నాన్న ప్రారంభించిన పనులు జగనన్న చేస్తాడు

విజయనగరం :

తోటపల్లి ప్రాజెక్టు ప్రధాన కాలువ పనులు మధ్యలోనే నిలిచిపోయూయి. నిధులు పూర్తిస్థాయిలో మంజూరు కాకపోవడం, అధికారులు, ప్రభుత్వం, స్థానిక నాయకుల నిర్లక్ష్యం వల్ల సస్యశ్యామలం కావాల్సిన భూములన్నీ బీడువారుతున్నాయమ్మా!’ అని మహానేత రాజన్న తనయ శ్రీమతి షర్మిల వద్ద రైతులు వాపోయారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని 32 వేల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందాల్సి ఉందని, తోటపల్లి ప్రధాన కాలువ పనుల్లో జాప్యం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను స్థానిక రైతులు శ్రీమతి షర్మిల దృష్టికి తీసుకువచ్చారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా ఆదివారం చీపురుపల్లి నియోజకవర్గంలో శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగింది. తోటపల్లి కాలువ ప్రాంతంలో శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతుండగా.. రైతులంతా ఆమె వద్దకు వచ్చి సమస్యలు వివరించారు.

ఈ కాలువ పనులకు అప్పట్లో చంద్రబాబు శిలాఫలకం వేసి, ఒక్కపైసా కూడా విదల్చలేదని చెప్పారు. రాజన్న హయాంలో పూర్తిస్థాయిలో పనులకు రూపకల్పన జరిగిందని వివరించారు. సమీపంలోని గెడగెడ్డ వద్ద నీరు చేరేలా, తోటపల్లి నుంచి జిల్లాలో సుమారు లక్షా 80 వేల ఎకరాలకు లబ్ధి చేకూరేలా అనుమతులు మంజూరు చేసి, రూ.450 కోట్ల నిధులిచ్చింది మహానేత డాక్టర్ వైయస్ఆర్‌ అని గుర్తు చేశారు. కాలువ పనులు జాప్యం కావడంతో ప్రస్తుతం అంచనాలు సుమారు రూ. 900 కోట్లకు చేరుకున్నాయని, ఇప్పటికీ పనులు పూర్తికాలేదని వివరించారు. జీఓ విడుదలైనా పనులు పూర్తి చేయలేకపోయారని మాజీ మంత్రి పెన్మెత్స సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, చీపురుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల సూర్యనారాయణ తదితరులు శ్రీమతి షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. ప్రాజెక్టు పూర్తయితే రైతులకు కలిగే ప్రయోజనాలను వారు వివరించారు.

దీనిపై శ్రీమతి షర్మిల స్పందిస్తూ.. ‘నాన్న మొదలుపెట్టిన పనులు మనం చేయించకపోతే ఎలా.. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. జగనన్న మీ అందరికీ న్యాయం చేస్తారు’ అని భరోసా ఇచ్చారు. ఇక్కడి నీళ్లు ఏమైనా వృథా అవుతాన్నాయా? అని స్థానికులను ప్రశ్నించగా.. ఓ ప్రైవేట్ ప్రాజెక్టుకు తరలించేందుకు బొత్స కుటుంబ‌ సభ్యులు కుట్ర పన్నుతున్నట్టు అనుమానంగా ఉందని వారు సమాధానమిచ్చారు.

అదే ఆదరణ!
శ్రీమతి షర్మిల పాదయాత్రకు అదే ఉత్సాహం.. అదే ఉల్లాసం.. అడుగడుగునా ప్రజల నీరాజనాలు.. చీపురుపల్లి నియోజకవర్గంలో ఆదివారం జరిగిన పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఉదయం 9. 30 గంటలకు గుజ్జంగివలస నుంచి ప్రారంభమైంది. అచ్యుతాపురం, పెనుబర్తి జంక్షన్ అనంతరం భోజన విరామానికి ఆగారు. ‌తరువాతాయాత్ర గరివిడి, ఫేకర్ జంక్ష‌న్, శ్రీరాంనగ‌ర్, బ్రిడ్జి ప్రాంతం మీదుగా చీపురుపల్లి కూడలికి చేరుకుంది. చీపురుపల్లి సమీపంలోని అగ్రహారం వద్ద‌ శ్రీమతి షర్మిల రాత్రి 8.30 గంటల సమయంలో రాత్రి బసకు ఉపక్రమించారు. ఆదివారం సుమారు 15.1 కిలోమీరటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. మధ్యలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ విగ్రహాలకు శ్రీమతి షర్మిల పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గరివిడిలో ఓ అభిమాని శ్రీమతి షర్మిలకు రాజస్థాన్ కత్తి, నాగలి అందించారు. ‌పాదయాత్రలో భాగంగా ఆమె వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. యువతకు చదువుకోవాలని సూచించారు. ఆటోల్లో, బస్సుల్లో ఉన్న ప్రయాణికులను పలకరించారు. ఎక్కడ చూసినా భారీ ఎత్తున జనం కనిపించారు.

శ్రీమతి షర్మిల ఎప్పడు వస్తారా? అని ప్రజలు ఎదురుచూశారు. రోడ్లపై బారులు తీరారు. బొత్స ఇలాకాలో.. సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో అశేష జనవాహిని కనిపించింది. చీపురుపల్లి బహిరంగ సభలో శ్రీమతి షర్మిల మాట్లాడుతూ.. వైయస్ఆర్ పాలనను గుర్తుచేశారు. ‌టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ప్రజల‌ కళ్ళకు కట్టినట్లు వివరించారు.

విశ్వాస ఘాతకుడు బొత్స: గద్దె

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సి.ఎం. కావాలని మొదటి సంతకం చేసింది బొత్స సత్తిబాబు కాదా? అని వైయస్ఆర్‌ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గ‌ద్దె బాబూరావు ప్రశ్నించారు. ‘ఎన్టీఆర్ పెట్టిన భిక్షతో నేను ఈ స్థాయిలో ఉన్నా. వై‌యస్‌ఆర్ పెట్టిన భిక్షతో సత్తిబాబు ఈ ఎత్తుకు ఎదిగారు.‌ అయితే ఆ విశ్వాసం సత్తిబాబుకు లేదు’ అని ఆయన విమర్శించారు. చీపురుపల్లిలో ఆదివారం జరిగిన శ్రీమతి షర్మిల బహిరంగ సభలో ఆయన కూడా మాట్లాడారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత కొడుకు ముఖ్యమంత్రి కావడానికి అన్ని విధాలా అర్హుడు’ అన్నారు. ‘ఆరు తరాలుగా గాంధీ కుటుంబం దేశాన్ని ఏలటం వారసత్వం కాదంట. వైయస్ఆర్ వారసుడిగా ప్రజలు స్వాగతించిన మహానేత కొడుకు ముఖ్యమంత్రి కావడం మాత్రం వారసత్వమంట’ అని‌ గద్దె విమర్శించారు.

Back to Top