సూత్రధారి చంద్రబాస్, పాత్ర ధారులు మారుతున్నారంతే..!

రూ. 12 కోట్ల రూపాయిలతో పూర్తయ్యే పనులకు రూ. 110 కోట్లు చెల్లిస్తామంటే
అందులో 90 శాతం డబ్బులు కొట్టేయడానికి స్కెచ్ వేశారు అని చిన్న పిల్లల్ని అడిగినా
చెప్పేస్తారు.

పనులు పూర్తి చేయాల్సిన కాంట్రాక్టర్ కథలు వినిపించి డబ్బులు కావాలని అడిగితే
ఎకా ఎకిన రూ. 44 కోట్లు ప్రభుత్వం చెల్లించేస్తే దానిని అవినీతి అని ఎందుకు
అనుకోకూడదు...

ఇప్పుడు ఈ రెండూ ప్రశ్నలు నీటి పారుదల శాఖ చుట్టూ తిరుగుతున్నాయి. ఇందులో తెలుగుదేశం
పార్టీ కి చెందిన సీనియర్ నేతలే నిండా మునిగి ఉంటున్నారు. దీంతో ఈ వివాదాలకు
మూలంగా చంద్రబాబు పేరు వినిపిస్తోంది.

గాలేరు నగరి సుజల స్రవంతి కాంట్రాక్టు విషయంలో ఈ బండారం బయటకు పొక్కింది. 29వ
ప్యాకేజీలో పనులకు రూ. 12 కోట్లు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.కానీ, దీన్ని
రూ. 110 కోట్లకు పెంచేశారు. అంటే 10..12 కోట్లతో అయ్యే పనికి 110 కోట్లు అంటే
దాదాపు రూ. 100 కోట్లు జేబుల్లోకి వెళ్లిపోయాయన్నది అర్థం అవుతుంది. పైగా పరిపాలన
అనుమతులు లేకపోయినప్పటికీ రూ. 35 కోట్ల మేర చెల్లింపులు కూడా జరిగిపోయాయి. దీన్ని
బట్టి ప్రభుత్వ వ్యవస్థ ఏ విధంగా సాగిలపడిందీ అన్నది అర్థం అవుతోంది. ఎందుకంటే ఈ
పనులు చేజిక్కించుకొన్నది స్వయానా తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్. పైగా ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టే నాయకునిగా ఆయనకు పేరు ఉంది. అందుకే
ప్రభుత్వయంత్రాంగం కళ్లుమూసుకొని ఈ విధంగా చెల్లింపులు చేసేసింది అన్న సంగతి అర్థం
అవుతుంది.  అయితే ఈ వ్యవహారాల్ని బయట పెట్టింది
నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు వర్గాలుగా చెబుతున్నారు. ఈ
మొత్తం ఎపిసోడ్ తో తనకు సంబంధం లేదని ఆయన చేతులు దులిపేసుకొంటున్నారు. దీని మీద
పెద్ద ఎత్తున దుమారం రేగేటప్పటికీ, తెలుగుదేశం ఎంపీ సీఎం రమేశ్ తనదైన శైలిలో
స్పందించారు.

అవుకు రిజర్వాయర్ కు గాలేరు నగరి సుజల స్రవంతి పథకం నుంచి నీటిని తరలించటానికి
రూ. 401 కోట్లతో పనుల్ని ఎన్సీసీ..మేటాస్ జాయింట్ వెంచర్ కు అప్పగించారు. అయితే ఈ
పనుల్ని అన్ని రకాలుగా పూర్తి చేయాల్సిన కాంట్రాక్టర్ ఒక మెలిక పెట్టారు. అదనంగా
1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ అదనంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని
దీనికి అదనంగా చెల్లించాలని పట్టు పట్టారు. నిబంధనలకు విరుద్దం అని తెలిసినప్పటికీ
ఇందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి టీడీపీ ఎంపీ
రమేష్ లేఖ రాశారు. ఇది మంత్రి దేవినేని ఉమా ను ఇరుకున పెట్టడానికే అన్న మాట
వినిపిస్తోంది.

వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచీ అవినీతి వరదలై
పారుతోంది. అయితే అన్ని కుంభకోణాల్లోనూ చంద్రబాబే సూత్రధారి అని చెబుతున్నారు.
ప్రధాన వాటా చంద్రబాబు తీసేసుకోవటంతో,మిగిలిన వాటాల్ని పంచుకోవటంతో తెలుగు
తమ్ముళ్ల మద్య కుమ్ములాటలు జరగుతున్నాయని చెబుతున్నారు. వాటాల పంపకంలో తేడాలు
రావటం వల్లనే నీటిపారుదల శాఖ బాగోతం బట్ట బయలు అయిందని చెబుతున్నారు. రావాల్సిన
కమీషన్లు దండిగా ముట్టడంతో చంద్రబాబు చిద్విలాసంగా ఉన్నారన్న మాట వినిపిస్తోంది. 

Back to Top