అందరి చూపూ వైయస్ఆర్ కాంగ్రెస్ వైపు..

రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి మద్దతు పలుకుతున్నారు. ఆయన నాయకత్వంలోనే రాజన్న రాజ్యం సాధ్యమని స్పష్టంచేస్తున్నారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలే కాక ప్రజలు కూడా పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. పార్టీ స్థానికి నాయకత్వాల ఆధ్వర్యంలో చేపడుతున్న గడగడపకూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేరికలకు వేదికవుతోంది.
సత్తెనపల్లి:

పట్టణ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు మంగళవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పాల్గొన్నారు. కాంగ్రెస్, టీడీపీలనుంచి ఎమ్మెల్యేలు సైతం రాజీనామా చేసి తమ పార్టీలో చేరుతున్నారని అంబటి ఈ సందర్భంగా చెప్పారు. ఎంతో మంది పార్టీలో చేరేందుకు జగన్మోహన్‌ రెడ్డిని జైలులో కలుస్తున్నారన్నారు. ఆ విషయాన్ని ఒప్పుకుంటే తమ కేడర్ పూర్తిగా జారిపోతుందనే ఉద్దేశంతోనే ఆయా పార్టీలు అంగీకరించలేకపోతున్నాయన్నారు. 1983లో ఎన్టీఆర్ రాకతో యోధానుయోధులే ఓటమి పాలయ్యారని, 2014లో మళ్లీ అలాంటి ఎన్నికలు మనమంతా చూడబోతున్నామని చెప్పారు. చిత్తూరులో కిరణ్‌కుమార్‌రెడ్డి, కుప్పంలో చంద్రబాబు ఓడిపోకపోతే ఇదేమిటని తనను ప్రశ్నించండంటూ అంబటి సవాల్ విసిరారు. అక్రమ అరెస్టులు, వేధింపులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని అంబటి స్పష్టం చేశారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు కుమ్మక్కై జగన్‌పై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టించారని ఆరోపించారు. రాజకీయాలకు అతీతమైన భావాలు కలిగిన ప్రజలు ఆయనకు అండగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో ముందుగా డాక్టర్ వైయస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఒకటవ వార్డుకు చెందిన రమణరాయ్, సుగుణకుమారీలతోపాటు వారి అనుయాయులు 60 మంది అంబటి సమక్షంలో పార్టీలో చేరారు.

కదిరిలో..


కదిరి: కదిరి మున్సిపాలిటీ 24వ వార్డులో 200 మంది ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక పార్టీ నాయకులు హఫీజ్ సనావుల్లా ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో వీరు పార్టీలో చేరారు.  ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ, రాప్తాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోపుదుర్తి  ప్రకాశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పుట్టపర్తి నియోజకవర్గ నాయకుడు డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి, కదిరి నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్‌చార్జ్ డాక్టర్ నాగేంద్రకుమార్‌రెడ్డి, నాయకుడు ఎస్‌ఎండీ ఇస్మాయిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వలీసాబ్ రోడ్డులో పలుచోట్ల పార్టీ జెండాలను నాయకులు ఆవిష్కరించారు. పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను ఇంటింటా పంచారు.

అనంతరం పట్టణ కన్వీనర్ చాంద్‌బాషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ వార్డు ప్రజలతో పాటు వడ్డెర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి సైదాపురం రమణ, నవ సమాజ్ ఫెడరేషన్ (ఎన్‌ఎస్‌ఎఫ్) జిల్లా కార్యదర్శి పదవికి ఇటీవల రాజీనామా చేసిన వీ.రాఘవేంద్ర, తమ అనుచరులతో వైఎస్సార్ సీపీలో చేరారు. వారందరికీ నేతలు కండువాలు వేసి ఆహ్వానించారు. జగన్ సీఎం కాగానే కదిరి నియోజకవర్గంలోని ప్రతి చెరువును నీటితో నింపుతామని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చెప్పారు.

గొల్లప్రోలులో..

గొల్లప్రోలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహానేత కాలంనాటి స్వర్ణయుగాన్ని తిరిగి తీసుకువస్తారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు చెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వంపై పోరాడేందుకు చేపట్టిన పోరుబాట కార్యక్రమాన్ని మండలంలోని తాటిపర్తి గ్రామంలో మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను పార్టీ నాయకులు చలమలశెట్టి సునీల్ తో కలసి దొరబాబు ఆవిష్కరించారు. స్థానిక నాయకులు సామినిడ్డి శ్రీనివాసరావు, గారపాటి బుజ్జి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌కి చెందిన 200 మంది పార్టీలో చేరారు. సునీల్, దొరబాబు వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.  డాక్టర్ వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేపథకాల సక్రమ అమలు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు.

Back to Top