దర్యాప్తు తీరు ఇదేనా??

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడితే కనీసం 3 కేసులు రాస్తున్నారు. ట్రాఫిక్ వయలేషన్ లో 4 కేసులు బుక్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టినవారిపై 9 రకాల సెక్షన్ లలో కేసులు పుటప్ చేస్తున్నారు. మరి ఎపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యా యత్నం కేసులో నిందితుడిపై కేవలం ఒకే ఒక్క కేసు ఫైల్ చేయడంలో ఉద్దేశ్యం ఏమిటి?
కేవలం ఒకే కోణంలో దర్యాప్తు
ఎపి పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఎంతో కాలంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తూనే ఉన్నాయి. కానీ పోలీస్ శాఖ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ వస్తోంది. కానీ వైఎస్ జగన్ పై హత్యాయత్నం ఉదంతంలో పోలీసుల వైఖరి ప్రజలకే స్పష్టంగా కనిపించింది. పోలీస్ అదికారులు, ప్రభుత్వం కలిసికట్టుగా హత్యాయత్నం కేసును నీరుగార్చడానికి ఎంతగా శ్రమిస్తున్నారో కళ్లముందు కకనబడుతూనే ఉంది. చిన్నపాటి నేరాలకు కూడా పెద్ద పెద్ద సెక్షన్లను వాడే పోలీస్ శాఖ, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిపై హత్యకు తెగబడ్డ నిందితుడిపై కేవలం ఒకే ఒక్క కేసును ఫైల్ చేసారు. నేరపూరిత సంఘటనలు జరిగినప్పుడు దానికి కారణాలను, వెనకున్న మూలాలను తెలుసుకునేందుకు అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఆ సమయంలో మీడియా లేదా ప్రజలకు విచారణ తర్వాతే వాస్తవాలను చెబుతామని ప్రకటిస్తారు. కానీ జగన్ పై దాడి జరిగిన ఫాక్షన్ ఆఫ్ సెంకడ్స్ లో ఎటువంటి దర్యాప్తూ లేకుండానే పోలీసులు కేసును తేల్చిపారేసారు. కేవలం నిందితుడి వాంగ్మూలం ఆధారంగా ఇది ప్రచారం కోసం జరిగిన చర్య అని కొట్టిపడేసే ప్రయత్నం చేసారు. ఓ శాసన సభ్యుడిపై, మాజీ పార్లమెంటేరియన్ పై, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతపై జరిగిన అమానుషమైన దాడిని  పూర్వాపరాలు విచారించకుండానే, గాయపడ్డ జగన్ ఎయర్పోర్ట్ లో ఉండగానే తమ దర్యాప్తు పూర్తైపోయినట్టుగా స్టేట్మెంట్లు ఇచ్చేసారు. 
ఎన్నో ప్రశ్నలు
ఈ హత్యయత్నం వ్యవహారాన్ని పోలీసులు అంత తేలికగా తీసుకుంటున్నారా? లేక నిందితుడిపై వివిధ అనుమానాలు ఉన్న నేపథ్యంలో అతడిపై కేసులు పెట్టకూడదని పోలీస్ అధికారులకు ఎవరైనా చెప్పారా? కీలకమైన ఆధారంగా కనిపించే క్యాంటీన్ యజమాని హర్షవర్థన్ ను ఎందుకు ప్రశ్నించడం లేదు? కమీషనర్ మహేంద్ర లడ్డా హర్షవర్థన్ ను పిలిచి విచారించిన తర్వాత ఆయన్ను ఈ కేసు ఇన్విస్టిగేషన్ కు దూరంగా ఎందుకుంచారు? ఏ ఆధారాలను ఆయన కూపీ లాగుతున్నాడని విచారణలో కమీషనర్ ను లేకుండా చేసారు? ఓ పక్క సిట్ విచారణ జరుగుతున్న కేసులో కమీషనర్ ను ఎందుకు తప్పించారు? ఇవన్నీ వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం వెనుక దాగున్న భారీ కుట్రకు సంకేతాలు. 
దాడి వెనుక రహస్య కుట్ర
ప్రతిపక్ష నాయకుడిపై హత్యా ప్రయత్నం జరిగింది విశాఖపట్నం విమానాశ్రయంలో. కట్టుదిట్టమైన భద్రత ఉండే చోట కత్తికి చోటెక్కడిదన్న మాటకు సమాధానం లేదు. నిందితుడు శ్రీనివాస్ ప్రచారం కోసమే జగన్ పై దాడి చేసాడని సంఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే డిజిపి ఠాకూర్ తేల్చేయడం హాస్యాస్పదం. మరి కొద్ది నిమిషాలకే హోంమంత్రి చినరాజప్ప దీనివెనకున్నఏ రాజకీయ పార్టీవారున్నారో గంటలో తేల్చేస్తామని వాఖ్యానించారు. జరిగిన దారుణమైన సంఘటనను మరుగు పరచి దాన్ని రాజకీయం చేయడం, హత్యాయత్నాన్ని చిన్నపాటి కేసులా పరిగిణించడం వెనుక రహస్యంగా సాగుతున్న కుట్ర ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 

 
Back to Top