పంట వేయొద్దు అంటే తాట తీస్తాం


సాగు చేయవద్దనడానికి మీరెవరు?
చంద్రబాబుపై మండిపడుతున్న రైతులు
ప్రభుత్వ నిర్ణయాలను ఎండగడుతూ నేటి నుంచి జగన్ దీక్ష
రైతులకు బాసటగా నిలిచేందుకే తణుకు వస్తున్నారు
పచ్చని పొలాల్లో చిచ్చు పెట్టిన వారిని నిలదీస్తారు


హైదరాబాద్: ‘‘ఏరు దాటగానే తెప్ప తగలేశాడట’’ వెనకటికి ఒకడు.. ఈ సామెత చంద్రబాబు వ్యక్తిత్వానికి చక్కగా సరిపోతుంది. ఆచరణకు వీలుగాని హామీలతో గద్దెనెక్కి ప్రజల జీవనాధారాలను దెబ్బతీసి ఓట్లేసి గెలిపించిన వారి పొట్టకొట్టాలని చూస్తున్నాడు.. ముఖ్యమంత్రి చంద్రబాబు. రుణమాఫీ పేరిట రైతులు, వారి కుటుంబాలతో ఓట్లు వేయించుకున్నాడు.. డ్వాక్రా రుణాల రద్దంటూ మహిళ ఓటర్లకు ఆశ పెట్టాడు.. ఉద్యోగాల పేరిట యువతకు గాలం వేశాడు.. అధికారంలోకి వచ్చాక.. అందలం ఎక్కించిన వారందరిని తొక్కే పని మొదలు పెట్టాడు.. ఆయన మాత్రం ప్రత్యేక విమానాల్లో విదేశాలకు తిరుగుతున్నాడు.. డ్వాక్రా మహిళలను రుణాలు కట్టకన్నాడు.. సొంత కంపెనీకీ కోట్ల ప్రజధనాన్ని కాంట్రాక్టుల రూపంలో అధిక ధరలకు కట్టబెట్టాడు. కాంట్రాక్టు ఉద్యోగులను పీకిపారేస్తూ.. ‘‘బాబు వస్తే జాబులు పోతాయ్.’’.! అన్న పూర్వస్థితిని గుర్తు చేస్తున్నాడు.. రుణమాఫీని అమలు చేయమంటే.. రాజధాని పేరిట వారి జీవనాధారాన్నే లాక్కునే పనిలో పడ్డాడు. ఇప్పుడు ఏకంగా రైతులను రాజధాని ప్రతిపాదిత ప్రాంతాల్లో పొలాలు సాగు చేయవద్దంటూ అధికారులతో ప్రకటనలు ఇప్పించి రైతుల పట్ల ఆయనకున్న కఠిన మనస్సును మరోసారి చాటుకున్నాడు.

రుణమాఫీకి ఇన్ని షరతులా?

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఒకేసారి లక్షన్నర వరకు రుణ మాఫీ చేస్తామని చెబుతూనే... అక్కడి రైతులకు కూడా రుణ మాఫీలో పెట్టిన మెలికలన్నీ, షరతులన్నీ వర్తిస్తాయని చెప్పడం విడ్డూరం. అక్కడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుంది.. ఆధార్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు ఉండాలి. అవన్నీ ఉంటేనే.. స్కేల్ ఫైనాన్స్ ప్రకారం లక్షన్నర రుణం ఉంటే.. పది వేలో, ఇరవై వేలో రుణం మాఫీ అవుతుంది. మిగిలింది రైతులు కట్టుకోవాల్సిందే. రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన వారికి ఏదో మేలు చేస్తున్నానని పైకి చెబుతూ.. వారినీ నిబంధనల ఉచ్చులో ఉంచటం అంటే అంతకంటే నీచం మరొకటి ఉండదు.

జరీబు పంటకు ఎకరాకు రూ.10 వేలేనా?
వాస్తవానికి రాజధాని ప్రాంతంలో ఇప్పటివరకు 7000 ఎకరాల భూమి సేకరించామని చెబుతున్నారు. అంటే సుమారుగా 7 వేల మంది రైతులు. 34 వేల ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్‌లో సేకరిస్తుంటే- వాటిలో ఎక్కువగా ఉంది జరీబు భూములే. అంటే ఆ భూముల్లో పండించేది ఉద్యానవన పంటలు. ఉద్యాన వన పంటలకు రుణ మాఫీ లేదు అని చంద్రబాబే చెప్పాడు. వాటికి ముష్టి వేసినట్టు ఎకరాకు పది వేలు మాత్రమే ఇస్తానని చెప్పాడు. అవీ ఇంతవరకు ఇవ్వలేదు. అంటే చంద్రబాబు నాయుడు రాజధానికి భూములు ఇచ్చే రైతాంగానికి లక్షన్నర వరకు మాఫీ చేస్తున్నట్టు పైకి చెబుతూ.. చివరికి వారికి ఎకరాకు ఇస్తున్నది పది వేలు మాత్రమే.  రాజధాని ప్రాంతంలో డ్వాక్రా సంఘాలకు ఒక్క రూపాయి కూడా రుణ మాఫీ కాలేదు. అందరికంటే ఎక్కువగా ఈరోజు రాజధాని ప్రాంతంలో రైతులకు మరింత అన్యాయం జరుగుతోంది. తాజాగా సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ రాజధాని ప్రతిపాదిత ప్రాంతాల్లో ఇదే చివరి సాగు అని ప్రకటించి పచ్చని పొలాల్లో చిచ్చు రేపాడు. చంద్రబాబు నాయుడు, సీఆర్‌డీఏ కమిషనర్ తీరుపై రైతులు మండిపడుతున్నారు. వారు ప్రభుత్వానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు.. వాటికి సమధానాలు చెప్పి తీరాలని డిమాండ్ చేస్తున్నారు.

