శిల్పా గెలుపును ఆప‌డం అసాధ్యం

- అన్నీ మంచి శ‌కునాలే
- వైయ‌స్ జ‌గ‌న్ ప్రచారంతో కేడ‌ర్‌లో మ‌రింత ఊపు
- వైయస్సార్సీపీకి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు 

వైయస్ ఆర్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్  ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నంద్యాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.  తెలుగుదేశం పార్టీ కుట్రలను ఎదుర్కోవడానికి..న్యాయం, ధర్మం వైపు నిలబడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు.  బుధవారం నుంచి దాదాపు ప్ర‌చారం ముగిసే వ‌ర‌కు అక్క‌డే వుండి దాదాపు వీధివిధినీ చుట్టిరానున్నారు. అడ్డ‌గోలు హామీలు, బెదిరింపులు, అధికారం అడ్డం పెట్టుకుని అస‌త్య హామీలతో ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్న టీడీపీ ప్ర‌భుత్వానికి నంద్యాల ఎన్నిక‌ల్లో ఓడించి చావుదెబ్బ కొట్టాల‌ని వైయస్ జ‌గ‌న్ స్వ‌యంగా తానే రంగంలోకి దిగారు. మూడేళ్లుగా గుర్తుకురాని అభివృద్ధిని అర‌చేతిలో చూపిస్తూ ఓట్ల జ‌పం చేస్తున్న ప‌చ్చ దొర‌ల‌కు నంద్యాల నుంచే గుణ‌పాఠం చెప్పాల‌ని జ‌గ‌న్ యోచిస్తున్నారు. ప్ర‌భుత్వ ప‌నితీరుకు రెఫ‌రండంగా భావిస్తున్న నంద్యాల ఎన్నిక‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. 

ఇప్ప‌టికే టీడీపీ ప్ర‌భుత్వం మంత్రులంద‌ర్నీ నంద్యాల‌లోనే మోహ‌రించి నెల రోజులుగా హంగూ ఆర్భాటాల‌తో హడావుడి మొద‌లు పెట్టింది. చేతిలో అధికారం కూడా ఉండ‌టంతో అది చేస్తాం.. ఇది చేస్తామంటూ మాయ‌మాట‌ల‌తో పైపై మెరుగులద్ది ఓట్లు దండుకునే కుట్ర‌కు తెర‌లేపింది. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌కు వ‌చ్చిన స్పంద‌న చూసిన తెలుగు దేశం నాయ‌కులు ఇప్ప‌టికే డిఫెన్సులో ప‌డిపోయారు. మొన్న‌మొన్న‌టి వ‌రకు 50 వేల త‌క్కువ మెజారిటీని ఊహించ‌లేమ‌ని కూసిన వారు ఇప్ప‌టికప్పుడు ఎలాగోలా బ‌య‌ట‌ప‌డితే చాల‌ని అంటున్నారంటేనే తెలుస్తుంది జగ‌న్ బ‌హిరంగ‌స‌భ‌తో నంద్యాల్లో క‌నిపించిన మార్పు. ఇప్ప‌టికే రెండు సార్లు ప్ర‌చారం నిర్వహించి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో జ‌నంతో ఛీవాట్లు తిన్న చంద్ర‌బాబు నంద్యాలకు రావాలంటేనే జంకుతున్నారు. 

