చంద్రబాబు చేసిన టాప్ పది తప్పులు..


విశాఖపట్నం) తప్పులు చేయటం చంద్రబాబు జన్మహక్కు. విశాఖపట్నంలో పర్యటించి హుద్ హుద్ తుపాన్ వచ్చి ఏడాది అయిన సందర్బంగా ర్యాలీలు ప్రదర్శనలు చేసి వచ్చారు. సమగ్రమైన సహాయ చర్యలు ఏమీ చేయకుండానే ఈ విధంగా గొప్పలు చెప్పుకోవటం, జబ్బలు చరచుకోవటం ఎంత వరకు కరెక్ట్..

1. హుద్ హుద్ తుపాన్ తో జరిగిన నష్టం విలువ 20 వేల కోట్ల పైమాటే అని ప్రభుత్వమే లెక్కలు వేసింది. ఏ స్థాియిలో సాయం అందింది అనేది ఇప్పటికీ నిర్ధారించలేదు.
2. రూ. 18 వందల కోట్ల తో సహాయ చర్యలు చేపడుతున్నట్లు చంద్రబాబు ఘనంగా చెప్పుకొన్నారు. కానీ ఎక్కడ 20వేల కోట్లు..ఎక్కడ రూ. 18 వందల కోట్లు. అంటే పదో వంతు కూడా కాదన్నమాట.
3. నాలుగున్నర లక్షల ఇళ్లు ధ్వంసం అయినట్లు గుర్తించారు. కనీసం 4వేల ఇళ్లు అయినా కట్టించారా అంటే జవాబు దొరకదు.
4.  మోడల్ కాలనీలు కట్టిస్తామని చాలాసార్లు ప్రచారం చేసుకొన్నారు. కానీ విశాఖలో బూతద్దం పెట్టి చూసినా అది కనిపించదు. కనీసం డిజైన్ కూడా సిద్దం చేయలేదు. 
5. మత్స్యకారులకు చాలా సాయం చేస్తామన్నారు. హామీలు భద్రంగా నీటి మీద రాతలు మాదిరిగా ఉన్నాయి.

6. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. సమగ్రంగా పరిహారం కానీ, కనీసం ఇన్ పుట్ సబ్సిడీ కానీ అందలేదు.
7. చేతి వ్రత్తులు చేసుకొనే వారు, వీధి వ్యాపారుల నష్టం గురించి ఊసెత్తరు
8. చిన్న పరిశ్రమలు చితికిపోయాయి. వీటికి బీమా ఉంటే ఓకే, లేని వారిని ఆదుకొనే ప్రయత్నం జరగలేదు.
9. రెండు పర్యాటక కేంద్రాల్ని బాగు చేయించి, దానికి నగరమంతా బాగు చేశాం అనుకోవటం ఎంత వరకు కరెక్ట్
10. దాతల నుంచి తెచ్చిన 260 కోట్ల విరాళాలు ఎక్కడెక్కడ ఖర్చు చేశారు అనేది ప్రకటించనే లేదు. అసలు ఆ డబ్బులు ఏమైనట్లు
Back to Top