జేఎఫ్‌ఎఫ్‌సీ వెనుక చంద్రబాబు..?

– ప్రత్యేక హోదాను దారి మళ్లించేందుకే
– కమిటీపై ప్రజల్లో అనుమానాలు 
– కాలయాపన చేసి లబ్ధిపొందే ఆలోచనలో టీడీపీ


ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేసి తరువాతి అంకానికి తీసుకెళ్లాల్సిన సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ చంద్రబాబు, టీడీపీ నాయకులు కొత్త పల్లవి అందుకున్నారు. ప్రత్యేక హోదాని ప్రకాశం బ్యారేజీలో నిమజ్జనం చేయడానికి పథక రచన చేస్తున్నారు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందంటూ నిరసన గళం వినిపించారు. ఒక టీడీపీ నాయకులు బీజేపీని విమర్శిస్తుంటే.. మరోవైపు చంద్రబాబు మిత్ర ధర్మం పాటించమంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంటాడు. అన్యాయంపై గళమెత్తుతామని చెబుతూనే.. ఎలాంటి న్యాయం కావాలో మాత్రం చెప్పరు. నాలుగేళ్లుగా ఏసీల్లో చొక్కా మడతలు నలగకుండా తిరిగిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గొంతు సవరించుకుంటున్నారు. అయితే ప్రత్యేక హోదా నినాదం ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన నేపథ్యంలో.. చంద్రబాబు మరో ఎత్తుగడకు తెరదీశారు. 
చంద్రబాబు కనుసన్నలో జేఎఫ్‌ఎఫ్‌సీ ..!
ప్రత్యేకహోదా ఉద్యమం ఉధృతమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు కనుసన్నల్లో పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలో జేఎఫ్‌ఎఫ్‌సీ ఏర్పాటు చేశార నే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. జాయింట్‌ ఫాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ పేరుతో హోదా ఉద్యమాన్ని వాయిదా వేయించి కాలయాపన చేసేందుకు చంద్రబాబు నేతృత్వంలో ప్రణాళిక రచించినట్లు ఆంధ్రాలో చర్చ జరుగుతోంది. తనకు అత్యంత ఇష్టుడైన వపన్‌ కల్యాణ్‌ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తే మంచి బాధ్యతలు ఆయనకే కట్టబెట్టారు. అయితే ఇక్కడే ప్రజలకు చాలా అనుమానాలు తలెత్తాయి. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు సహకరించి పక్కనుండి ఓట్లేయించిన చంద్రబాబు.. ఇప్పటికీ పలు సందర్భాల్లో ప్రశ్నిస్తానని చెప్పి.. మూగబోయారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను వెనకేసుకొస్తూ తాళం వేయడం జనం చూస్తూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ మరోసారి జేఎఫ్‌సీ ముసుగేసుకొచ్చి చంద్రబాబుకును కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. 

బాధ్యులు ఎవరు..? బాధ్యత ఎవరిది..?
రాష్ట్రానికి అన్యాయం జరిగి ఉంటే ఎవరు చర్చించాలి.. ఎక్కడ చర్చించాలి.. ఎవరితో చర్చించాలి.. ఎవరికి ఎవరు సమాధానం చెప్పాలి. బాధ్యులెవరు.. బాధ్యత ఎవరిది.. జేఎఫ్‌సీకి ఎందుకు సమాధానం చెప్పాలి. దేశాన్ని పరిపాలిస్తున్న ఒక జాతీయ పార్టీ బీజేపీ.. దాదాపు మూడున్నర దశాబ్దాల చరిత్ర గలిగి రాష్ట్రాన్ని పాలించిన టీడీపీలు ఏం అర్హత ఉందని జనసేన అధినేతకు లెక్కలు చెప్పాలని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. పైగా జనసేన పార్టీ స్థాపించి నాలుగేళ్లు దాటినా ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. పైగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ 2014లో టీడీపీకి సహకరించారు. ఇప్పటికీ ఆయనమీద నమ్మకం ఉందని పలుమార్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చంద్రబాబు పక్షమే వహిస్తారు.. ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నిస్తారే తప్ప తటస్థంగా ఎలా వ్యవహరిస్తారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Back to Top