముఖ్యంగా అవినీతి
కోసం అధికారుల్ని బలి పెట్టడాన్ని ఐఎఎస్ వర్గాలు బాగా ప్రశ్నిస్తున్నాయి.  

Back to Top