భోగాపురంలో భూదందా..!

బలవంతపు భూసేకరణపై భగ్గుమన్న స్థానికులు..!
భూముల్లో పాతిన రాళ్లు పీకేసి నిరసన...!

విజయనగరంః పచ్చనేతల ఆగడాలకు హద్దులు లేకుండా పోతుంది. భూదాహంతో చంద్రబాబు రెచ్చిపోతున్నారు. ఎయిర్ పోర్టుకు భూమిలివ్వమని రైతులు చెబుతున్నా నెత్తికెక్కడం లేదు. వేలాది ఎకరాలను కొట్టేసేందుకు నయాదందా కొనసాగిస్తున్నారు. బలవంతంగా భూములు లాక్కుంటూ అరాచకం సృష్టిస్తున్నారు.  
 
సర్వే పేరుతో ల్యాండ్ మాఫియా..!
భోగాపురం ఎయిర్ పోర్టు పేరుతో విజయనగరం జిల్లాలో పచ్చప్రభుత్వం భయానక వాతావరణం సృష్టిస్తోంది. భూములు లాక్కోవడాన్ని అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మొండి పట్టుదల వీడడం లేదు. విమానాశ్రయ ప్రభావిత గ్రామాల్లో సర్వేల పేరుతో ల్యాండ్ మాఫియాకు పాల్పడుతోంది. చంద్రబాబు చేస్తున్న భూదందాపై స్థానికులు భగ్గుమంటున్నారు. కొంగవానిపాలెం, దిబ్బలపాలెం ప్రాంతాలు, తూడెం గ్రామంలోని జిరాయితీ భూముల్లో పచ్చనేతలు పాతించిన రాళ్లను రైతులు, మహిళలు పీకేశారు. 

బెదిరింపులకు భయపడబోం..!
తమ పొట్టగొట్టాలని చూస్తే ఊరుకోబోంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. సర్కార్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు కొంతమంది రైతులను అరెస్ట్ చేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారులెవరూ తమ గ్రామాల్లోకి రాబోమని చెప్పేంతవరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదంటూ  రైతులు పోలీస్ స్టేషన్ ఎదుట భీష్మించారు. ఆందోళన చేస్తే అరెస్ట్ లు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడడంపై మండిపడుతున్నారు.  సర్కార్ కుట్రలకు తాము భయపడేదే లేదని భూములను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోమన్నారు.
Back to Top