నిలువెత్తు నాయకత్వం- య‌ల‌మంచ‌లి బ‌హిరంగ స‌భ‌లో భారీ వ‌ర్షం
- అభిమాన నేత కోసం వర్షంలోనూ నడిరోడ్డుమీద నిలబడిన జ‌నం
- వ‌ర్షంలో త‌డుస్తున్న ప్ర‌జ‌ల‌ను చూసి చ‌లించిన జ‌న‌నేత‌
-  మీరంతా తడవడం నాకు కష్టంగా ఉందంటు ప్ర‌సంగం ముగించిన వైయ‌స్ జ‌గ‌న్‌
- జ‌న‌నేత స‌హృద‌యంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం

విశాఖ‌:  కొంద‌రు నాయ‌కుల‌కు మైక్ దొరికితే చాలు గంట‌ల త‌ర‌బ‌డి ప్ర‌సంగాలు చేస్తూ ప్ర‌జ‌ల‌కు విసుకు పుట్టిస్తున్నారు. ఇక చంద్ర‌బాబు అయితే లేనిపోని గొప్ప‌లు చెబుతూ..తానే అన్ని క‌నిపెట్టాన‌ని క‌ళ్లిబొల్లి మాట‌లు చెబుతూ మ‌భ్య‌పెడుతుంటారు. అదే జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ అయితే ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌టం ఇష్టం లేదంటూ వేలాది మంది త‌న కోసం వ‌ర్షంలో నిల‌బ‌డినా..ఈ వ‌ర్షంలో తాను త‌డిచినా ఫ‌ర్వాలేదు..మీరంతా త‌డ‌వ‌డం త‌న‌కు క‌ష్టంగా ఉందంటూ తాను చెప్పాల్సింది క్లుప్తంగా చెప్పి ప్ర‌సంగాన్ని ముగించి ప్ర‌జ‌ల మ‌నసుల‌ను గెలుచుకున్నారు. ఇదంతా నిన్న విశాఖ జిల్లా య‌ల‌మంచ‌లి ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో చోటు చేసుకుంది. బ‌హిరంగ స‌భ ప్రారంభం కాగానే మీటింగ్ ప్రాంతంలో భారీ వ‌ర్షం కురిసింది. దీంతో వైయ‌స్ జ‌గ‌న్ త‌న ప్రసంగాన్ని మ‌ధ్య‌లోనే ముగించి త‌న స‌హృద‌యాన్ని చాటుకోవ‌డంతో స్థానికులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. 

బాబుకు వైయ‌స్ జ‌గ‌న్‌కు మ‌ధ్య  ఎంత వ్య‌త్యాసం
ఓటేసిన ప్రజలు న్యాయంకోసం సచివాలయం ముందు నిలబడితే... ’మిమ్మల్ని ఎవరు రానిచ్చారు ఇక్కడివరకు, తమాషాలు చేస్తున్నారా’ అని అవమానకరంగా మాట్లాడిన ఘనత ఎపి సిఎం చంద్రబాబుది. అధికారం ఇచ్చిన ప్రజలంటే ఆయనకు అంత చులకన. మళ్లీ ఓటు అవసరమైనప్పుడు తప్ప ఆయన కంటికి వాళ్లు మనుషుల్లాగే కనిపించరు. తన డాబు, దర్పం ఒలకబోస్తున్నది ఆ ప్రజాధనంతోనే అనే విషయం ఆయనకు మచ్చుకైనా గుర్తుండదు. అదే తెలుగునేలపై ప్రజలమధ్యనే, ప్రజలతోనే, ప్రజలకోసమే వేల కిలోమీటర్లు నడుస్తున్న నాయకుడు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. వీళ్లిద్దరి మధ్యా పోలిక చెప్పడానికి కూడా సామెతలు ఒప్పుకోవు అన్నంత అంతరం ఉంది. నాయకుడు ఎప్పుడు ప్రజలకోసమే ఆలోచించాలి.. ప్రజలనే తనకంటే అత్యంత శక్తిమంతులుగా గుర్తించాలి. తన కష్టం కంటే ప్రజల కష్టమే పెద్దది అనుకోవాలి. అలాంటి లక్షణాలన్నీ తండ్రి వైయస్‌ నుంచి పుణికిపుచ్చుకున్న నేత జగన్‌. 

పాదయాత్రలో భాగంగా శుక్రవారం యలమంచిలి సభకు చేరుకునేసరికి వర్షం కురుస్తోంది. తనకోసం ఎదురుచూస్తున్న వేలాదిమంది ప్రజలను దృష్టిలో పెట్టుకుని తడుస్తూనే నడిచారు జగన్‌. సభాస్థలికి చేరుకున్నాక అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడటం మొదలుపెట్టారు. తమ అభిమాన నేతకోసం వర్షంలోనూ నడిరోడ్డుమీద నిలబడి చిరునవ్వులు చిందిస్తున్న ఆ ప్రజల్ని చూసి నాయకుడు చలించిపోయాడు. ఎన్నో విషయాలు వారితో చెప్పాలనుకున్నా సరే వాయిదా వేసేశాడు. ’ఈ వర్షంలో నేను తడిచినా పరవాలేదు. మీరంతా తడవడం నాకు కష్టంగా ఉంటుంది’ అంటూ వారందరి ప్రేమాభిమానాలకూ చేతులెత్తి మొక్కుతూ ప్రసంగం ముగించారు జగన్‌. ప్రజలకోసం ఇంత ఆలోచించే ఆ నాయకుడి మాటలు అక్కడున్నవారినే కాదు... అన్నివర్గాల ప్రజలనూ, రాజకీయ నాయకులను ఆలోచింపజేశాయి. రాజకీయాలకోసం ప్రజల హక్కుల్ని కూడా కాలరాసే పాలన నడుస్తున్న రాష్ట్రంలో... ప్రజలకోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే నాయకుడి ప్రస్థానం సాగుతోంది. అది అతని పాలనా ప్రస్థానానికి నాంది పలికే రోజుకోసమే కోట్లమంది ఎదురుచూపు.   


Back to Top