వారు ఏం అడుగుతున్నారంటే..?
1. రాజధాని ప్రాంత భూముల్లో పంటలు వేయటానికి వీల్లేదని- సీఆర్‌డీఏ కమిషన్ శ్రీకాంత్ చెబుతున్నాడు- అంటే ఎంత కండ కావరం? రైతులంటే తమ కింద పనివారు అనుకుంటున్నారా? వీరు ఏం చెబితే అది చేయటానికి?
2. సీఆర్‌డీఏ కమిషనర్ స్థాయి మరిచి, రైతుల గౌరవాన్ని తగ్గించి మాట్లాడుతున్నట్లుంది..! రాష్ట్రపతి కూడా ఇటువంటి ప్రకటనలు చేయరే.
3. రైతులు తమ భూముల్లో పంటను వేయొద్దని చెప్పే అధికారం ఈ శ్రీకాంత్‌కు ఎవరిచ్చారు? ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
4.పంటలు వేయొద్దని.. కృష్ణా డెల్టాలో రెండో పంటకు నీరు ఇచ్చేది లేదని, విద్యుత్ చౌర్యానికి పాల్పడితే మరో దేశంలో అయితే ఏకంగా ఉరి తీసేవారని చెప్పిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడుది కాదా?
5.  మళ్ళీ అదే కృష్ణా డెల్టాలో.. అదే కృష్ణమ్మ సాక్షిగా.. అదే దుర్గమ్మ తల్లి చూస్తుండగా చంద్రబాబు నాయుడు అవే మాటలు మాట్లాడుతున్నాడు. పంటలు వేయొద్దని రైతులను హెచ్చరిస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుకి,  సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌కు ఈ అధికారం ఎవరు కల్పించారు? నీ హామీలు నమ్మి ఓట్లేసిన మేమే కదా..!
6. ఇది మా పొలం, మా ఆస్తి.. తరతరాలుగా దక్కిన సంపద. అటువంటి భూమిలో పంటలు వేయొద్దనటానికి నీవెవడివి? కమిషనర్‌కు ఎవరిచ్చారు ఆ అధికారం?
7. మీ హెరిటేజ్‌లో పాల వ్యాపారం చేయవద్దని అంటేనో..  మీ హెరిటేజ్ షాపుల్ని మూసివేయాలంటేనో నీవు ఊరుకుంటావా చంద్రబాబూ? రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో నీ అనుచరులతో గగ్గోలు పెట్టిస్తావ్ గదా? మా జీవనాధారం మీద దెబ్బకొడుతుంటే రైతులమైన మేం నోరు మెదపకూడదా? రైతులడిగే ఈ సూటి ప్రశ్నకు సమాధానం చెప్పగలవా?
 8. ఒక్క కొడుకు ఉన్న నీకే నీ కంపెనీ మీద అంత ప్రేమ ఉంటే- ఇక్కడ ఉన్న మేమంతా రైతులం, పేదలం. మట్టిని నమ్ముకుని బతుకుతున్న వాళ్లం. మా భూములపై మాకెంత అధికారం ఉండాలి?
 9. నీకు మా(రైతుల) భూమి అన్నది వ్యాపారం కావొచ్చు- రైతులకు ఆ భూమి అన్నది ప్రాణం. భూమే మాకు పంచ ప్రాణాలు. ఆరో ప్రాణం కూడా. పైరును నమ్ముకున్న  రైతులం మేము. నీ లాగా పరులను అమ్ముకోవాలనుకోవటం లేదు. నీ ఆస్తి రాసిమ్మని అడగలేదు.

అటువంటి భూమిలో ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చినవారే కాదు.. ఇవ్వని వారు కూడా పంటలు వేయొద్దంటావా?   
భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నావ్.. ఫండమెంటల్ రైట్స్‌ను అవమానిస్తావా? ఔరంగజేబు లాంటి వాడికి కూడా ఇటువంటి శాసనం చేసిన చరిత్ర లేదే?
రాజ్యాంగంతో సంబంధం లేకుండా ఒక ఫ్యాక్షనిస్టులాగా..   ప్రజల్ని భయపెట్టే పని చేస్తావా చంద్రబాబూ?

ఎవడా శ్రీకాంత్?
ఎక్కడిది అతనికి ఈ అధికారం?
చంద్రబాబు చెబితే ఇష్టమొచ్చినట్లు ప్రకనలు ఇస్తారా?
రైతుల జీవితాలతో ఆడుకోవటానికి ప్రయత్నం చేస్తే.. చూస్తూ ఊరుకుంటామా?
రైతులు ఆర్గనైజింగ్‌గా లేరని.. రైతు పంట వేయకూడదని శాసనం చేస్తే.. అదికూడా జీవో ఇవ్వకుండా.. మౌఖికంగా చెప్పి రైతుల్ని బెదిరించటం తప్పు కాదా?
ఇలా చేస్తే.. ఇకమీదట పుట్టేది ఉద్యమాలు కాదు.. భూమి కోసం రైతు విప్లవాలు పుడతాయి.

పంట వేయొద్దు అంటే తాట తీస్తాం.
చట్టబద్ధంగా తాట తీస్తాం.
రైతులకు ఇంత ద్రోహం చేసినటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో ఇంకెవరైనా ఉన్నాడా?
Back to Top