అభివృద్ధి జపంతో హ‌డావుడి చేస్తున్న టీడీపీని ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు బ‌హిరంగ స‌భ‌లో అడిగిన మాట‌లు నంద్యాల ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఆలోచ‌న‌లో ప‌డేశాయి. వైయ‌స్ఆర్ సీపీ పోటీ చేయ‌కుండా ఏక‌గ్రీవానికి ఒప్పుకుని ఉంటే నంద్యాల్లో ఈ మాత్రం అభివృద్ధి క‌నిపించేదా అని చెప్పిన మాట‌లు తీవ్ర ప్ర‌భావం చూపిస్తున్నాయి. పైగా ఇటీవ‌ల బ‌య‌టకొచ్చిన ఒక వీడియో చంద్ర‌బాబును తీవ్ర ఇర‌కాటంలో ప‌డేసింది. నంద్యాల ప్ర‌జ‌ల అవ‌స‌రాలంటూ స్థానిక స‌మస్య‌ల‌ను ప్రస్తావిస్తూ బ‌హిరంగ స‌భ‌లో శిల్పా మోహ‌న్‌రెడ్డి అడిగిన హామీల‌పై డ‌బ్బులెక్క‌డున్నాయంటూ చంద్ర‌బాబు అన్న మాట‌ల‌ను ప్ర‌జ‌లు తీవ్రంగానే ప‌రిగ‌ణిస్తున్నారు. ఎన్నిక‌లంటూ రాక‌పోయుంటే..వైయ‌స్ఆర్‌సీపీ పోటీ చేయ‌క‌పోయుంటే చంద్ర‌బాబు మ‌న‌ల్ని ప‌ట్టించుకునేవాడా అని చ‌ర్చించుకుంటున్నారు. వీట‌న్నింటితోపాటు ఇటీవ‌ల పార్టీలో చేరిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి రావ‌డంపైనా జ‌నాలు వైయ‌స్ఆర్‌సీపీ విలువలు.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి విశ్వసనీయతను ప్రశంసిస్తున్నారు.  అదే స‌మ‌యంలో ఫ్యాను గుర్తుమీద గెలిచిన వారిని పార్టీలో చేర్చుకుని రాజీనామా చేయించకుండా టైంపాస్ చేసిన చంద్ర‌బాబుకు నంద్యాల్లో గ‌ట్టి షాకివ్వాల‌ని డిసైడ్ అయ్యారు. 

ఏ నంద్యాల నుంచైతే పార్టీ ఫిరాయింపులు మొద‌లయ్యాయో అదే నంద్యాల నుంచి గెలిచి చంద్ర‌బాబుకు స్వీట్ వార్నింగ్ ఇచ్చేందుకు రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న జ‌గ‌న్ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు వీలు దొరికిన‌ప్ప‌డల్లా నంద్యాల‌కొచ్చి త‌మ వంతుగా ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. పార్టీ  నాయ‌కులు ప్ర‌చారానికి తోడు వైయ‌స్ఆర్‌సీపీ గెలుపును కోరుకుంటూ స్వ‌చ్ఛందంగా త‌ర‌లివ‌స్తున్నఅభిమానులతో లోక‌ల్‌గా స‌రికొత్త ఉత్సాహం క‌నిపిస్తుంది. అన్నింటికీ మించి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, పార్టీ అధినేత కూడా నంద్యాల విష‌యంలో చాలా వ్యూహాత్మ‌కంగా దూసుకెళ్తున్నాడ‌ని విశ్లేష‌కులు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే నంద్యాల ఎన్నిక‌ల్లో కుట్ర‌ల ద్వారా విజ‌యం సాధించాల‌ని ప‌గ‌టి క‌ల‌లు కంటున్న టీడీపీకి షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. అక్ర‌మంగా చేర్చిన ఓట్ల‌ను ప‌రిగ‌ణించ‌బోమ‌ని ఈసీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించ‌గా తాజాగా నంద్యాల ఎన్నిక‌ల‌ను ప్ర‌శాంతంగా నిర్వ‌హించేందుకు కేంద్ర పారా మిలిట‌రీ బృందాలు రానుండ‌టం కూడా శుభ పరిణామం. నంద్యాలలో వైయస్సార్సీపీదే పై చేయి అని ప్రతీ ఒక్కరూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  వైయ‌స్ జ‌గ‌న్ కూడా ప్ర‌చారంలో ఉండ‌టంతో శిల్పా గెలుపును ఆప‌డం సాధ్యం అయ్యే ప‌రిస్థితులైతే క‌నిపించ‌డంలేదు. 
Back to Top