పాలమూరులో సాగునీటికి రాజన్న పెద్ద పీట

మహబూబ్‌నగర్:

మహబూబ్ నగర్ జిల్లా వెనుకబాటుతనాన్ని దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడో గుర్తించారు. దానిని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం ఆయా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కేవలం 20 శాతం నిధులు కేటాయిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలమయ్యే అవకాశం ఉన్నా, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టులను హడావుడిగా ప్రారంభించినా రబీ సీజన్‌కు సాగునీరు ఇ చ్చే పరిస్థితి లేకుండా పోయింది. నెట్టెంపాడు ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం ప్రకటించినా, పనులు పూర్తికాకపోవడంతో వెయ్యి ఎకరాలకు కూడా నీళ్లిచ్చే పరిస్థితి లేదు. దేశంలోనే అక్షరాస్యతలో అత్యంత వెనుక బడిన జిల్లా కావడంతో... అక్షరాస్యతను పెంపొందించాల నే ఉద్దేశంతో పాలమూరు విశ్వవిద్యాలయాన్ని ఏ ర్పా టు చేసిన ఘనత మహానేత రాజశేఖర రెడ్డికే దక్కుతుంది. బడుగు, బలహీన వర్గాలకు చెందిన కుటుం బాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని అమలు చేయడంతో ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. ఆ రోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలు ఖర్చయ్యే వై ద్యాన్ని కూడా నిరుపేదలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ ఏ దో విధంగా వైఎస్సార్ పథకాలతో లబ్ధిపొం దారు. అందుకే రాజన్న బిడ్డ షర్మిల జిల్లాకు వస్తుండడంతో ఆమెను చూసేం దుకు జిల్లాప్రజలు తహతహలాడుతున్నారు.

నేడు జిల్లాలో ప్రవేశించనున్న షర్మిల
  
      వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌ రెడ్డి తరుఫున ఆయన సోదరి షర్మిల చేపట్టి న ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవేశించనుంది. జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర చేస్తారు. దాదా పు 240 కిలోమీటర్ల దూరం నడుస్తారు. అన్ని వర్గాల ప్రజల కష్టనష్టాలను ఆమె తెలుసుకోనున్నారు. జిల్లాలో యాత్రను విజయవంతం చేసేందుకు జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు. కర్నూలు జిల్లా నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించనున్న షర్మిలకు ఘనస్వాగతం పలికేందుకు పుల్లూరు గ్రామశివార్లలో మధ్యాహ్నం ఒంటిగంటకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు స్వచ్ఛందంగా తరలిరావడానికి ఎవరికి వారే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పాదయాత్ర సందర్భంగా జిల్లాలో పుల్లూరు, గద్వాల, మహబూబ్‌నగర్‌లలో భారీ బహిరంగ సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు.

Back to Top