జననేతకు బ్రహ్మరథం పట్టిన నెల్లూరు ప్రజలు

అన్ని కులాల వారికి ప్రత్యేక కార్పొరేషన్ల ప్రకటన

ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన కార్యాచరణ

నవంబర్ 1నఘనంగా రాష్ట్రఅవతరణదినోత్సవం

విభజన హామీల కోసంపోరాటం


ప్రజా సంకల్ప యాత్ర సాగుతున్న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రతి సభ జయప్రదమైంది. ప్రతి సమ్మేళనం ప్రజల గుండె చప్పుడుకు వేదికైంది. గూడురులో, పొదలకూరులో, బుచ్చిరెడ్డి పాళెంలో జరిగిన బహిరంగ సభలు జన సునామీని తలపించాయి. దారులన్నీ కిక్కిరిసిపోయాయి. యువనేతకు మద్దతుగా వేలాది మంది ప్రజలు బహిరంగ సభలకు వచ్చారు. ప్రతిపక్షనేత చెప్పే ప్రతి విషయాన్నీ మనసుతో విన్నారు. కోపం, బాధ, ఆవేశం, ఆక్రోశం, పోరాటాల్లో అన్నింటా మీకు తోడుగా నేనుంటానని ఆశేష ప్రజావాహినికి అభివాదం చేస్తూ హామీ ఇచ్చారు వైయస్ జగన్. పాదయాత్రలో వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ ఎమ్.పిలు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, వ్యాపార వేత్తలూ అందరూ కలిసి అడుగేసారు. 

వెంకటగిరిలో చేనేతలతో ఆత్మీయసమ్మేళనం నిర్వహించారు ప్రతిపక్షనేత. చంద్రబాబు చేనేతలను ఎలా మోసపుచ్చాడో వివరించారు. చేనేత కార్మికులకు రుణమాఫీ, తక్కువ వడ్డీకి లక్షరుణం, జిల్లాకో చేనేత పార్కు, బడ్జెట్ లో వెయ్యి కోట్ల కేటాయింపులు, ప్రతి నేత కుటుంబానికీ 1.50లక్షలతో ఇల్లు, మగ్గం షెడ్డూ అంటూ లెక్కలేనన్ని హామీలు ఇచ్చి పత్తా లేకుండా పోయాడన్నారు. చేనేతల కష్టాలు చూసాకే 45ఏళ్లకే పింఛను ఆలోచన జేసానని చెప్పారు. చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ప్రతి కుటుంబానికీ సబ్సిడీ అందిస్తానన్నారు.  దేవరపాళెంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం జరిపారు. ఆర్యవైశ్యుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కట్టుబడి ఉంటానని మాటిచ్చారు. హసీనాపురంలో మైనారిటీలతో ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ ముస్లింలకు అండగా ఉంటానన్నారు. అన్ని కులాలకూ కార్పొరేషన్లు అన్నారు. ప్రతి కులంలోనూ పేదలుంటారు. వారి అభివృద్ధి కోసం కార్పొరేషన్లు అని చెప్పారు. వారికి తక్కువ వడ్డీతకో, వడ్డీ లేకుండానో రుణాలిస్తే వారి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందన్నారు. 

మహాసంకల్పం @ 1000 కిలోమీటర్లు

ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు యువనేత, ఎపి ప్రతిపక్షనేత వైయస్ జగన్ మొదలు పెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో, వెంకటగిరి నియోజకవర్గంలో, సైదాపురం వద్ద 1000కి.మీలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత విజయ సంకల్ప స్థూపాన్ని ఆవిష్కరించారు. బాబు మోసాలు ఎండగట్టమంటూ మహిళాలోకానికి పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఇదే జిల్లాలో ఉన్న హసనాపురంలోనే పాదయాత్ర 1100 కిలో మీటర్ల మైలు రాయిని కూడా అధిగమించింది. 

పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను మరువకూడదు

తెలుగువాళ్లకోసం ఓ రాష్ట్రాన్ని సంపాదించిపెట్టిన పొట్టి శ్రీరాములు గారి గురించి ప్రజాసంకల్పయాత్రలో స్మరించుకున్నారు వైయస్ జగన్. ప్రాణాలు అర్పించి మనకు ఆంధ్రరాష్ట్రాన్ని సాధించిన ఆయన త్యాగం మరువలేనిదని కొనియాడారు. అలాంటి మహా మనిషిని రాష్ట్ర అవతరణ నాడు పట్టించుకోకపోవడం అన్యాయం అని అన్నారు. ముఖ్యమంత్రితో పాటు, ఇతర నేతలెవ్వరూ ఆయనకు కనీస గౌరవం ఇవ్వలేదని అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వచ్చాక పొట్టి శ్రీరాములు గారి గౌరవార్థం నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుతామని ప్రకటించారు. 

విభజన హామీలను సాధించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలం

ఫిబ్రవరి 1న ఎన్టీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన చిట్టచివరి బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మిత్రపక్షంగా ఉండి, తెలుగుదేశం ఎమ్.పిలు కేంద్ర మంత్రులుగా ఉండి నోరెత్తకుండా ఒకె చేసిన బడ్జెట్ రాష్ట్ర ఆశలను ఆవిరి చేసింది. కనీస రైల్వేజోన్ కూడా ప్రతిపాదించకుండా, విభజన హామీలకు, పోలవరానికీ ఎలాంటి కేటాయింపులూ లేకుండా వచ్చిన బడ్జెట్ ను ప్రతిపక్షపార్టీ ప్రశ్నించింది. ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల అమలు కోసం వైయస్ఆర్  కాంగ్రెస్ ఎమ్.పిలు పార్లమెంట్ లో నిరవధిక నిరసనలు తెలుపుతున్నారు. ఎపి ప్రతిపక్షనేత వైయస్ఆర్  కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా, ఎపి ప్రజల మనోభావాలకు అద్దం పడుతూ ఆ పార్టీ ఎమ్.పిలు పార్లమెంట్ లో తమ గళం వినిపిస్తున్నారు. అంతేకాదు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 8న వాపక్షాలు పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త బందుకు సైతం మద్దతిచ్చారు వైయస్ జగన్. 
ఆత్మకూరు నియోజకవర్గం జువ్వలగుంటపల్లి వద్ద విద్యార్థులతో కలిసి స్వయంగా బంద్ లో పాల్గొన్నారు. హోదావల్లే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, చంద్రబాబు ప్యాకేజీ నాటకాలకు తెరదింపాలని పిలుపునిచ్చారు. సంజీవని లాంటి హోదా మాట మూట కట్టేసి ఎపికి అన్యాయం జరుగుతోందంటూ దొంగ ఏడుపులు ఏడుస్తున్న టిడిపి అధినేత, ఆయన పార్టీ ఎమ్.పిల కథ కంచికి చేరేందుకు ఎంతో కాలం పట్టదని కూడా హెచ్చరించార్ యువనేత. 

హోదాకోసం రాజీలేని పోరాటం చేస్తామని ప్రజా సంకల్పంలో ప్రతిన పూనారు వైయస్ జగన్. మార్చి 1న రాష్ట్రంలోని అన్ని కలక్టరేట్ల ముట్టడి. మార్చి 5న జంతర్ మంతర్ వద్ద ధర్నా. మార్చి 5 నుంచి పార్లమెంటులో జరిగే నెలరోజుల బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్ సిపి ఎమ్.పిల ఆందోళన. కేంద్రం దిగిరాకుంటే ఏప్రిల్ 6న ఎంపిల రాజీనామా. ఇలా వరుస పోరాటాలతో హోదా కోసం ఎందాకైనా అని నినదిస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎన్నో ప్రత్యేకతలకు, ప్రజా చైతన్యానికి, స్వాభిమాన పోరాటానికి వేదికగా నిలిచింది. 

నెల్లూరు జిల్లాలో చివరగా జరిగిన మహిళలతో ఆత్మీయ సదస్సులో , టిడిపి ఎంపిలు కూడా రాజీనామా చేయాలన రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి పోరాటం చేద్దామంటూ చంద్రబాబుకు సవాల్ విసిరి ప్రత్యేక హోదాపై ఎవరితోనైనా కలిసి వెళ్లడానికి సిద్దమన్న పార్టీ  విధానాన్ని మరోసారి స్పష్టం చేశారు. జననేత.







 


 

Back to Top