విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం రూ. 400 కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు ఏం సాధించారన్న మాట ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ప్రజల సొమ్ము విరివిగా ధారపోసి ప్రచారం చేసుకోవటం తప్ప పనికి వచ్చేది ఏమీ సాధించలేదు.<br/>రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయింది. వేలాది పరిశ్రమలు దూరం అయ్యాయి. లక్షలాది ఉద్యోగ అవకాశాలు కోల్పోవటం జరిగింది. ఈ నష్టాన్ని భర్తీ చేయాలంటే అప్పటి ప్రధానమంత్రి పార్లమెంటు వేదికగా ఇచ్చిన హామీ అమలు కావాలని అంతా ఆకాంక్షిస్తున్నారు. ప్రజల అభిలాషను ప్రతిబింబింప చేస్తూ బాధ్యత గల ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హోదా కోసం ఉద్యమిస్తున్నారు. డిల్లీలో మహా ధర్నా చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి లో ఇతర పార్టీల అగ్ర నేతలకు తెలిసేట్లుగా చేశారు. ఆంధ్రుల ఆకాంక్షను ఢిల్లీలో తెలియ చెప్పారు. రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపు ఇస్తే ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించి తమ ఆకాంక్షను తెలియ చెప్పారు. గుంటూరు వేదికగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేసినప్పుడు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. <br/>ఇంతటి స్థాయి లో ప్రజలు కోరుకొంటుంటే ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన తీసుకొని రాకుండా చంద్రబాబు తనకు కావలసిన ప్యాకేజీల గురించి పదే పదే ప్రస్తావించుకొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం ప్రజలంతా కోరుకొంటున్నట్లుగా ప్రత్యేక హోదా గురించి కానీ, చంద్రబాబు తలచుకొనే ప్యాకేజీల గురించికానీ ప్రస్తావించలేదు. దీంతో 400 కోట్ల రూపాయిల హడావుడి ఆవిరి అయిపోయినట్లు అయింది.