టార్గెట్ 2 వేల కోట్ల రూపాయిలు...!

చంద్రబాబు ప్రభుత్వానికి ఇప్పుడు లక్ష్యం చాలా స్పష్టం గా కనిపిస్తోంది. ప్రజల నుంచి వేధించుకొని అయినా సొమ్ములు వసూలు చేసుకొనేందుకు సిద్ద పడుతోంది.

ఓటుకి కోట్లు కుంభకోణం లో చంద్రబాబు అసలు స్వరూపం బట్ట బయలు అయిపోయింది. పట్ట పగలు దొరికిన దొంగ గా దేశ వ్యాప్తంగా ప్రచారం పొందారు. దీంతో  ఆ కళంకాన్ని తుడిచేసుకోవాలంటే గొప్ప పరిపాలన వేత్త గా పేరు కొట్టేయాలని ఎత్తుగడ వేసుకొన్నారు.

ఇందుకోసం పుష్కరాల్ని వేదికగా ఎంచుకొన్నారు. దాదాపు 16 వందల కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి పుష్కరాల్ని నిర్వహించారు. గతంలో జరిగిన పుష్కరాలకు ఎప్పుడూ కూడా వంద కోట్ల రూపాయిలకు మించి ఖర్చు కాలేదు. అటువంటిది ఒక్కసారిగా 16 వందల కోట్ల రూపాయిలు అంటే తెలుగు తమ్ముళ్లు ఏ స్థాయిలో డబ్బు మింగేశారో అర్థం అవుతుంది. పైగా ప్రచారం కోసం డబ్బును మంచినీళ్ల లా వినియోగించారు. కానీ, మొదటిరోజే చంద్రబాబు సినిమా పిచ్చి కోసం 29 మంది అభాగ్యులు కన్ను మూశారు. దీంతో మంచి పేరు రావటం బదులు దేశ వ్యాప్తంగా భక్తుల్ని చంపేశారన్న చెడ్డ పేరు మూట కట్టుకొన్నారు.

దీంతో మరింత పట్టుదలతో పేరు ప్రతిష్టల కోసం పాకులాట మొదలైంది. అమరావతి శంకుస్థాపన కోసం దాదాపు 4 వందల కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టేశారు. గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు కోసం కోట్లాది రూపాయిల్ని ధారపోశారు. ఇక్కడ కూడా తెలుగు తమ్ముళ్లు దొరికిన వాళ్లకు దొరికినంతగా తినేశారు. అయితే ప్రధానమంత్రి నుంచి ఎటువంటి హామీలు రాబట్టకుండా మట్టి, నీరు తీసుకొని సంతోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మొత్తం మీద నిరుపేద రాష్ట్రపు ఖజానా మీద మొత్తంగా 2 వేల కోట్ల రూపాయిల భారం పడినట్లయింది. దీంతో అంతటి భారీ మొత్తాన్ని పూడ్చుకొనేందుకు చంద్రబాబు సర్కారు సిద్ద పడుతోంది. శంకుస్థాపన జరిగిన వెంటనే ఆర్టీసీ బస్సు ఛార్జీలను ఎడా పెడా పెంచేసింది. తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్దం చేస్తోంది. అటు వ్యవసాయ దారుల నుంచి నీటి తీరువాను ముక్కు పిండి అయినా వసూలు చేయాలని నిర్ణయించారు. ఇటు నిత్యావసర వస్తు వినిమయ వ్యవహారాలకు సంబంధించిన సుంకాల్ని గుట్టు చప్పుడు కాకుండా పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. అదే పూర్తయితే నిత్యావసర వస్తువుల ధరలు మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంది.

మొత్తం మీద చంద్రబాబు వ్యక్తిగత ప్రచారం కోసం ప్రజల నెత్తిన దాదాపు రెండు వేల కోట్ల రూపాయిల దాకా వడ్డింపులు ఖాయం అన్నమాట.. 
Back to Top