సింగపూర్ కి రాజపత్రాలు... రైతులకు డమ్మీ పత్రాలు

 విజ‌య‌వాడ‌: చంద్రబాబు నాయుడు తనకు కలిసి వచ్చిన రెండు నాల్కల పద్దతిని
రాజధాని ప్రాంతంలో కూడా వినియోగిస్తున్నారు. సింగపూర్ బినామీ సంస్థలకు రాచబాట
వేస్తున్న బాబు, భూములు కోల్పోయిన రైతులకు మాత్రం క్యాబేజీ పువ్వులు పెడుతున్నారు.

సింగపూర్ కి అలా..

సింగపూర్ బినామీ సంస్థల కోసం చంద్రబాబు రాజపత్రాలు తయారుచేయించారు. ఇందుకోసం
మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేసి, స్టాంపు వేసి మరీ ఇచ్చేశారు. భూముల మీద సర్వ
హక్కులు కల్పించేవిధంగా ఉత్తర్వులు తీర్చి దిద్దారు. పైగా సింగపూర్ సంస్థలకు ఏమాత్రం
నష్టం కలగని విధంగా ఒప్పందాల్ని మేళవించారు. వీటికి అవసరమైతే పరిహారం క్లాజు కూడా
జోడించారు.

రైతులకు ఇలా

         రాజ‌ధాని కోసం
భూములిచ్చిన రైతుల‌కిస్తున్న ప్లాట్ల కేటాయింపు ప‌త్రాలు ఉత్తుత్తి పత్రాలే. ఇది
తాత్కాలిక కేటాయింపేన‌ని,
వీటిని దేనికీ
ఉప‌యోగించుకునే అవ‌కాశం లేద‌ని ప‌త్రాల్లోనే స్ప‌ష్టంగా పేర్కొన్నారు. పైగా అధీకృత
అధికారి సంత‌కం కూడా లేక‌పోవ‌డంతో వాటికి ఎలాంటి విలువా లేకుండాపోయింది. ఉప‌యోగ‌ప‌డ‌ని
ప‌త్రాలు ఇవ్వ‌డ‌మే కాకుండా రైతుల‌కు ప్లాట్లు అప్ప‌గిస్తున్న‌ట్టుగా ప్ర‌భుత్వం
ప్ర‌చారం చేసుకోవ‌డంపై రైతులు మండిప‌డుతున్నారు. దీనికి సీఎం వ‌చ్చి ఇంత హ‌డావుడి
చేయ‌డం అవ‌స‌రం లేదంటున్నారు.

చంద్రబాబు సమక్షంలో 981 మంది రైతుల‌కు ప‌త్రాలు అందించారు. కానీ
వాటిపై ఏ అధికారి సంత‌క‌మూ లేదు. సాధార‌ణంగా స్థ‌లాలు, భూముల కేటాయింపు ప‌త్రాలు జారీ చేసేట‌ప్పుడు
వాటిపై స్థానిక త‌హ‌శీల్దార్ సంత‌కం, స్టాంపు త‌ప్ప‌నిస‌రిగా ఉంటాయి. ఆ రెండూ లేక‌పోతే
అవి చెల్ల‌న‌ట్టే. రాజ‌ధానిలో భూ స‌మీక‌ర‌ణ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్న నేప‌థ్యంలో
ఇక్క‌డి ప్లాట్ల కేటాయింపు ప‌త్రాల‌పై స్థానిక కాంపిటెంట్ అథారిటీ ఉన్న స్పెష‌ల్
డిప్యూటీ క‌లెక్ట‌ర్ సంత‌కం పెట్టాలి. సీఆర్‌డీఏ త‌ర‌ఫున‌29 రాజ‌ధాని గ్రామాల‌కు స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ల‌ను
నియ‌మించారు. ఈ నేప‌థ్యంలో నేల‌పాడు ప్లాట్ల కేటాయింపు ప‌త్రాల‌పై ఆ గ్రామ సీఆర్‌డీఏ
కాంపిటెంట్ అథారిటీగా ఉన్న స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ సంత‌కం చేయాల్సి ఉన్నా
చేయ‌లేదు. క‌నీసం ఆయ‌న పేరు కూడా దానిపై ఎక్క‌డా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప‌త్రంపైనా, కిందా అధీకృత అధికారి, నేల‌పాడు అని మాత్ర‌మే ఉంది. దీంతో రైతుల్లో
ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతోంది. ప్ర‌భుత్వం ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఇలా చేసింద‌నే అనుమానాల‌ను
ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ఇందిర‌మ్మ ఇళ్ల ప‌ట్టాల స్థాయిలో కూడా లేని ఈ ప‌త్రాల‌తో
తాము ఏం చేయాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు. 

ఎటువంటి హ‌క్కు లేదు

రైతుల‌కిచ్చిన ఈ ప‌త్రాల‌పై కేటాయింపు తాత్కాలిక‌మేన‌ని స్ప‌ష్టంగా
పేర్కొన్నారు. ఈ ప‌త్రం ద్వారా రైతుకు ఎలాంటి యాజ‌మాన్య హ‌క్కు ల‌భించ‌ద‌ని చెప్ప‌డంతో
క‌నీసం అది యాజ‌మాన్య హ‌క్కుగా నిర్ణ‌యించే సాక్ష్యంగా కూడా ప‌నికి రాద‌ని
తేల్చిచెప్పారు. అంటే ఈ ప్లాట్ల‌ను అమ్ముకునే అధికారం కూడా రైతుల‌కు ఉండ‌దు.
అంతేకాదు దీనిపై ఎలాంటి రుణాలు తీసుకునే హ‌క్కూ, అగ్రిమెంటు చేసుకునే హ‌క్కూ రైతుకు ఇవ్వ‌లేదు.
ఫ‌లానా చోట ఎంత విస్తీర్ణంలో ప్లాట్లు ఇస్తున్నామ‌నే స‌మాచారం మాత్ర‌మే పొందుప‌రిచారు.
దీంతో ఈ ప‌త్రం వ‌ల్ల రైతుల‌కు ఒరిగేదేమీ లేద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. భూమి చ‌దును
చేసి,
లేఅవుట్లు వేసి
కొత్త స‌ర్వేనంబ‌ర్లు వ‌చ్చిన త‌ర్వాత తుది భూసమీక‌ర‌ణ యాజ‌మాన్య ప‌త్రాలు ఇచ్చేవ‌ర‌కు
ఈ ప‌త్రాల‌తోనే స‌రిపుచ్చుకోవాల్సి ఉంటుంది. ప్లాట్లు భౌతికంగా చూపించి తుది భూస‌మీక‌ర‌ణ
యాజ‌మాన్య ప‌త్రం ఇచ్చిన‌ప్పుడే రైతుకు దానిపై హ‌క్కు ఏర్ప‌డుతుంది. అయితే వాస్త‌వ
ప్లాట్లు ఎక్క‌డో చూపించ‌డానికి ఇంకా చాలా స‌మయం ప‌డుతుందని అధికారులే అంటున్నారు.
ప్ర‌స్తుతానికి నేల‌పాడులో మాత్ర‌మే ప‌త్రాలు ఇవ్వ‌గా మిగిలిన గ్రామాల్లో క‌నీసం ఈ
తంతు కూడా జ‌రిగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

 

Back to Top