మహానేత తనయకు అడుగడుగునా నీరా‘జనాలు’

ఇబ్రహీంపట్నం:

‘మరో ప్రజాప్రస్థానం’లో భాగంగా గురువారం షర్మిల పాదయాత్ర ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. మధ్యాహ్నం కొంగరకలాన్‌గేట్ సమీపంలోకి చేరిన పాదయాత్ర విరామం తర్వాత సాయంత్రానికి ఆదిభట్లకు చేరుకుంది. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి షర్మిలకు ఆత్మీయ స్వాగతం పలికారు. వేలాదిగా ఆమెతో కలిసి అడుగులో అడుగేశారు. అడుగడుగునా పూలవర్షం కురిపించారు. అదిగో షర్మిల అంటూ.. ఇళ్లపైకి ఎక్కి చూస్తూ సంబరపడ్డారు. రాజన్న బిడ్డను చూసి మురిసిపోయారు.

     బతుకమ్మ ఆటలు.. డప్పు వాయిద్యాలు.. కళాకారుల నృత్యాలు.. డాక్టర్ వైయస్ఆర్, శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పేర్లతో నినాదాలూ చేశారు. ఈ సందడితో యాత్ర ఆద్యంతం మార్మోగింది. ప్రజలకు శ్రీమతి షర్మిల అభివాదం చేశారు.  స్కూలు పిల్లలతో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. ‘రాజన్న రాజ్యంలో .. జగనన్న పాలనను అందించడానికి మీ బిడ్డనై వచ్చాను’ అంటూ షర్మిల అందరినీ పలకరించారు. ‘పేద ప్రజల ఆరాధ్యదైవం.. రైతాంగం బాగుంటే.. పల్లెలు బాగుపడతాయని తపిం చిన వైఎస్సార్ బిడ్డనై ఈ రోజు మీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని’ హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో రాజన్న రాజ్యం వస్తుందని.. అప్పుడు మన అందరి బతుకులు బాగుపడతాయని ఆమె భరోసా ఇచ్చారు.

సంఘీభావం...
     ‘మరో ప్రజాప్రస్థానం’లో భాగంగా షర్మిల గురువారం సాయంత్రం ఆదిభట్లకు చేరుకున్నారు. మేడ్చల్ నియోజకవర్గ నేత సింగిరెడ్డి హరివర్దన్‌రెడ్డి నాయకత్వంలో నియో జకవర్గం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివ చ్చారు. షర్మిలకు ఎదురేగి స్వాగతం పలికారు. ఆమెను కలిసి సంఘీభావం ప్రకటించారు.

తాజా ఫోటోలు

Back to Top