చిలకలూరిపేట: కష్టాల్లో ఉన్న ఎవరికైనా మనోధైర్యాన్ని మించిన బలం లేదు. సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు శ్రీమతి షర్మిల. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరర రెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల బాణంలా దూసుకుపోతూ ప్రజలలో స్ఫూర్తి నింపుతున్నారు. చైతన్యాన్ని పాదుకొల్పుతున్నారు. వ్యధాభరిత జీవితాలను అతి దగ్గరగా పరిశీలిస్తున్నారు. మహానేత ఆశయాలను అన్న జగన్‌మోహన్‌రెడ్డి నుంచి అందిపుచ్చుకుని బాధాతప్త హృదయాల కోసం పరితపిస్తున్నారు. పేదల జీవితాలను స్పృశిస్తూ వందల కిలోమీటర్ల కొద్దీ నడక సాగిస్తున్నారు. బడుగుల బతుకుల బాగుకు అధ్యయనం చేస్తున్నారు. అహరహం శోధన దిశగా అడుగు లేస్తున్నారు.మట్టి మనుషులతో మమేకమవుతున్నారు. నేనున్నానంటూ మనోధైర్యాన్నిస్తున్నారు. అధికార కాంగ్రెస్ వైఖరినీ, దానితో వంతపాడుతున్న టీడీపీ అధినేత దమననీతిపైనా తన ప్రసంగాల్లో దునుమాడుతున్నారు. ప్రజాక్షేమం పట్టని పాలకుల కుమ్మక్కు రాజకీయాలనూ బట్టబయలు చేస్తున్నారు. స్థానిక సమస్యలను గుర్తిస్తున్నారు. ప్రజలను రాజకీయ చైతన్యం దిశగా నడిపిస్తున్నారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రానున్న స్వర్ణయుగానికి బాటలు వేస్తున్నారు.పాదయాత్ర గురువారం జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో కొనసాగింది. దారిపొడవునా షర్మిల ప్రజలతో మమేకమవుతూ మనోధైర్యాన్నిస్తూ ముందుకు సాగగా, ప్రజలు నీరాజనాలు పట్టారు. నరసరావుపేట నియోజకవర్గం జొన్నలగడ్డ గ్రామంలో ఏర్పాటు చేసిన మహానేత వైఎస్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. ఆ తరువాత ఎస్సీకాలనీలోకి వెళ్లిన శ్రీమతి షర్మిలకు మౌలిక సదుపాయాలు లేక పడుతున్న ఇబ్బందులను అక్కడి పేద ప్రజలు వివరించారు. తమ కాలనీలో చర్చి నిర్మించేందుకు సహకరించాలని కోరారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించడంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మహానేత తనయ రాక కోసం, తిరుమల ఇంజినీరింగ్ కళాశాల, అమర ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు గుంటూరు-కర్నూ లు రహదారిపై బారులు తీరారు.మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అక్కడికి చేరుకున్న శ్రీమతి షర్మిలతో కరచాలనం చేశారు. ఆటోగ్రాఫ్‌ల కోసం పోటీపడ్డారు. ఫీజు రీయింబర్సుమెంట్ సక్రమంగా అందకపోవడంతో కాలేజీ యాజమాన్యం నుంచి ఫీజులు చెల్లించాలని ఒత్తిడి వస్తుందని విద్యార్థులు శ్రీమతి షర్మిల వద్ద వాపోయారు. త్వరలో రాజన్న పాలన వస్తుందనీ, జగనన్న ముఖ్యమంత్రయిన తరువాత మీ సమస్యలు తీరతాయనీ ఆమె వారికి భరోసా ఇచ్చారు.చిలకలూరిపేట నియోజకవర్గంలో ఘన స్వాగతం..నరసరావుపేట నియోజకవర్గంలో పాదయాత్ర ముగించుకుని గురువారం మధ్యాహ్నానికి శ్రీమతి షర్మిల చిలకలూరిపేట నియోజకవర్గంలోకి ప్రవేశించారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఇతర సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో షర్మిల పాదయాత్ర కొనసాగింది. రోడ్లకు ఇరువైపులా మహిళలు, వృద్ధులు రాజన్న బిడ్డను చూసేందుకు బారులుతీరారు. గ్రామాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు, మహిళలు తరలివచ్చి షర్మిలతో కలసి నడిచారు. దీంతో గుంటూరు-కర్నూలు రాష్ట్రీయ రహదారి కిక్కిరిసిపోయింది. అడుగుతీసి అడుగువేయటం కష్టంగా మారింది.అక్కడ నుంచి బీసీ కమ్యూనిటీ హాలు వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించిన శ్రీమతి షర్మిల మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలవేశారు. రాష్ట్రీయ రహదారి నుంచి పాదయాత్ర చందవరంలోకి ప్రవేశించింది. తొలుత ఎస్సీకాలనీలో మహిళలు గుమ్మడికాయతో దిష్టితీసి యాత్ర దిగ్విజయం కావాలని షర్మిలకు ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ ఆరంభంలో డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసుకున్న వైయస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పంచాయతీ సమీపంలో ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ప్రజలనుద్దేశించి మాట్లాడారు.