షర్మిల సభకు అశేష జనం.. అభిమాన ధనం

ఇచ్ఛాపురం (శ్రీకాకుళం జిల్లా),

5 ఆగస్టు 2013: మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంపై రాష్ట్ర ప్రజలు అభిమాన వర్షం కురిపించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆదివారం సాయంత్ర జరిగిని శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వెల్లువలా తరలివచ్చిన జనం హర్షం వ్యక్తంచేశారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టిడిపిల కుటిల, కుతంత్రాలను ఎండగడుతూ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ప్రజలకు బాసటగా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 3,112 కిలోమీటర్ల సుదీర్ఘ, చరిత్రాత్మక మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు.

ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖర్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆవిష్కరించిన ప్రజాప్రస్థాన జ్ఞాపిక వద్ద ఏర్పాటు చేసిన ముగింపు మహాసభ అశేష జనసందోహంతో నిండిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అభిమానులు, పార్టీ శ్రేణులు ఇచ్ఛాపురానికి తలిరావడం ప్రారంభించారు. పాదయాత్రలో ఉన్న శ్రీమతి షర్మిల సాయత్రం నాలుగు గంటలకు నేరుగా విజయప్రస్థాన స్థూపం వద్దకు చేరుకున్నారు.

గతంలో తన తండ్రి డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ఆవిష్కరించిన ప్రజాప్రస్థాన స్థూపం వద్దకు వెళ్ళిన శ్రీమతి షర్మిల రాజన్నకు నివాళులు అర్పించారు. అనంతరం వైయస్ఆర్ విగ్రహంతో ఏర్పాటు చేసిన విజయప్రస్థాన స్థూపాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి నేరుగా‌ పాదయాత్ర ముగింపు సభా వేదిక మీదకు వచ్చారు. అప్పటికే ఆ వేదిక పార్టీ నాయకులతో నిండిపోయింది. శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం ముగింపు సభకు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల వారు కూడా అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. శ్రీమతి షర్మిలతో పాటు ఇడుపులపాయ నుంచి పాదయాత్ర చేసిన వారు ఆమె వెన్నంటే ఉన్నారు. నాయకుల ప్రసంగాలు పూర్తయిన తరువాత కూడా సభకు హారజైన అభిమాన జనం సభా ప్రాంగణంలో అలాగే నిల్చుండిపోయారు.

Back to Top